MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Brahmamudi: తొందరపడి అవమానపాలైన స్వప్న.. దేవునితోనే ఛాలెంజ్ చేసిన కావ్య!

Brahmamudi: తొందరపడి అవమానపాలైన స్వప్న.. దేవునితోనే ఛాలెంజ్ చేసిన కావ్య!

Brahmamudi: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుని మంచి రేటింగుని సంపాదించుకుంటుంది. కుటుంబ గౌరవం కోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టిన ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Navya G
Published : Apr 27 2023, 01:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో శత్రువులు మన ఇంటికి వచ్చినా ఆదరించే కుటుంబం మనది, స్వప్న ఇక్కడికి రావడం తప్పే కానీ మీరందరూ ఇలా గొడవ పెట్టుకోవడం ఏమీ బాగోలేదు, వదిలేయండి అంటుంది చిట్టి. చిట్టి దంపతులకు నమస్కరించి మాలాంటి వాళ్ళు మీకు బంధువులుగా తగము, మా వల్ల ఫంక్షన్ ఇలా అయినందుకు చాలా బాధపడుతున్నాం అంటూ ఏడుస్తూ స్వప్నని లాక్కొని వెళ్ళిపోతుంది కనకం. ఆ వెనకే బయలుదేరుతారు అప్పు, కృష్ణమూర్తి. మరోవైపు ఇంటికి వచ్చిన కనకంతో పెద్దది నా కన్ను కప్పి వెళ్ళిపోయింది అంటుంది వాళ్ళ పెద్దమ్మ. అప్పుడే వస్తున్న స్వప్నని చూసి ఇంతమంది ఇన్ని మాటలు అన్నా కూడా వెళ్లావు అంటే నీకు ఎంత ధైర్యం అంటూ మందలిస్తుంది పెద్దమ్మ. 

28

ఇది అక్కడికి వచ్చేవరకు మమ్మల్ని గౌరవంగానే చూసారు, వచ్చిన తర్వాత నానా మాటలు అని అవమానించారు చచ్చిపోవాలనిపించింది అంటుంది కనకం. ఏడుస్తూ తండ్రిని క్షమాపణలు చెప్పి తండ్రి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది స్వప్న. తన కాళ్లు ముట్టుకోనివ్వకుండా వెనక్కి జరిగి నన్ను ముట్టుకొని అపవిత్రం చేయకు, కన్న పాపానికి ఇంత ముద్ద పడేస్తాం ఒక మూలన పడి ఉండు అని చీవాట్లు పెడతాడు కృష్ణమూర్తి. నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అంటూ చీదరించుకుంటుంది కనకం. తన గదికి వెళ్లి ఏడుస్తుంది స్వప్న. మరోవైపు ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు నిలదీస్తే నిజం చెప్పేసిందేమో అని కంగారుపడి స్వప్నకి ఫోన్ చేస్తాడు రాహుల్.
 

38

కోపంలో ఉన్న స్వప్న, రాహుల్ మాట్లాడక ముందే, నన్ను అంతలా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్నావు.  నా మీద మోజు తీరిపోయిందా అంటూ కేకలు వేస్తుంది స్వప్న. అందుకే చెప్పాను ఇక్కడికి రావద్దు అని కానీ నువ్వే వినలేదు. నాకు కొంచెం టైం ఇవ్వు లేకపోతే నీతో పాటు నేను కూడా రోడ్డున పడాల్సి వస్తుంది అంటాడు రాహుల్. ఇదే నీకు ఇచ్చే ఆఖరి అవకాశం అంటూ ఫోన్ పెట్టేస్తుంది స్వప్న. మరోవైపు తండ్రి కి జరిగిన అవమానాన్ని తలుచుకుని బాధపడుతుంది కావ్య. ఇంత జరిగినా చూస్తూ ఊరుకున్నావు అంటూ కృష్ణుడిని నిందిస్తుంది. చూస్తూ ఉండు అవమానించిన ఈ కుటుంబమే నా తండ్రిని గౌరవంగా ఆహ్వానించేలాగా చేస్తాను అంటూ శపధం చేస్తుంది కావ్య. 

48

మరోవైపు కళ్యాణ్, అప్పు కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి అంటాడు. సరే అంటుంది అప్పు. మరోవైపు వంట గదిలో ఒక్కతే పని చేసుకుంటున్న ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి ఒక్కదానివే ఎందుకు పనిచేస్తున్నావు, శాంత ఏది అని అడుగుతుంది చిట్టి. తను సెలవులో ఉంది అంటుంది ధాన్యలక్ష్మి. నీ తోటికోడల్ని సాయానికి రమ్మనలేకపోయావా అంటుంది చిట్టి. కావ్యకి సపోర్ట్ చేశానని ఇప్పటికే నా మీద కోపంగా ఉంది, తన దగ్గరికి వెళ్తే మరింత తిడుతుంది అందుకే పాట్లు పడుతున్నాను అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు చిట్టి, కావ్య దగ్గరికి వెళ్లి కోడలు అంటే ముంగిట్లో ముగ్గులు వేయటం మాత్రమే కాదు లోగిట్లో  మనుషులకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి అంటుంది. కావ్యకి ఏమీ అర్థం కాక ఏం చేయమంటారు అని అడుగుతుంది.
 

58

శాంత సెలవులో ఉంది, మీ అత్త అలకలో ఉంది మీ చిన్నత్త ఒక్కతే కష్టపడుతుంది. అక్కడ మీ స్థానం ఖాళీగా ఉంది వెళ్లి కమ్మగా వంట చెయ్యు అంటుంది చిట్టి. అక్కడికి వెళ్లొద్దని మా అత్తగారు ఆర్డర్ వేశారు అంటుంది కావ్య. ఆమె అత్తగారిని నేను శాసిస్తున్నాను  వెళ్లి కమ్మగా వండి పెట్టు, కోడలి అధికారాన్ని కాదనే హక్కు మీ అత్తకే కాదు దాని అత్తనైన నాకే లేదు అంటూ ధైర్యం చెప్పి పంపిస్తుంది చిట్టి. భయపడుతూనే వంటగదిలోకి వచ్చిన కావ్యని  చూసి కంగారు పడుతుంది ధాన్యలక్ష్మి.

68

నిన్ను ఎక్కడ చూస్తే మీ అత్తగారు నిన్ను ఏమంటుందో తెలియదు కానీ నన్ను మాత్రం ఇదే పొయ్యి మీద కాల్చేస్తుంది అంటుంది. అదంతా అమ్మమ్మ గారు చూసుకుంటానన్నారు నాకు కూడా అమ్మమ్మగారే ధైర్యం చెప్పి పంపించారు. మీరు ఇలా కూర్చోండి అంటూ ధాన్యలక్ష్మిని పక్కన కూర్చోబెట్టి వంట ప్రారంభిస్తుంది కావ్య.కావ్య చకచకా పనిచేయటం చూసి సంతోషిస్తుంది ధాన్యలక్ష్మి.

78

మరోవైపు కళ్యాణ్ అప్పుని కలిసి మా అన్నయ్య వదినది తప్పు అని చెప్పి వదినని వదిలేయటానికి ప్లాన్ చేస్తున్నాడు.అంతకన్నా ముందే వదిన తప్పు చేయలేదని మనం నిరూపించాలి అంటాడు కళ్యాణ్. మీ ఇంట్లో కొంపలు కూల్చే వాళ్లే కాదు కొంపలు నిలబెట్టే వాళ్లు కూడా ఉంటారా అంటుంది అప్పు. అయినా నేను ఆ పని మీదే ఉన్నాను ఆల్రెడీ మా అక్క మీద ఒకన్నేసి ఉంచాను అంటుంది. మనకి చాలా తక్కువ సమయం ఉంది.

88

అవకాశాల కోసం ఎదురుచూసే కన్నా మనమే అవకాశాన్ని సృష్టించాలి అంటాడు కళ్యాణ్. తరువాయి భాగంలో వంట కావ్య చేసిందని తెలుసుకొని కోపంతో రగిలిపోతుంది అపర్ణ. వంటగదికి వెళ్ళొద్దని అత్తగారిగా ఆర్డర్ వేసాను కదా అయినా లెక్కలేదా అని అడుగుతుంది. అత్తగారిగా ఆర్డర్ వేశారు అంటే నన్ను కోడలుగా ఒప్పుకున్నట్లే కదా అంటుంది కావ్య.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth : 75 ఏళ్ల వయసులో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు
Recommended image2
Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద
Recommended image3
Karthika Deepam 2 Latest Episode:కాశీతో స్వప్నగొడవ-ఇంట్లో నుంచి పొమ్మన్న కావేరి-దీపపై నిందేసిన కాంచన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved