MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: ఆనంద్ ని తెచ్చిన మోనిత... గతం గుర్తుతెచ్చుకునే ప్రయత్నంలో కార్తీక్..!

Karthika Deepam: ఆనంద్ ని తెచ్చిన మోనిత... గతం గుర్తుతెచ్చుకునే ప్రయత్నంలో కార్తీక్..!

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 20వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Sep 20 2022, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

అప్పుడు కార్తీక్, ఎందుకంత ఆవేశం మోనిత! అయినా ఈ బాబు ఎవరు? అని అడగగా, వీడు మన బాబు కార్తీక్.వీడ్ని తేవడానికి వెళ్తానని చెప్పాను కదా అని అంటుంది. ఎక్కడికి వెళ్ళావో అనుకున్నాను ఆనంద్ నీ తేవడానికి వెళ్లేవా అని అనుకుంటుంది దీప.ఇంతలో ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు. మోనిత ఎత్తుకున్న ఏడుపు ఆపడం, అప్పుడు శివ ఎత్తుకుంటాడు అయినా ఏడుపు ఆపడు. అప్పుడు దీప గతంలో ఒకసారి ఆనంద్ ఏడుస్తున్నప్పుడు కార్తీక్ దగ్గరికి వెళ్తే ఏడుపు ఆపిన సంఘటన గుర్తు తెచ్చుకొని, డాక్టర్ బాబు మీరు ఎత్తుకొండి అనగా కార్తీక్, బాబుని ఎత్తుకున్న వెంటనే బాబు ఏడుపు ఆపేస్తాడు.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

 అప్పుడు దీపా మనసులో, బాబు ఆయనకి దగ్గర కదా బాబు వల్ల గతం గుర్తొచ్చే అవకాశం ఉంటుంది అని అనుకొని డాక్టర్ బాబు మీకు ఈ బాబు ముందే అలవాటు ఉన్నట్టున్నది, ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అని అంటుంది. ఇంతలో మోనిత మనసులో, బాబును తెచ్చి తప్పు చేశానా! దీనివల్ల కార్తీక్ గతం గుర్తొచ్చే అవకాశం ఉన్నదా అని  అనుకోని ఏం అవసరం లేదు కార్తీక్, తండ్రి కొడుకులు ప్రేమకు ఇదే నిదర్శనం. అయినా ప్రేమకి జ్ఞాపకాలతో పనేముంది అని మాట మార్చేస్తుంది. అప్పుడు మోనిక కార్తీక్ ని, ఆనంద్ ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది.
 

38

 ఆ తర్వాత సీన్లో దీప, వాళ్ళ అన్నయ్యని ఇంటికి పిలుస్తుంది. ఏమైందమ్మా అర్జెంటుగా పిలిచావు అని వాళ్ళ అన్నయ్య అడగగా, నిన్న మోనిత ఇంట్లో డాక్టర్ బాబు రిపోర్ట్స్ కనిపించాయి ఇవి తీసుకుని ఆ సమస్య ఏంటో చూడండి అన్నయ్య అని అంటుంది దీప. నువ్వు ఈ విషయం మీద కాదమ్మా ఇంకా ఏదో విషయం మీద బాధపడుతున్నట్టు ఉన్నావు ఏమైంది అని అడగగా, మోనిత తన బిడ్డ నీ తీసుకొని వచ్చింది. దీనివల్ల డాక్టర్ బాబు గుర్తొచ్చే అవకాశం ఉంటుందని ఆశపడ్డాను కానీ మోనిత దాన్ని తారుమారు చేసింది అని అంటుంది.
 

48

 అది డాక్టర్ బాబుకి, మోనిత కి  పెట్టిన బిడ్డ? అని వాళ్ళ అన్నయ్య అడగగా, అవును అన్నయ్య చెప్పాను కదా, డాక్టర్ బాబు నీ వలలో వేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసింది.ఆఖరికి తన డాక్టర్ తెలివితేటలు వాడి డాక్టర్ బాబుకి ఇష్టం లేకపోయినా బిడ్డను కనింది అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అన్నయ్య, సర్లే అమ్మ గతం గుర్తొస్తే చాలు, నేను నాకు తెలిసిన డాక్టర్లకి రిపోర్ట్ చూపి సమస్య ఏంటో కనుక్కుంటాను అని వెళ్ళిపోతాడు దీప వాళ్ళ అన్నయ్య. ఆ తర్వాత సీన్లో దీప,కూరగాయలు కోస్తూ గతం గురించి ఆలోచిస్తూ ఉండగా తన చెయ్య కట్ చేసుకుంటుంది. 
 

58

ఇంతలో కార్తీక వచ్చి, అయ్యో వంటలక్క నొప్పిగా ఉందా అని అంటాడు.అప్పుడు దీప,నాకు అలవాటు లెండి డాక్టర్ బాబు,ఏదో పని మీద వచ్చినట్టున్నారు ఏంటి అని అడుగుతుంది దీప.అప్పుడు కార్తీక్,ఉదయం కాఫీ ఇచ్చావు కదా మోనిత కింద పడేసింది అందుకే సారీ చెబుదామని వచ్చాను అని అంటాడు. ఆగండి డాక్టర్ బాబు ఇప్పుడే మళ్ళీ కాఫీ చేస్తాను అని దీప వెళ్లి  కాఫీ తెస్తుంది.అప్పుడు కాఫీ తాగుతున్న కార్తీక్ నీ దీప, మీ సొంత ఊరు ఏంటి డాక్టర్ బాబు? అని అడుగుతుంది. గుర్తులేదు అని కార్తీక్ అనగా మీ సొంతూరు హైదరాబాదు అని అంటుంది.
 

68

అప్పుడు కార్తీక్, మోనిత ఇంకా ఏదో అన్నట్టు గుర్తు నాకు,అవునూ అమ్మ నాన్నలు ఉన్నారా అని కార్తీక్ అడగగా, మీకు అమ్మానాన్న,భార్య, పిల్లలు, అందరూ ఉన్నారు గుర్తు తెచ్చుకోండి అని అంటుంది.అప్పుడు కార్తీక్ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించిగా చాలా అస్పష్టమైన బొమ్మలు కనిపిస్తాయి. ఇంతలో  కార్తీక్ ఎక్కడ అని మోనిత ఇల్లంతా వెతుకుతూ ఉండగా శివ,ఎక్కడికి వెళ్ళి ఉంటారు మేడం మహా అయితే వంటలక్క ఇంటికి వెళ్ళుంటారు అని అంటాడు. అప్పుడు మోనిత అక్కడికి వెళ్తాది. ఇంతలో కార్తీక్  కళ్ళు తిరిగి పడిపోతాడు. మొనిత వెంటనే కార్తీక్ మీద నీళ్లు జల్లి లేపుతుంది.
 

78

 కార్తీక్ లెగుస్తాడు. నేనెక్కడున్నాను? ఇక్కడ ఎందుకు ఉన్నాను? అని అనగా, నువ్వు నేను వంటలకు మాట్లాడడానికి వచ్చాము కార్తీక్ అని అంటుంది మొనిటా. అప్పుడు శివ,ఎంత తేలిగ్గా ప్లేటు మార్చేసారు మేడం అని అనుకుంటాడు.మనం  ఏం మాట్లాడుకుంటున్నము అని కార్తీక్ అనగా, ఇప్పుడు వద్దులే కార్తీక్ ముందు ఇంటికి వెళ్దాం తర్వాత మాట్లాడదాం అని కార్తీక్ నుంచి తీసుకెళ్లి పోతుంది మోనిత. అప్పుడు దీప మనసులో, డాక్టర్ బాబుకి ఏదో గతం గుర్తొచ్చినట్టుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు. అంటే గతం గుర్తొచ్చే అవకాశం బాగానే ఉన్నది అని అనుకుంటుంది. 
 

88

మరోవైపు మోనిత , కార్తీక్ కళ్ళు తిరిగి పడిపోయాడంటే దీప ఏమైనా గతం గుర్తు తెచ్చే ప్రయత్నాలు చేసిందా? అయినా అదున్నది ప్రయత్నాలు చేయడానికి కదా,ఇలా ఉంటే కష్టం బాబుని, కార్తీక్ ని తీసుకుని ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకుంటుంది. ఇంతలో కార్తీక్, బాబుతో వచ్చి మోనిత బాబు పేరు ఏంటి? అని అడగగా, ఇప్పుడు పేరు చెప్తే గతం గుర్తు తెచ్చుకునే అవకాశం ఉందా అని మోనిత అనుకుంటుంది. అప్పుడు మోనిక కార్తీక్ తో, ఎందుకులే కార్తిక్ పేరు చెప్పిన సరే మళ్లీ మర్చిపోతావు అని అంటుంది.మర్చిపోతే మళ్ళీ నిన్ను అడుగుతాను చెప్పు మోనిత అని అనగా ఆనంద్ అని అంటుంది మోనిత ఈ పేరు ఎక్కడో విన్నట్టున్నదే అని కార్తీక్ అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తరువాయి భాగం లో  ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: పారుతో కలిసి జ్యో కొత్త ప్లాన్- కార్తీక్ కి బిగ్ షాక్- సీఈఓగా జ్యో
Recommended image2
Sunny Leone Upcoming Films: సన్నీలియోన్ క్రేజ్ చూశారా.. చేతిలో ఏకంగా 5 భారీ సినిమాలు, ఒక వెబ్ సిరీస్
Recommended image3
Suriya: సూర్య 'వీరభద్రుడు'.. ఈ సినిమాను కచ్చితంగా చూడటానికి 5 కారణాలు, మాస్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved