తల్లి కాబోతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోలతో శుభవార్త..
Katrina Kaif-Vicky Kaushal: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తల్లిగా ప్రమోషన్ పొందనున్నారు. కత్రినా- ,విక్కీ కౌశల్ జంట తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించారు.

తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
సినీ ఇండస్ట్రీ నుంచి వరుసగా గుడ్ న్యూస్ వెలువడుతున్నాయి. ఇటీవలే మెగా ఇంట్లోకి వారసుడు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించారు. దీంతో మెగా ఫ్యాన్స్ పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఇప్పుడు మరో స్టార్ కపుల్ పేరెంట్స్ కాబోతున్నారనీ, ఓ స్టార్ హీరోయిన్ త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందబోతుందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆ స్టార్ కపుల్ ఎవరు?
కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్
ఆ స్టార్ కపుల్ ఎవరో కాదు. బాలీవుడ్ స్టార్స్ కత్రినా కైఫ్ (Katrina Kaif) – విక్కీ కౌశల్ (Vicky Kaushal). ఈ సెలబ్రెటీ కపుల్ లైఫ్ లో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. తాజాగా కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి తల్లిదండ్రులు కాబోతున్నారని ప్రకటించారు. మెరూన్ డ్రెస్‌లో స్టన్నింగ్‌గా కనిపించారు కత్రినా. ఈ ఫోటో బయటకు రావడం తరువాత, ఫ్యాన్స్, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. “మోస్ట్ బ్యూటిఫుల్ న్యూస్!”, “యూ విల్ బీ బెస్ట్స్ పేరెంట్స్” అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
పెళ్లి కూడా హాట్ టాపికే..
విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ ల వివాహం 2021 డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్, బర్వాడాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లి సందర్భంగా పెద్ద వేడుకలతో ఇద్దరూ ఒక్కటయ్యారు. వయసులో చిన్న హీరో విక్కీ కౌశల్‌తో కత్రినా పెళ్లి చేసుకోవడం కూడా వార్తల్లో ప్రధాన చర్చాంశం అయ్యింది. పెళ్లి తరువాత, ఇద్దరూ తమ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితం పై ఎక్కువ దృష్టి పెట్టారు. కత్రినా సినిమాల్లో కొంత దూరంగా ఉండటం, సోషల్ మీడియాలో తక్కువ యాక్టివిటీ ఉండటం, లుక్‌లో మార్పులు కనిపించడం వలన "కత్రినా ప్రెగ్నెంట్" అనే రూమర్స్ తరచుగా వినిపించాయి. మొదటగా ఈ రూమర్స్‌ని జంట ఖండించింది.
స్టార్ కపుల్ కెరీర్ ఇలా
కత్రినా కైఫ్ టాలీవుడ్‌కి 2004లో వెంకటేష్ ‘మల్లీశ్వరి’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తరువాత ‘అల్లరి పిడుగు’ సినిమాలో నందమూరి బాలకృష్ణ సరసన నటించి పాపులారిటీ పొందారు. తరువాత ఆమె పూర్తిగా బాలీవుడ్‌లో స్థిరపడి స్టార్ హీరోయిన్‌గా గురింపు పొందారు. 2024లో విజయ్ సేతుపత్ తో కలిసి ‘మేరీ క్రిస్మస్’ సినిమాతో నటించారు. విక్కీ కౌశల్ బాక్సాఫీస్‌లో విజయవంతమైన ‘ఛావా’మూవీతో కెరీర్‌లో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విక్కీ రణబీర్ కపూర్, ఆలియా భట్‌లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ సినిమాలో నటిస్తున్నాడు.