- Home
- Entertainment
- Venkatesh: కుర్చీ కూడా వేయోద్దు, ఎవరూ మాట్లాడొద్దు.. సెట్లో వెంకటేష్‌ని దారుణంగా అవమానించిన నిర్మాత
Venkatesh: కుర్చీ కూడా వేయోద్దు, ఎవరూ మాట్లాడొద్దు.. సెట్లో వెంకటేష్‌ని దారుణంగా అవమానించిన నిర్మాత
Venkatesh: వెంకటేష్‌కి సెట్లో దారుణమైన అవమానం జరిగింది. ఏకంగా నిర్మాతనే ఆయనకు కనీసం కుర్చీ కూడా వేయోద్దని, ఆయనతో మాట్లాడొద్దని సెట్లో చెప్పారట. మరి ఆ సినిమా ఏంటి? ఆ నిర్మాత ఎవరనేది చూస్తే.

వెంకటేష్‌ని అవమానించిన నిర్మాత
విక్టరీ వెంకటేష్ వివాదాలకు అతీతం. అందరితోనూ బాగుంటారు. తన పనేదో తాను చూసుకుంటాడు. బయటకు వచ్చినప్పుడుగానీ, ఏదైనా ఈవెంట్లకి వచ్చినప్పుడు సరదాగా ఉంటారు. రచ్చ రచ్చ చేసి వెళ్తుంటారు. ఆయన సినిమా షూటింగ్లో గొడవలు జరిగాయని వినడం చాలా అరుదు. ఇటీవల కాలంలో అయితే లేవు. కానీ ఒక నిర్మాత మాత్రం వెంకటేష్‌ని దారుణంగా అవమానించాడట. ఆయన షూటింగ్‌కి వస్తే సెట్లో కనీసం కుర్చీ కూడా వేయోద్దని చెప్పాడట. అంతేకాదు ఎవరూ మాట్లాడొద్దని అందరికీ కండీషన్ కూడా పెట్టాడట. అసలేం జరిగిందంటే?
శ్రీనివాస కల్యాణం కంటే, త్రిమూర్తుల మూవీపై వెంకటేష్ మోజు
1987లో వెంకటేష్.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో కాట్రగడ్డ మురారి నిర్మాతగా `శ్రీనివాస కల్యాణం సినిమాలో నటించారు. అదే సమయంలో `త్రిమూర్తులు` అనే సినిమాలో కూడా నటించాడు వెంకటేష్. రెండూ ఏక కాలంలో షూటింగ్ జరిగాయి. `శ్రీనివాస కల్యాణం` సినిమా చివరి దశలో ఉంది. `త్రిమూర్తులు` మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని డబ్బింగ్ వర్క్ జరుపుకుంటోంది. అయితే `శ్రీనివాస కల్యాణం` కంటే `త్రిమూర్తులు` మూవీ భారీ సినిమా, బడ్జెట్ వైజ్, కాస్టింగ్ పరంగానూ. దీంతో వెంకటేష్‌కి ఆ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడట. అంతకు ముందు ఆయనకు వరుసగా ఫ్లాప్‌లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే డిజాస్టర్లు ఉన్నాయి. దీంతో `త్రిమూర్తులు` మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడట. ఈ క్రమంలో `శ్రీనివాస కల్యాణం` మూవీని లైట్ తీసుకున్నాడట వెంకీ.
వెంకీకి పారితోషికం కూడా ఇవ్వని నిర్మాత
అయితే సినిమా చివరి షెడ్యూల్ ఉంది. సెట్లో వెంకటేష్ హడావుడి చేశాడట. త్వరగా చేయండి, `త్రిమూర్తులు` సినిమా డబ్బింగ్ వర్క్ ఉందని, వెళ్లాలి అంటూ ఆత్రం చేశాడట . కానీ ఆ రోజు డేట్స్ `శ్రీనివాస కల్యాణం` మూవీకే ఉన్నాయి. ఈ మూవీ కాకుండా మరో చిత్రం డబ్బింగ్ చెప్పాలని చెప్పి షాట్ పెట్టకుండానే వెళ్లిపోయాడట వెంకీ. ఈ విషయం నిర్మాత కాంట్రగడ్డ మురారికి తెలిసింది.
దీంతో మళ్లీ వెంకటేష్‌పై షూటింగ్ చేయాల్సింది. నెక్ట్స్ డే షూటింగ్ క్యాన్సిల్ చేయించాడట నిర్మాత. ఆ తర్వాత రోజు పెట్టించాడట. వెంకటేష్ వస్తే కనీసం కుర్చీ కూడా వేయోద్దని, ఎవరూ ఆయనతో మాట్లాడొద్దని యూనిట్‌కి చెప్పాడట. ఆయన మాటతో ఎవరూ వెంకటేష్‌తో మాట్లాడలేదట. దీంతో చాలా అవమానంగా ఫీలయ్యాడట వెంకటేష్.
ఇక సినిమా షూటింగ్ అయిపోయింది. రిలీజ్‌కి రెడీగా ఉంది. వెంకటేష్‌కి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వలేదు. కేవలం అడ్వాన్స్ మాత్రమే ఇచ్చాడట నిర్మాత. పారితోషికం అడిగితే ఇవ్వనని చెప్పేశాడట. దీంతో వెంకీ సౌత్ ఇండియాలో ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ `పెప్సీ`లో సభ్యత్యం తీసుకొని మరీ ల్యాబ్‌కి నోటీసులు పంపించారట. కానీ దాన్ని లెక్కచేయలేదట నిర్మాత కాట్రగడ్డ మురారి. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయనే కాదు ప్రముఖ రైటర్, జర్నలిస్ట్ శ్రీకాంత్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు.
ఇందులో కొసమెరుపు ఏంటంటే వెంకటేష్ ఆసక్తి చూపించిన `త్రిమూర్తులు` మూవీ డిజాస్టర్‌గా నిలిస్తే, `శ్రీనివాస కల్యాణం` మూవీ మంచి విజయాన్ని సాధించింది. వెంకటేష్‌కి రిలీఫ్నివ్వడం విశేషం.











