MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode:సూరజ్ స్టాల్లో జ్యూస్ లు అమ్మిన జ్యో-శివన్నారాయణ బాధ-సూరజ్ వార్నింగ్

Karthika Deepam 2 Today Episode:సూరజ్ స్టాల్లో జ్యూస్ లు అమ్మిన జ్యో-శివన్నారాయణ బాధ-సూరజ్ వార్నింగ్

Karthika Deepam 2 Today Episode (జూన్ 1వ తేదీ)లో సూరజ్ స్టాల్ లో పనిచేసిన జ్యో. మనుమరాలి ఫోటోలు చూసి బాధపడ్డ శివన్నారాయణ. కస్టమర్ తో గొడవ పెట్టుకున్న జ్యో. మరోసారి తన జోలికి రావద్దని జ్యోకు సూరజ్ వార్నింగ్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే.. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 01 2026, 08:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో జ్యోత్స్న కోసం స్టాల్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు సూరజ్. అప్పుడే జ్యోత్స్న, పారులను తీసుకొని స్టాల్ దగ్గరకు వస్తాడు కార్తీక్. బ్రదర్ టైమింగ్ సూపర్. అదిగో మన స్పెషల్ గెస్ట్ వచ్చింది అంటాడు సూరజ్. కార్తీక్, సూరజ్ హాయ్ చెప్పుకుంటారు. ఆ తర్వాత జ్యోను స్టాల్ దగ్గరకు తీసుకెళ్తాడు కార్తీక్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
జ్యో షాక్
Image Credit : Jiohotstar

జ్యో షాక్

సూరజ్ స్టాల్ దగ్గర జ్యోత్స్న వల్ల తప్పు జరిగిందన్నట్లు రాసిన ఫ్లెక్సీలు ఉంటాయి. అవి చూసి షాక్ అవుతుంది జ్యోత్స్న. ఈ ఫ్లెక్సీల గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటుంది జ్యోత్స్న. నీ వల్లే కదా చెడ్డపేరు వచ్చింది.. దాన్ని పోగొట్టాల్సింది కూడా నువ్వే అంటాడు కార్తీక్. మీరు చూసుకోలేదు కానీ.. సోషల్ మీడియాలో కూడా గట్టిగానే పబ్లిసిటీ చేశాం అంటాడు కార్తీక్.

జ్యోత్స్నని షాప్ లో పని చేసే అమ్మాయిలా రెడీ చేస్తారు సూరజ్ , కార్తీక్. షాప్ లో జ్యోత్స్న జ్యూస్ లు తయారు చేసి, సర్వ్ చేస్తుంది. ఆ ఫోటోలను శివన్నారాయణకు పంపిస్తాడు కార్తీక్. 

36
శివన్నారాయణ బాధ
Image Credit : Jiohotstar

శివన్నారాయణ బాధ

మనుమరాలి ఫోటోలు చూసి బాధపడతాడు శివన్నారాయణ. ఈ ఇంటి వారసురాలు ఎలాంటి పరిస్థితి తెచ్చుకుందో చూడండి. అని సుమిత్ర వాళ్లకు ఆ ఫోటోలను చూపిస్తాడు. సూరజ్ రివేంజ్ కోసం ఈ పని చేసినట్లు అనిపించలేదని అంటారు దీప, కాంచన. తనకి బుద్ధి రావాలంటే ఇలాంటివి చేయించాల్సిందే అంటారు దశరథ, సుమిత్ర.

46
పారు బాధ
Image Credit : Jiohotstar

పారు బాధ

మరోవైపు పనిచేస్తున్న జ్యోత్స్నను చూసి బాధపడుతుంది పారు. కార్తీక్ ని పిలిచి దానికోసం ఒక కూలర్ పెట్టించురా అంటుంది. ఇది శివన్నారాయణ బడ్జెట్ కాదు. సూరజ్ బడ్జెట్... నో కూలర్, నో ఏసీ. పని చేయాల్సిందే అంటాడు కార్తీక్. కాస్త నవ్వుతూ కస్టమర్లను పిలువు అని జ్యోతో అంటాడు కార్తీక్. నేను అలా చేయలేను అంటుంది జ్యోత్స్న. కస్టమర్లని పిలవకపోతే ఈవినింగ్ వరకు ఇక్కడే పనిచేయాలి అంటాడు సూరజ్.

56
జ్యో గొడవ
Image Credit : Jiohotstar

జ్యో గొడవ

సూరజ్ హెల్తీ ఫుడ్స్ గురించి 4 మంచి మాటలు చెప్తుంది జ్యోత్స్న. అప్పుడే ఓ కస్టమర్ వచ్చి జ్యూస్ అడుగుతాడు. ఈ స్టాల్ ముందు అన్నీ నీ ఫొటోలే ఉన్నాయేంటి అని అడుగుతాడు కస్టమర్. స్టాల్ పెట్టుకునేదానిలా కనిపిస్తున్నానా అంటుంది జ్యోత్స్న. అవును అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు కస్టమర్. అతనితో గొడవ పడుతుంది జ్యోత్స్న. స్పెషల్ జ్యూస్ అని చెప్పి మిక్సీలో అన్నీ వేసి తయారు చేసిన జ్యూస్ ఇవ్వబోతుంది జ్యోత్స్న. అడ్డుకుంటాడు సూరజ్. అతని కోసం వేరే జ్యూస్ తయారు చేసి ఇస్తాడు.

66
సూరజ్ వార్నింగ్
Image Credit : Jiohotstar

సూరజ్ వార్నింగ్

కాసేపటికి ఇప్పటివరకు నీ షాప్ లో పనిచేయడమే చాలా ఎక్కువ అని ఆప్రాన్ తీసి విసురుకొట్టి కారు ఎక్కుతుంది జ్యోత్స్న. కారు దగ్గరికి వెళ్లిన సూరజ్.. కాలం ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉంటుందని అనుకోవద్దు. నిన్న మీది, ఈ రోజు నాది. మరోసారి నా జోలికి రావద్దని జ్యోకు వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Recommended image2
Vijay Sethupathi: బిగ్ బాస్‌లో విజయ్ సేతుపతి కామెంట్ల దుమారం.. సీఎం విజయ్‌ను టార్గెట్ చేశాడా? విజయ్ టీవీ క్లారిటీ
Recommended image3
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: నష్టపరిహారం కింద డబ్బులు వద్దన్న సూరజ్-జ్యో తిక్క కుదిరేలా కండీషన్!
Recommended image2
Karthika Deepam 2 Today Episode:జ్యోతో ఆడుకున్న కార్తీక్, సూరజ్-జ్యోని CEOగా పనికిరావన్న శివన్నారాయణ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved