- Home
- Entertainment
- DNK 6 Days Collections: చిరు, నాగ్, చరణ్, ఎన్టీఆర్ లకు మౌళి ఝలక్.. దొంగ నా కొడుక్కి మతిపోయే వసూళ్లు
DNK 6 Days Collections: చిరు, నాగ్, చరణ్, ఎన్టీఆర్ లకు మౌళి ఝలక్.. దొంగ నా కొడుక్కి మతిపోయే వసూళ్లు
కుర్ర హీరో మౌళి.. బిగ్ స్టార్స్ కి షాక్ ఇచ్చాడు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్ ప్రమోట్ చేసిన చిత్రానికి పెద్ద ఝలక్ ఇచ్చాడు. దొంగ నా కొడుకుతో బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతున్నాడు.

చిరు, నాగ్, చరన్, తారక్‌లకు మౌళి షాక్
కుర్ర హీరో మౌళి ఇప్పుడు హాట్ కేక్ అయిపోయాడు. ఇప్పటికే `90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్`, `లిటిల్ హార్ట్స్`తో తానేంటో నిరూపించుకున్నాడు. ఇటీవల `దొంగ నా కొడుకు` అనే వెరైటీ టైటిల్‌తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రం గత శుక్రవారం(నవంబర్ 13న)విడుదలైంది. ఇందులో సుష్మిత శెట్టి హీరోయిన్గా నటించింది. అలీ, రజిత, రఘుబాబు, భద్రం, గుండు సుదర్శన్, ప్రియా కీలక పాత్రలు పోషించారు. శ్రీను కంబాల దర్శకత్వం వహించారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. చాలా వరకు నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం పరిస్థితి రివర్స్ గా ఉంది. ఊహించని విధంగా వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యిందంటున్నారు. అంతేకాదు మౌళి ఇప్పుడు చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని వంటి వారు ప్రమోట్ చేసిన చిత్రానికి పెద్ద ఝలక్ ఇచ్చాడు.
దొంగ నా కొడుకు మూవీ కలెక్షన్లు
`దొంగ నా కొడుకు` విడుదలై ఆరు రోజులు పూర్తి చేసుకుంది. ఈ మూవీ ఆరో రోజు రూ.66లక్షల నెట్‌ని వసూలు చేసింది. దాదాపు రూ.74లక్షల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఓవరాల్‌గా ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.9.26కోట్ల గ్రాస్, రూ.8.04కోట్ల నెట్ వసూళు చేసిందని సాక్నిల్క్ సైట్ వెల్లడించింది.
ఈ మూవీకి అయిన బడ్జెట్ 5 కోట్లు. ప్రమోషన్స్ కోటిన్నర. మొత్తంగా ఆరున్నర కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే సినిమాకి 8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయ్యిందట. అంటే బాక్సాఫీసు వద్ద సినిమా హిట్ కావాలంటే సుమారు రూ.16కోట్ల గ్రాస్ రావాలి. ఇంకా ఆరుకోట్ల గ్రాస్, మూడు కోట్ల షేర్ రావాలని సమాచారం.
అయితే మూడు రోజుల్లోనే ఇది పది కోట్లు వసూలు చేసిందని, సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యిందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పుడు వచ్చిన కలెక్షన్లకి ఓవర్సీస్ వసూళ్లు యాడ్ కావాల్సి ఉంది. సాక్నిల్క్ లెక్కల ప్రకారం ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కి దగ్గరలో ఉందని చెప్పొచ్చు. ఏదేమైనా ఈ చిత్రం సేఫ్ ప్రాజెక్ట్ అని టాక్.
దొంగ నా కొడుకులో సగం వసూలు చేయని చిరు, నాగ్, తారక్ చరణ్ ప్రమోట్ చేసిన ఇట్లు అర్జున
ఇదిలా ఉంటే మౌళి ఇప్పుడు బిగ్ స్టార్స్ కి ఝలక్ ఇచ్చాడు. చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, రామ్ చరన్, నాని వంటి స్టార్స్ ప్రమోట్ చేసిన `ఇట్లు అర్జున` చిత్రానికి పెద్ద షాక్ ఇచ్చాడు. ఇది కూడా `దొంగ నా కొడుకు`తోపాటే విడుదలైంది. ఇది ఆరు రోజుల్లో కేవలం రూ.5.38కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఇంత మంది బిగ్ స్టార్స్ ప్రమోట్ చేసిన సినిమా కూడా మౌళి `దొంగనా కొడుకు`లో సగానికే పరిమితమయ్యింది.
ఆ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దగా ఉంది. బడ్జెట్ 8 టైమ్స్ ఎక్కువగా ఉంది. ఈ లెక్కన తక్కువ బడ్జెట్‌తో బ్రేక్ ఈవెన్ అవ్వడంతోపాటు `ఇట్లు అర్జున` చిత్రానికి డబుల్ వసూళ్లు రాబట్టి పెద్ద హీరోలకే షాకిచ్చాడు మౌళి. ఇది నిజమైన సక్సెస్‌గా చెప్పొచ్చు. స్టార్ వ్యాల్యూ కంటే కంటెంట్ ముఖ్యమని నిరూపించాడు.











