MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వంటలక్క అభిమానులకు గుడ్ న్యూస్, త్వరలో కార్తీకదీపం సీజన్ ‌2...? నిజమెంత..?

వంటలక్క అభిమానులకు గుడ్ న్యూస్, త్వరలో కార్తీకదీపం సీజన్ ‌2...? నిజమెంత..?

కార్తీక దీపం ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ న్యూస్.. ఒక గుడ్ న్యూస్. ఈరోజు ఎపిసోడ్ తో కార్తీకదీపం సీరియల్ కు ఎండ్ కార్డ్ పడుతుండగా.. త్వరలో ఈ సీరియల్ మరో సీజన్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో నిజమెంత. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Jan 23 2023, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కార్తీక దీపం సీరియల్‌ గురించి తెలియని తెలుగువారంటూ ఉండరూ..  ఏళ్లతరబడి టెలివిజన్ తెరను ఏలిన ఈ బుల్లి తెర సీరియల్...  స్టార్‌ హీరో సినిమాలకు మించిన రేటింగ్‌తో దూసుకుపోతూ వచ్చింది. .. ఒకానొక సమయంలో  దేశంలోనే నంబర్‌ వన్‌ సీరియల్‌గా నిలిచింది కార్తీక దీపం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎంత గొప్ప సీరియల్ అయినా..ఎంత భారీ వ్యూవర్ షిప్ ఉన్నా.. ఏదో ఒక రోజు శుభం కార్డు పడాల్సిందే.. లేకపోతే  ఇప్పటికే సాగదీత, సుత్తి.. అంటూ పేరు తెచ్చుకున్న సీరియల్స్ కు ఇంకా కొత్త కొత్త పేర్లు పెట్టి తిట్టడం స్టార్ట్ చేస్తారు జనాలు. ఇక ఇదే ఆలోచన వచ్చినట్టుంది కార్తీక దీపం సీరియల్ టీమ్ కు అందుకే దాదాపు ఏడేళ్లకు పైగా కొనసాగుతునన కార్తీక దీపం సీరియల్ కు ఎండ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించకున్నారు. 
 

37

ఏళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన కార్తీక దీపం సీరియల్‌ కి ఈరోజు (జనవరి 23) ఎపిసోడ్ తో  శుభం కార్డు పడనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని కార్తీకదీపం  సీరియల్‌ టీమ్ కూడా కన్ ఫార్మ్ చేసింది. ఇక క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ ఎలా ఉండబోతుందా అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈరోజుతో ఈ సీరియల్ అయిపోతుందని తెలిసి బాధపడుతున్నారు. వంటలక్క కనిపించదని ఫీల్ అవుతున్నారు. 

47

వంటలక్క, డాక్టర్‌బాబు, మోనిత, సౌందర్యల కు సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉంది.  ఇక కార్తీక దీపం అయిపోతుందని తెలిసిన దగ్గర నుంచి.. వీరంతా ఇక కనిపించరని టీవీ అభిమానులు బాధపడుతున్నారు. ఆ రేంజ్‌లో వీరు ప్రేక్షకులని అలరించారు. ఇక కొందరైతే.. ఈ సీరియల్‌ పార్ట్‌-2 రావాలని కూడా  కోరుకుంటున్నారు. 

57

అయితే ఇప్పటి వరకూ ప్లే అవుతున్న సీరియల్ అసంపూర్తిగానే ఎండ్ అవుతుంది. పెద్దగా క్లారిటీ లేకుండా క్లైమాక్స్ కు వచ్చింది. దాంతో ఈ సీరియల్ కు సీజన్ 2 వస్తుందని  అభిమానులు భావిస్తున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే.. కార్తీక దీపం సీరియల్‌ ఫేర్‌వెల్‌ పార్టీలో వంటలక్క.. మళ్లీ వస్తాం అని హింట్‌ ఇచ్చింది. దాంతో త్వరలోనే కార్తీక దీపం సీజన్‌-2 రాబోతుందంటూ ప్రచారంజరుగుతుంది. 

67

కార్తీకదీపం సీరియల్ సీజన్ 2 కోసం ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ స్టార్ట్ చేశారని ప్రచారం సాగుతోంది. అచ్చొచ్చిన కార్తీక దీపం 2 టైటిల్‌తోనే ఈ సీరియల్‌ను కూడా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అందులోనూ వంటలక్క.. డాక్టర్ బాబు కూడా ఇందులో ఉండబోతున్నారట. ఈ న్యూస్ ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. 

77

అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం ఇంత వరకూ రాలేదు. అదే కనుక వస్తే.. కార్తీకదీపం ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. ఇప్పటికే ఈ విషయంలో హోప్స్ తో ఉన్నారు లేడీ ఫ్యాన్స్. మరి చూడాలి ఆడియన్స్ కోరిక మేరకు త్వరలోనే కార్తీకదీపం సీజన్ 2 అలరిస్తుందో లేదో. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Recommended image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image3
కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved