MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • చిరంజీవి దుర్మార్గుడు, సెట్‌లో రాక్షసత్వం చూపించారు.. మెగాస్టార్‌ని అసహ్యించుకున్న హీరో, పైగా అభిమాని కూడా

చిరంజీవి దుర్మార్గుడు, సెట్‌లో రాక్షసత్వం చూపించారు.. మెగాస్టార్‌ని అసహ్యించుకున్న హీరో, పైగా అభిమాని కూడా

మెగాస్టార్ చిరంజీవిపై హీరో జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక దుర్మార్గుడు అని, `ఘారానా మొగుడు` సినిమా షూటింగ్‌లో చిరు చేసిన పని బయటపెట్టాడు. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : May 24 2025, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆటుపోట్ల నుంచి మెగాస్టార్ వరకు
Image Credit : our own

ఆటుపోట్ల నుంచి మెగాస్టార్ వరకు

మెగాస్టార్ చిరంజీవి దాదాపు ఐదు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో హీరోగా రాణిస్తున్నారు. ఎలాంటి బాక్‌గ్రౌండ్‌ లేకుండా స్వయంకృషితో నటుడిగా ఎదిగాడు. మెగాస్టార్ గా రాణిస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు 156 సినిమాలు చేశారు. 

దాదాపు ఈ ఐదు దశాబ్దాల జర్నీలో తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశారు. అవమానాలు ఎదుర్కొన్నారు, కెరీర్‌ పీక్‌ని చూశారు. అన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. తిరుగులేని మెగాస్టార్‌గా రాణిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఎన్టీఆర్‌ నుంచి క్రమశిక్షణ, నిబద్ధత
Image Credit : Megastar Chiranjeevi

ఎన్టీఆర్‌ నుంచి క్రమశిక్షణ, నిబద్ధత

చిరంజీవి క్రమశిక్షణకు మారు పేరు అంటుంటారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల నుంచి అది నేర్చుకున్నారు చిరు. సినిమా షూటింగ్‌ అవుతుందంటే సెట్‌లో అరగంట ముందే ఉండేవారని ఆయనతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, ఇతర ఆర్టిస్ట్, టెక్నీషియన్లు చెబుతుంటారు. 

అప్పట్లో ఎలాంటి యాక్షన్‌ సీన్లు అయినా ఆయనే స్వయంగా చేసేవారట. అదే సమయంలో షూటింగ్‌లో టైమ్ వేస్ట్ అవ్వడానికి కూడా ఒప్పుకునే వారు కాదట. ముఖ్యంగా తన వల్ల లేట్‌ అనే దాన్ని సహించలేరట.

36
చిరంజీవి దుర్మార్గుడు అంటూ అసహ్యించుకున్న జేడీ చక్రవర్తి
Image Credit : Asianet News

చిరంజీవి దుర్మార్గుడు అంటూ అసహ్యించుకున్న జేడీ చక్రవర్తి

ఈ క్రమంలో ఇతరులకు కొంత ఇబ్బంది కలిగిన సందర్భాలు కూడా ఉంటాయి. అయితే `ఘరానా మొగుడు` సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన ఓ ఘటన పంచుకున్నారు హీరో జేడీ చక్రవర్తి. ఆయన మెగాస్టార్ కి పెద్ద అభిమాని కూడా.

 కానీ చిరంజీవి ఒక దుర్మార్గుడు, సెట్‌లో రాక్షసత్వం చూపించాడని కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో చిరంజీవిపై ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆయన్ని ఆ సమయంలో అసహ్యించుకున్నట్టు తెలిపారు జేడీ చక్రవర్తి. మరి ఇంతకి ఏం జరిగిందంటే.

46
`ఘరానా మొగుడు` క్లైమాక్స్ షూటింగ్‌లో జరిగిన ఘటన
Image Credit : our own

`ఘరానా మొగుడు` క్లైమాక్స్ షూటింగ్‌లో జరిగిన ఘటన

అది 1992. జేడ చక్రవర్తి.. రామ్‌ గోపాల్‌ వర్మ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. వీరు నాగార్జునతో `అంతం` మూవీని రూపొందిస్తున్నారు. అదే సమయంలో చిరంజీవి `ఘారానా మొగుడు` సినిమా షూటింగ్‌ జరుగుతుంది. 

వీరి రెండు సినిమాలు పక్క పక్కనే చిత్రీకరణ జరుగుతున్నాయట. ఆ సమయంలో `ఘరానా మొగుడు` క్లైమాక్స్ షూట్‌ చేస్తున్నారట. అందులో భాగంగా చిరంజీవిపై యాక్షన్‌ సీన్లు తీస్తున్నారు. వరుసగా ఎనిమిది రోజుల షూటింగ్‌ అది.

56
ఎనిమిది రోజులు కారులోనే చిరంజీవి బస
Image Credit : our own

ఎనిమిది రోజులు కారులోనే చిరంజీవి బస

ఫైటర్లు మారుతున్నారు, యూనిట్లు మారుతున్నాయి. కానీ చిరంజీవి మాత్రం ఆ ఎనిమిది రోజులు అక్కడే కారులోనే పడుకున్నాడట. అప్పుడు కార్వాన్‌ లేదు. షాట్ గ్యాప్‌లో వెళ్లి తన కారులోనే బయటపడుకునేవాడట చిరు. 

ఆయనొక సూపర్‌ స్టార్‌, పైగా తన అభిమాన హీరో. అలాంటిది ఇలా కారులో పడుకోవడం జేడీకి నచ్చలేదట. దీంతో చిరు వద్దకు వెళ్లి సర్‌ మీరు మేకప్‌ రూమ్‌లో పడుకోవచ్చు, కానీ ఇలా కారులో పడుకోవడం ఏం బాగాలేదు, నాకు నచ్చడం లేదు అన్నాడట.

66
చిరంజీవి మాటలకు షాక్‌ అయిన జేడీ చక్రవర్తి
Image Credit : our own

చిరంజీవి మాటలకు షాక్‌ అయిన జేడీ చక్రవర్తి

అప్పుడు చిరంజీవి చెప్పిన మాటలకు షాక్‌ అయ్యాడట జేడీ. `ఏం లేదండీ, ఇప్పుడు నేను లోపల పడుకుంటే మోహన్‌(అసిస్టెంట్‌) లేపడు. బయటేపడుకుంటే డైరెక్టర్‌ మైక్‌లో రెడీ రెడీ, చిరంజీవిగారిని పిలవండి అనగానే నేను లేచి వెళ్లిపోతున్నా, ఆ గ్యాప్‌ కూడా ఇవ్వకూడదు అన్నారు` అని తెలిపారు జేడీ చక్రవర్తి. ఆయన పని రాక్షసుడు అని తెలిపారు జేడీ.

 చిరంజీవిపై ప్రేమతోనే ఆయన ఈ కామెంట్‌ చేయడం విశేషం. ఇక `ఘరానా మొగుడు` మూవీ 1992 ఏప్రిల్ 9న విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. డిస్ట్రిబ్యూటర్లకి 10 కోట్ల షేర్‌ని సాధించిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Related Stories
Recommended image1
3వేల కోట్ల సినిమాలు చేసినా ఏం ప్రయోజనం, సమంతని టచ్‌ చేయలేకపోయిన రష్మిక, టాప్‌ 10 పాపులర్‌ హీరోయిన్లు
Recommended image2
జయసుధ చేసిన తొలి యాడ్‌ ఏంటో తెలుసా? ఆడవాళ్లకే కాదు, మగవాళ్లకి కూడా మతిపోగొట్టిన యాడ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved