MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దీపని కసురుకున్న చంద్రమ్మ.. ఇంద్రుడు మీద అనుమానం పెంచుకున్న కార్తీక్..?

Karthika Deepam: దీపని కసురుకున్న చంద్రమ్మ.. ఇంద్రుడు మీద అనుమానం పెంచుకున్న కార్తీక్..?

Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 3వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Nov 03 2022, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో దీప జరిగిన విషయాలు తలచుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే దుర్గ అక్కడికి వచ్చి వెళ్దాం పద దీపమ్మ అనడంతో సరే పద అని అంటుంది. అప్పుడు దీప అలాగే వెళుతుండగా ఏంటి దీపమ్మ ఇలాగే వస్తావా సర్వం కోల్పోయిన దానిలా ఉన్నావు అనడంతో వెంటనే దీప ఇంక నాకేం మిగిలింది. సర్వం కోల్పోయాను కదా అని అంటుంది. ఒకరేమో నా భర్తని నా నుంచి దూరం చేస్తుంటే ఇంకొకరేమో నా పిల్లలను నాకు కనిపించకుండా దాస్తున్నారని భయం అంటూ దీప బాధ పడుతూ ఉంటుంది.
 

27

నా జీవితంలో బాధ భయం తప్ప ఇంక ఏమీ మిగిలాయి ఉన్నాయి దుర్గ అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది దీప.. తర్వాత దీప దుర్గ ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరుతారు. మరొకవైపు మోనిత కార్ లో వెళుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ వంటలక్క పీడ వదిలేలా లేదు అని అనుకుంటూ ఏదో ఒక ప్లాన్ చేయాలి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే మోనిత కారు ఆగిపోవడంతో కారు దిగి కార్తీక్ కి ఫోన్ చేస్తూ ఉండడంతో బిజీ వస్తూ ఉంటుంది.
 

37

ఫోన్ ఎప్పుడు బిజీ వస్తూనే ఉంటుంది ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు అని అనుమాన పడుతూ ఉంటుంది మోనిత. మరొకవైపు కార్తీక్ దీప ఇంద్రుడు అన్నమాట తలుచుకొని దీప అన్నట్టుగా వాడి దగ్గరే సౌర్య ఉందా కావాలనే లేదు అని నాటకాలు ఆడుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. ఎలా అయినా ఇంద్రుడు దగ్గరికి ప్లాన్ తో వెళ్లాలి సౌర్య ఉందో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్.
 

47

మరొకవైపు ఇంద్రుడు జ్వాలమ్మను ఇక నుంచి లేదా ఈ ఊరు నుంచి దూరంగా తీసుకుని వెళ్లాలి లేదంటే వీళ్ళు పదేపదే వస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడ మోనిత కనిపించడంతో మోనితను ఆటోలో ఎక్కించుకొని వెళ్తాడు ఇంద్రుడు. మరొకవైపు దీప ఇంద్రుడు ఇంటికి వెళుతుంది. అప్పుడు జ్వాలమ్మ వేడి నీళ్లు స్నానానికి పెట్టి చాలా సమయం అయింది వెళ్ళు జ్వాలమ్మ అని సౌర్యని స్నానం చేయడానికి పంపిస్తుంది చంద్రమ్మ.

57

 అప్పుడు దీప లోపలికి వెళ్తుండగా చంద్రమ్మ ఆపి ఏంటమ్మా ఇలా పదేపదే వస్తున్నారు మాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెబుతుంది. అప్పుడు దీప అయ్యో అలా ఏమీ లేదమ్మా అనడంతో వెంటనే చంద్రమ్మ పాప ఇంట్లో లేదమ్మా మా భర్త మా పాప ఇద్దరూ చుట్టాలింటికి వెళ్లారు రావడానికి నైట్ అవుతుంది మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెప్పి దీపక్ కి అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి పంపిస్తుంది.

67

అప్పుడు చంద్రమ్మ దీప మీద కసురుకొని అక్కడినుంచి వెళ్ళిపోమని చెప్పి చెబుతుంది. మరొకవైపు మోనిత  ఇంటికి వెళుతూ ఉండగా దారిలో కార్తీక్ ని చూసి ఆటో ఆపుతుంది. అప్పుడు కార్తీక్ ఆ ఇంద్రుడి ని చూసి ఆటో ఆగు ఆగు అనగా ఇంద్రుడు తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఎలా అయినా  జ్వాలమ్మని చంద్రమ్మని ఒప్పించి ఇకనుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇంద్రుడు. ఆ తర్వాత కార్తీక్ ఇంద్రుడి మీద డౌట్ పడి నో డౌట్ ఏదో రహస్యం ఉంది అని అనుకుంటూ కార్తీక్ ఆ డ్రైవర్ కి ఏమైనా సంబంధం ఉందా అని పదేపదే అడుగుతూ ఉంటాడు.

77

 అప్పుడు ఇంద్రుడు మోనిత కలిసి ఏమైనా కుట్ర చేస్తున్నాడా అని అనుమాన పడుతూ ఉంటాడు కార్తీక్. మరొకవైపు హిమ ఆనందరావు కలసి ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు దీప ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. అప్పుడు దీప చంద్రమ్మ అన్న మాటలు అనే పదం గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: ఎన్టీరామారావుకి నచ్చిన చిరంజీవి సినిమా ఇదే.. మెగాస్టార్‌కే కాదు, మెగా ఫ్యామిలీకీ చాలా స్పెషల్‌
Recommended image2
దళపతి విజయ్ సినిమా లీక్ చేసింది ఎవరోతెలుసా..? ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సంచలన నిజాలు
Recommended image3
Sobhita Dhulipala: కష్టపడకుండా ఏడాదికి 10 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న శోభిత.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved