MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: నష్టపరిహారం కింద డబ్బులు వద్దన్న సూరజ్-జ్యో తిక్క కుదిరేలా కండీషన్!

Karthika Deepam 2 Today Episode: నష్టపరిహారం కింద డబ్బులు వద్దన్న సూరజ్-జ్యో తిక్క కుదిరేలా కండీషన్!

Karthika Deepam 2 Today Episode (మే 29వ తేదీ)లో జ్యో వల్ల తనకు జరిగిన నష్టానికి పరిహారం డిమాండ్ చేసిన సూరజ్. రూ. 10 లక్షలు ఇస్తానన్న శివన్నారాయణ. డబ్బులు వద్దన్న సూరజ్. జ్యో తిక్క కుదిరే కండీషన్ పెట్టిన సూరజ్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : May 29 2026, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో జ్యోత్స్న వల్ల నాకు నష్టం జరిగింది. నా మర్యాద పోయింది. నా బిజినెస్ దెబ్బతింది. జనాల్లో నాపై నమ్మకం పోయింది. నాకు న్యాయం కావాలి అంటాడు సూరజ్. ఇప్పటికప్పుడు అంటే ఎలా బ్రదర్ అంటాడు కార్తీక్. సాయంత్రం వరకు టైమ్ ఇస్తాను. నాకు నష్టపరిహారం ఇప్పించండని చెప్పి వెళ్లిపోతాడు సూరజ్. వాడొక వేస్ట్ ఫెలో తాత. సూరజ్ లాంటి వీధి గూండాలను ఎంకరేజ్ చేస్తే, రోజుకు ఒకరు ఇంటికి వచ్చి గొడవ చేస్తారు. వాడి గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని లోపలికి వెళ్లిపోతుంది జ్యోత్స్న. వెనకాలే వెళ్తుంది పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
పారు ఫైర్
Image Credit : Jiohotstar

పారు ఫైర్

సూరజ్ మాటలను గుర్తు చేసుకుంటారు పారు, జ్యో. నువ్వు వెంటనే తట్టా బుట్టా సర్దుకొని ప్రపంచ యాత్రకు వెళ్లు, ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకు. ఎప్పుడో ఏదో ఒక పెంట పెడ్తూనే ఉంటావు అని జ్యోపై ఫైర్ అవుతుంది పారు. సూరజ్ లాంటి ఫుట్ పాత్ గాళ్లకు కూడా నేను భయపడాలా? వాడెంతా? వాడి బతకెంతా? వాడొక పెద్ద ఈగోయిస్ట్. అలాంటి వాళ్లకు డబ్బున్న మనలాంటి వాళ్లంటే అసూయ. అందుకే నాతో గొడవ పెట్టుకున్నాడు వానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటుంది జ్యోత్స్న. అప్పుడే శివన్నారాయణ పిలుస్తాడు.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: కార్తీక్ మాటలకు కరిగిపోయిన శివన్నారాయణ- జ్యోకు షాక్ ఇచ్చిన సూరజ్
Related image2
Karthika Deepam 2 Today Episode: చిచ్చు పెట్టిన జ్యో- శివన్నారాయణ ఉగ్రరూపం- కార్తీక్ కి చెంప దెబ్బ
37
నాపై నిందలు వద్దు
Image Credit : Jiohotstar

నాపై నిందలు వద్దు

హాల్లోకి వస్తుంది జ్యోత్స్న. అసలు నీకు, ఆ ఫుట్ పాత్ వెండర్ కు గొడవ ఏంటీ? అతని స్టాల్ తీసేయించాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతాడు దశరథ. సూరజ్ గురించి చీప్ గా మాట్లాడుతుంది జ్యోత్స్న. తప్పు నీదే అని మీ బావ సాక్ష్యం కూడా చెప్పాడు కదా అంటుంది సుమిత్ర. పిల్లికి ఎలుక సాక్ష్యంలా ఉంది. బావ ఎప్పుడూ బయటి వాళ్లనే సపోర్ట్ చేస్తాడు అంటుంది జ్యోత్స్న. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటే ఎలా అంటాడు కార్తీక్. మీ ఆవిడను సీఈఓను చేయడానికి నాపై నిందలు వేయాల్సిన అవసరం లేదు అంటుంది జ్యోత్స్న. గెలుపు కోసం అడ్డదారులు తొక్కాల్సిన అవసరం మాకు లేదు అంటుంది దీప.

47
నిజం చెప్పిన కార్తీక్
Image Credit : Jiohotstar

నిజం చెప్పిన కార్తీక్

అసలు నీకు, సూరజ్ కి గొడవ ఏంటి అని అడుగుతాడు శివన్నారాయణ. నేను చెప్తాను అని మొదలు పెడతాడు కార్తీక్. శివన్నారాయణ దగ్గర ఒక పెన్ తీసుకొని, నేనొక బయటి వ్యక్తిని అనుకో.. ఈ పెన్ నాకు నచ్చింది ఎంతకిస్తావ్ అని అడిగితే మీరు ఏం చెప్తారు అంటాడు కార్తీక్. ఇవ్వను అది నా పెన్ అంటాడు శివన్నారాయణ. రూ. 10 వేలు ఇస్తాను ఇవ్వు అంటాడు కార్తీక్. ఎంత ఇచ్చినా ఇవ్వను అంటాడు శివన్నారాయణ. సరిగ్గా జ్యోత్స్న, సూరజ్ ల మధ్య కూడా ఇదే జరిగింది. సూరజ్ తీసుకున్న బొమ్మను తనకు కావాలని జ్యోత్స్న అడిగింది. తను ఇవ్వనన్నాడు. అలా వారి మధ్య గొడవ మొదలై ఇంతదూరం వచ్చింది అంటాడు కార్తీక్.

దాంట్లో నా తప్పేమి లేదు అంటుంది జ్యోత్స్న. అయినా నీకు వేరే వాళ్ల వస్తువుల మీద ఆశ ఎందుకు అంటాడు కార్తీక్. నీదే తప్పని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు నీకు అంత ఈగో. నువ్వు అడిగితే అందరూ అన్నీ ఇచ్చేయాలా? అని జ్యోపై సీరియస్ అవుతుంది సుమిత్ర. సూరజ్ ను పిలిపించమని కార్తీక్ కు చెప్తాడు శివన్నారాయణ.

57
దీప వార్నింగ్
Image Credit : Jiohotstar

దీప వార్నింగ్

మరోవైపు జ్యోత్స్నతో దీప మాట్లాడుతుంది. నువ్వు చేసే పనులకు నేను, మా బావ బాధపడితే పర్వాలేదు కానీ.. నా కుటుంబం బాధపడుతోంది. ఇది క్షమించే విషయం కాదు. నువ్వు వెళ్లి సూరజ్ కాళ్లు పట్టుకొని క్షమించమని అడుగు అంటుంది దీప. ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావ్ అన్నట్లు రెచ్చిపోతుంది జ్యోత్స్న. నువ్వు సూరజ్ కు సారీ చెప్పు. లేదంటే అతనే నీ జుట్టు పట్టుకొని కాళ్ల మీద పడేలా చేసుకుంటాడు అంటుంది దీప. నా జుట్టు పట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదు అంటుంది జ్యోత్స్న. నీకు ఏదో గట్టిగానే ఉంది అని మనసులో అనుకుంటుంది దీప.

67
డబ్బులు వద్దన్న సూరజ్
Image Credit : Jiohotstar

డబ్బులు వద్దన్న సూరజ్

కాసేపటికి సూరజ్ మళ్లీ శివన్నారాయణ ఇంటికి వస్తాడు. నష్ట పరిహారం కింద రూ. 5 లక్షలు ఇస్తాడు శివన్నారాయణ. సరిపోదు అంటాడు సూరజ్. ఆ అబ్బాయి అడిగినంత ఇవ్వండని అంటుంది సుమిత్ర. మరో రూ. 5 లక్షలు ఇస్తామంటాడు శివన్నారాయణ. అది కూడా సరిపోదంటాడు సూరజ్. ఏందీ బాబు నీకు పది లక్షలు సరిపోవా.. మరి ఏం కావాలి అని వెటకారంగా మాట్లాడుతుంది పారు. నాకు డబ్బులు అవసరం లేదు సార్. నేను నష్టపోయిన నా మర్యాదను నాకు తెచ్చివ్వండి అంటాడు సూరజ్. షాక్ అవుతారు ఫ్యామిలీ.

77
జ్యోకు దిమ్మదిరిగే షాక్
Image Credit : Jiohotstar

జ్యోకు దిమ్మదిరిగే షాక్

అతను ఏం కోరుకుంటున్నాడో నాకు అర్థమైంది. నాతో సారీ చెప్పించుకోవాలని అనుకుంటున్నాడు అంటుంది జ్యోత్స్న. సారీ సరిపోదు మేడం అంటాడు సూరజ్. నీ వాలకం చూస్తుంటే.. సూరజ్ విషయంలో నేను తప్పు చేశానని జ్యోత్స్న ఫ్లెక్సీ నీ షాప్ ముందు పెట్టమనేలా ఉన్నావ్ అంటాడు కార్తీక్. మీరు చెప్పింది న్యాయంగానే ఉంది. అలాగే చేయండి అంటాడు సూరజ్.

నీ షాప్ ముందు నా మనుమరాలి ఫ్లెక్సీ పెట్టాలా? ఎలా కుదురుతుంది.. ఇంకా నయం జ్యూస్ లు కలిపి ఇవ్వమని అడగలేదు అంటుంది పారు. మీరు చెప్పింది కూడా బాగానే ఉంది అలాగే చేయండి అంటాడు సూరజ్. కోపంగా చూస్తుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhoot Bangla OTT: భూత్ బంగ్లా ఓటీటీ రిలీజ్ డేట్.. అక్షయ్ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image2
Karuppu Collections: బాక్సాఫీసు వద్ద 'కరుప్పు సునామీ.. 13 రోజుల్లో రికార్డ్ కలెక్షన్లు.. సూర్య మరో ట్రీట్‌
Recommended image3
Suriya: ఎట్టకేలకు బ్లాక్ బస్టర్.. 'కరుప్పు' ఫీవర్ తగ్గకముందే సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: కార్తీక్ మాటలకు కరిగిపోయిన శివన్నారాయణ- జ్యోకు షాక్ ఇచ్చిన సూరజ్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: చిచ్చు పెట్టిన జ్యో- శివన్నారాయణ ఉగ్రరూపం- కార్తీక్ కి చెంప దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved