కౌన్ బనేగా కరోడ్‌పతి.. ఒక్క ఎపిసోడ్‌కే అమితాబ్ కు అన్ని కోట్లా? చిన్న సినిమా బడ్జెట్
సినిమాలు ప్లాప్ ల్లో ఉండి.. చేతిలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ షో అమితాబ్ చేతికి వచ్చింది. ఆ సమయంలో ఎంతమంది చేయొద్దు అని చెప్పినా..
రీసెంట్ గా బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ కల్కి చిత్రంలో కనిపించి అలరించిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కీలక పాత్ర పోషించారు. ఈ వయస్సులో కూడా ఆయన తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన ప్రముఖ క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్-16కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్‌లో ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 12న తాజా సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షోకు ఒక్కో ఎపిసోడ్ కు అమితాబ్ ఎంత ఛార్జ్ చేస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అమితాబ్ భారీగానే పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం ఒక్క ఎపిసోడ్‌కే ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుంటున్నారని వెల్లడైంది. ఇది గత అన్ని సీజన్‌ల కంటే అత్యధిక రెమ్యునరేషన్‌గా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో మొదటి సీజన్‌లో కేవలం రూ.25 లక్షలు తీసుకున్న అమితాబ్.. తాజా సీజన్‌లో 5 కోట్లకు పెంచేశారు. గతంలో 14వ సీజన్‌కు అత్యధికంగా రూ.4 కోట్లకు పారితోషికం అందుకున్నారు.
ఇక ఈ షో అమితాబ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. సినిమాలు ప్లాప్ ల్లో ఉండి.. చేతిలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ షో అమితాబ్ చేతికి వచ్చింది. ఆ సమయంలో ఎంతమంది చేయొద్దు అని చెప్పినా.. అమితాబ్ కు వేరే అప్షన్ లేక కౌన్ బనేగా కరోడ్ పతిని మొదలుపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు.. ఎన్నో సీజన్స్ నడుస్తూనే ఉన్నాయి. కానీ, అమితాబ్ మాత్రం ఎప్పుడు ఈ షోను వదిలి వెళ్ళాలి అని అనుకోలేదు.
ఫ్యాన్స్ కూడా అమితాబ్ ప్లేస్ లో మరో హోస్ట్ ను ఊహించుకోలేకపోయారు. ప్రస్తుతం అమితాబ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క కౌన్ బనేగా కరోడ్ పతి షో చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ షోకు అమితాబ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలియడంతో అభిమానులు.. ఆయన ఈ ఒక్క షో చేసుకుంటే చాలు.. సినిమాలు కూడా చేయనవసరం లేదని కామెంట్స్ పెడుతున్నారు.
జాతీయ స్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లితెర గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ). కోటి రూపాయల బహుమతి కావడంతో ఈ పోటీలో పాల్గొనాలని అందరూ ఉవ్విళ్లూరుతుంటారు. పైగా, ఈ గేమ్ షోకి వ్యాఖ్యాతగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తుండడం ముఖ్యమైన అంశం.
ఈ గేమ్ షోలో వివిధ దశల్లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో దశ దాటే కొద్దీ నగదు బహుమతి పెరగడమే కాకుండా, ప్రశ్నలు కూడా కఠినంగా ఉంటాయి. ఇక కోటి రూపాయల ప్రశ్న అయితే చెప్పనక్కర్లేదు. కంటెస్టెంట్ మేధస్సుకు, జ్ఞాపకశక్తికి పదును పెట్టేలా ఉండడమే కాదు, కొన్నిసార్లు తికమకకు గురిచేస్తుంది.