MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Veerabhadrudu collection: 7వ రోజు కూడా తగ్గని 'కరుప్పు' జోరు.. వీరభద్రుడు ఎన్ని కోట్లు వసూలు చేశాడంటే?

Veerabhadrudu collection: 7వ రోజు కూడా తగ్గని 'కరుప్పు' జోరు.. వీరభద్రుడు ఎన్ని కోట్లు వసూలు చేశాడంటే?

సూర్య, త్రిష నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ వీరభద్రుడు ( కరుప్పు) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి వారంలోనూ సత్తా చాటి, ఇప్పుడు 200 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 22 2026, 11:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
7వ రోజున  కరుప్పు కలెక్షన్స్
Image Credit : Dream Warrior Pictures

7వ రోజున కరుప్పు కలెక్షన్స్

సూర్య, త్రిష కృష్ణన్ నటించిన వీరభద్రుడు ( కరుప్పు) సినిమా థియేటర్లలో వారం పూర్తి చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 7వ రోజున ఇండియాలో రూ. 8.30 కోట్ల నెట్ వసూలు చేసింది. 6వ రోజుతో పోలిస్తే దాదాపు 22 శాతం డ్రాప్ కనిపించినా, వీక్‌డేస్‌లో ఈ కలెక్షన్లు స్టడీగానే ఉన్నాయని చెప్పాలి. దేశవ్యాప్తంగా 5,000 కంటే ఎక్కువ షోలలో ఈ సినిమా ప్రదర్శించబడటం ప్రేక్షకుల ఆసక్తికి నిదర్శనం. సూర్య ఎంట్రీ సీన్లకు అభిమానులు  థియేటర్లలో విజిల్స్ వేస్తూ, ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వీరభద్రుడు సినిమాకు భారీగా పెరిగిన క్రేజ్...
Image Credit : X

వీరభద్రుడు సినిమాకు భారీగా పెరిగిన క్రేజ్...

7వ రోజు వసూళ్లతో కలిపి, 'కరుప్పు' మొత్తం ఇండియా నెట్ కలెక్షన్ రూ. 114.05 కోట్లకు చేరుకుంది. ఇండియా గ్రాస్ వసూళ్లు రూ. 132.05 కోట్లుగా ఉన్నాయి. ఓవర్సీస్ మార్కెట్లలో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. 7వ రోజున విదేశాల్లో సుమారు రూ. 3 కోట్లు వసూలు చేయడంతో, ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్ కేవలం వారంలోనే రూ. 189.05 కోట్లకు చేరింది.  200 కోట్ల క్లబ్‌లో చేరడానికి ఈ సినిమా దగ్గరలో  ఉంది. ఇది సూర్య కెరీర్‌లో మరో పెద్ద మైలురాయి అవుతుంది.

33
చాలా కాలం తరువాత హిట్ కొట్టిన సూర్య..
Image Credit : Dream Warrior Pictures

చాలా కాలం తరువాత హిట్ కొట్టిన సూర్య..

ఈ సినిమా ఆలస్యంగా విడుదల కావడంపై దర్శకుడు ఆర్జే బాలాజీ ఇటీవల స్పందించారు. 'కరుప్పు'ను మే నెలలోనే థియేటర్లలోకి తీసుకురావాలని తాను పట్టుబట్టినట్లు వెల్లడించారు. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ను దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేసినా, ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా పలుమార్లు వాయిదా పడింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో విడుదల చేసే అవకాశాలు వచ్చినా, మే నెలలో రిలీజ్ చేస్తేనే సినిమా ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని తాను గట్టిగా నమ్మినట్లు ఆర్జే బాలాజీ తెలిపారు. ఆయన నిర్ణయం సినిమాకు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది తమిళంలో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా 'కరుప్పు' నిలిచింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Recommended image3
Vijay Ajith Meet: లండన్‌లో విజయ్‌, అజిత్ ఐకానిక్‌ మీట్.. తలాని చూసి పరుగెత్తుకెళ్లి హగ్ చేసుకున్న దళపతి
Related Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన మూడు సినిమాలేంటో తెలుసా? ఆ సినిమాలు చేయకుండా ఉంటే?
Recommended image2
Lakshmi Pranathi: కోటీశ్వరుడి కూతురు.. స్టార్ హీరో భార్య, లైమ్‌లైట్‌కు దూరంగా సింపుల్ లైఫ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved