MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Kartikeya: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తికేయ దంపతులు..

Kartikeya: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరో కార్తికేయ దంపతులు..

హీరో కార్తికేయ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన ఫ్రెండ్‌, ప్రియురాలు లోహిత రెడ్డిని ఆయన మ్యారేజ్‌ చేసుకున్నారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నూతన వధువరులు. తిరుమల వెంకన్న ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 26 2021, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కార్తికేయ, ఆయన భార్య లోహిత రెడ్డి, వారి కుటుంబ సభ్యులు శుక్రవారం తిరుపతి తిరుమల శ్రీవారిని(Kartikeya Family Visits) దర్శించుకున్నారు. మొక్కుతీర్చుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కార్తికేయ జోడి చూడముచ్చటగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

`ఆర్‌ఎక్స్ 100`తో హీరోగా తనకంటూ ఓ గుర్తింపుని, ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కార్తికేయ గుమ్మకొండ ఈ నెల 21న తాను ప్రేమించిన అమ్మాయి లోహిత రెడ్డిని హైదరాబాద్‌లో వైభవంగా మ్యారేజ్‌ చేసుకున్నారు. మూడుముళ్లతో ఇష్టసఖిని తన వశం చేసుకున్నారు కార్తికేయ. అత్యంత గ్రాండ్‌గా జరిగిన ఈ మ్యారేజ్‌ ఈవెంట్‌లో సినీ, రాజకీయ ప్రముఖులు, కార్తికేయ బంధుమిత్రులు పాల్గొన్నారు. నూతన వధువరులను ఆశీర్వదించారు. 

36

కార్తికేయ ఇటీవల తాను నటించిన `రాజా విక్రమార్క` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన ప్రియురాలు, కాబోయే భార్య లోహతని అభిమానులకు పరిచయం చేశాడు. అంతేకాదు స్టేజ్‌పైనే ఆమెకి తన లవ్‌ ప్రపోజ్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేశారు. 2010లో లోహితని మొదటిసారిగా కలుసుకున్నానని, వరంగల్‌ నిట్‌(నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్‌ కోర్సు చదివేటప్పుడు ప్రేమలో పడ్డట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఏ రోజు ఇలా ప్రాపర్‌గా లవ్‌ ప్రపోజ్‌ చేయలేదన్నారు కార్తికేయ. ఒక మెమరీగా ఉండాలనీ ఇలా ప్లాన్‌ చేసినట్టు వెల్లడించారు. 

46

అంతకు ముందు కార్తికేయకి, లోహితకి ప్రైవేట్‌ ఈవెంట్‌గా ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. అయితే `రాజా విక్రమార్క` ఈవెంట్‌లోనే ఈ నెల 21న తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. ఈ రోజు ఆదివారం గ్రాండ్‌గా తమ వెడ్డింగ్‌ ఈవెంట్‌ని పూర్తి చేసుకున్నారు కార్తికేయ. ప్రస్తుతం ఆయన మ్యారేజ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

56

`ఆర్‌ఎక్స్ 100`తో బంపర్‌ హిట్‌ని అందుకుని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు కార్తికేయ. ఊహించని ఫాలోయింగ్‌ ఆయన్ని వరించింది. ఆ తర్వాత కార్తికేయ వరుసగా `హిప్పి`, `గుణ 369`, `90ఎంఎల్‌`, `చావు కబురు చల్లగా`, `రాజా విక్రమార్క` చిత్రాల్లో నటించారు. అంతేకాదు నాని `గ్యాంగ్‌ లీడర్‌` చిత్రంలో విలన్‌గానూ మెప్పించారు. ప్రస్తుతం ఆయన తమిళంలో అజిత్‌ హీరోగా రూపొందుతున్న `వాలిమై` చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. 

66

హీరో కార్తికేయ-లోహిత రెడ్డిల ల పెళ్లి వేడుకలో  చిరంజీవి, అల్లు అరవింద్‌, సాయికుమార్‌, దిల్‌రాజ్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, ఆమె ప్రియుడు సౌరభ్‌ దింగ్రా, దర్శకుడు అజయ్‌ భూపతి, సుధాకర్‌ కోమాకుల, రోహిత్‌, తనికెళ్ల భరణి వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. 

also read: Niharika: నేను నటించడం నా భర్తకు ఇష్టం లేదు.. సమంతని ఉదాహరణగా చెబుతూ నిహారిక కామెంట్స్

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
కాపీ కొట్టి డిగ్రీ పాస్ అయిన స్టార్ హీరో ఎవరో తెలుసా? స్కూల్ గేట్ చూస్తే టాయిలెట్ కు వెళ్లాల్సిందే..
Recommended image2
ANR: ఏఎన్నార్ తొలి సంపాదన ఎంతో తెలుసా? దాంతో ఏం చేశారు? అక్కినేని వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు?
Recommended image3
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved