- Home
- Entertainment
- Karthika deepam: ఫుడ్ పాయిజన్ అంటూ మోనిత కొత్త నాటకం... దీపకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్!
Karthika deepam: ఫుడ్ పాయిజన్ అంటూ మోనిత కొత్త నాటకం... దీపకు కార్తీక్ స్ట్రాంగ్ వార్నింగ్!
Karthika deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్, కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 6వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...కార్తీక్, శివని వెంటనే పిలిచి మోనితని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. ఏమైంది డాక్టర్ అని కార్తీక్ అడగగా ఫుడ్ పాయిజన్ అయినట్టు ఉన్నది ట్రీట్మెంట్ చేస్తాను అని లోపలికి తీసుకువెళ్తాడు డాక్టర్. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నది మేడం అని అడగగా, ఇది యాక్టింగ్ అని తెలుసు కదా కార్తీక్ ఉన్నంత వరకు నటిస్తే చాలు అని అంటుంది మోనిత. ఆ తర్వాత ట్రీట్మెంట్ అవుతుంది.కార్తీక్ అక్కడికి వస్తాడు. అప్పుడు డాక్టర్,మేడంకి ఫుడ్ పాయిజన్ అయింది.
కరెక్ట్ సమయం తీసుకువచ్చారు కనుక సరిపోయింది,లేకపోతే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం అయి ఉండేది అని అంటాడు. అదే సమయంలో శౌర్య, వారణాసి తో పాటు ఆటోలో కొన్ని సరుకులు తీసుకొచ్చి హాస్పటల్లో ఇస్తుంది. కానీ కార్తీక్ కి ఎదురు పడదు. అదే సమయంలో కార్తీక్ ఎవరు చేసి ఉంటారు పాయిజన్ అని అనగా ఇంకెవరూ ఆ వంటలక్కే చేసి ఉంటాది. మనం బొంబాయి వెళ్తున్నామని తెలిసి నన్ను చంపేస్తే నిన్ను తన వశం చేసుకోవాలనుకుంటుంది అని అంటుంది మోనిత.
అప్పుడు కార్తీక్ కోపంతో శివతో పాటు వంటలక్క ఇంటికి వెళ్తాడు.అదే సమయంలో దీప వాళ్ళ అమ్మ కు ఫోన్ చేసి,డాక్టర్ బాబు నా వంటలను బాగా ఇష్టపడుతున్నారు, అనుకున్నట్టే అంతా జరుగుతుంది.రేపు మాతో గతం గుర్తొచ్చే అవకాశం కూడా ఉన్నది అని అంటుండగా కార్తీక్ కోపంతో తలుపులు తీసి ఎవరు నీ డాక్టర్ బాబు,నేను నీ డాక్టర్ బాబు ని కాదని చెప్పినా వినడం లేదు ఎందుకు? ప్రపంచంలో అందరూ చెడ్డోళ్ళు కాదు కొన్ని మంది మంచి మనుషులు కూడా ఉంటారు అనుకోని నిన్ను నమ్మాను.
కానీ నా భార్యకే విషయం పెడతావా? నా భార్యని చంపేసి,ఎలాగో మతిమరుపు వాడిని కదా రెండు మూడు రోజుల్లో గతం మర్చిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా? భార్యని కూడా మర్చిపోయే అంత మతిమరుపు లేదు నాకు.భార్య భర్తలు బంధం ఏడు జన్మల బంధం. అలాంటిది మొనిత టిఫిన్ లో విషయం కలుపుతావా?, అసలా పెళ్లి అయిన అబ్బాయి మీద మనసు పడడానికి నీకు ఎలా మనసు వచ్చింది అని తిడతాడు. దానికి దీప నా తప్పులేదు అని అంటుంది.
కానీ డాక్టర్ బాబు వినకుండా, నీకు డబ్బు కావాలంటే ముఖం మీద అడుగు కాని,ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు.ఇంకెప్పుడు నీ మొఖం నాకు చూపించొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో సౌర్య వారణాసితో, నాకు పదేళ్ల వరకు మా నాన్న ఎవరో తెలియలేదు.తీరా మా నాన్న ఎవరో తెలిసారు అనుకునేసరికి ఇలాగ అయింది. అసలు కనీసం నా చదువు అయ్యేంతవరకు అయినా, లేకపోతే పెళ్లి అయ్యేంత వరకు అయినా ఉండొచ్చు కదా! నన్ను ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు అని అంటుంది.
అప్పుడు వారణాసి ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు అని అడగా రేపు గుడిలో చెప్తాను వారణాసి అని అంటుంది శౌర్య.ఆ తర్వాత సీన్లో డాక్టర్, డాక్టర్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు దీప ఇంటికి వస్తారు. ఆ మొనిత ఇంత చేస్తుంది అని నేను అనుకోలేదు. అయినా నీ భర్త ముందు నిన్నే తిట్టించేలా చేసింది.అసలు దానికి ఎంత తెలివి ఉంటే ఇలా చేస్తుంది? అని అంటుంది. అప్పుడు దీప, మా ఆయన ముందే నన్ను తిట్టించిన అసలు ఆయన దృష్టిలో నేను చెడ్డదాన్ని అయిపోయాను రేపు మా పిల్లల పుట్టినరోజు.
ఆయన్ని గుడికి తీసుకెళ్లి అభిషేకం చేయిద్దాం అనుకున్నాను కానీ అది కూడా జరగకుండా చేసిందా మొనిత. ఇప్పుడు నా మొహం కూడా చూడొద్దు అంటున్నారు అని అనగా డాక్టర్ , పర్లేదు అమ్మ నువ్వు దాన్ని అంత సీరియస్ గా తీసుకోవద్దు. మొగుడు పెళ్ళాల మధ్య ఏ గొడమైన సరే నా మొఖం చూడొద్దు అని భర్త అంటే భార్య మనేస్తుందా? దీన్ని అదే విధంగా తీసుకో అని అంటాడు డాక్టర్. సరే అమ్మ ఇంక లేట్ అవుతుంది బయలుదేరుతాము అని వాళ్ళు బయలుదేరుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!