MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: దీపను చూసి కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్.. సౌందర్యని గన్ తో బెదిరించిన మోనిత?

Karthika Deepam: దీపను చూసి కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్.. సౌందర్యని గన్ తో బెదిరించిన మోనిత?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు నవంబర్ 30 వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Nov 30 2022, 08:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో ఆనందరావు కార్తీక్,దీపలు ప్రాణాలతో లేరా అని అనగా వెంటనే సౌందర్య ఆ విషయంలో నాకు అనుమానం లేదు. ఎందుకంటే నేను సౌర్య కోసం రాకముందే ఆ ఇంద్రుడు సౌర్యను తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయాడు. అంటే అంతకుముందు ఎవరికో భయపడ్డాడు అంటే కార్తీక్ దీప లకు భయపడ్డాడేమో అని అంటుంది సౌందర్య. అప్పుడు హిమ మరి అమ్మ నాన్నలు బతికే ఉన్నారా అని అనగా అప్పుడు అది మన అదృష్టం నమ్మకం ఎందుకంటే శౌర్య మన చేతికి చెప్పినట్టే చిక్కి దూరంగా వెళ్ళిపోతోంది అని అంటుంది. మరొకవైపు దీప హాస్పిటల్ బెడ్ పై ఉండగా దీప ని చూసి కార్తీక్ ఎమోషనల్ అవుతూ ఉంటాడు.
 

26

ఒక క్షణం నువ్వు కనిపించక పోయేసరికి ప్రాణం పోయినట్టు అయింది దీప నువ్వు కనిపించకపోతే నేనేమో పోతాను అనుకున్నావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంతలోనే అక్కడికి ఒక డాక్టర్ వచ్చి అంతా ఓకే కదా డాక్టర్ అని అడుగుతుంది. ఆపరేషన్ చేద్దామా అని అడగగా వద్దు డాక్టర్ ఒక రెండు రోజుల తర్వాత చేద్దాము అనడంతో ఎందుకు అని అనగా పేషెంట్ కండిషన్ బాగానే ఉంది మీ కండిషన్ బాగోలేదు అని అంటుంది ఆ డాక్టర్. ఆపరేషన్ చేయాల్సింది మీరే మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత బాగా ఆపరేషన్ చేయొచ్చు అని అంటుంది. అప్పుడు కార్తీక్,దీప ని రోడ్డు పక్కన అలా కింద పడిపోయి చూసేసరికి తట్టుకోలేకపోయాను అని అంటాడు కార్తీక్.
 

36

అప్పుడు కార్తీక్ ఎమోషనల్ అవుతుండడంతో కొద్దిసేపు ఒంటరిగా వదిలేయండి అని అనగా డాక్టర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా దీప వాళ్ళు నిన్ను చూసి అసూయ పడుతున్నారు కానీ నిన్ను నేను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏ రోజు సంతోషంగా చూసుకోలేదు అంటూ కార్తీక్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మరొకవైపు మోనిత కార్తీక్ కోసం ఎదురుచూస్తూ కార్తీక్ ఎక్కడికి వెళ్లి ఉంటాడు ఆ దీప కూడా లేదు అంటే ఎదురు కలిసి వెళ్లారా కార్తీక్ కి గతం గుర్తుకు వచ్చిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు సౌర్య దొరికిందేమో అందుకే హైదరాబాద్ కి వెళ్ళిపోయారేమో అనుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత.
 

46

అప్పుడు మోనిత లగేజ్ తీసుకొని హైదరాబాద్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడు అక్కడ పని చేసే అమ్మాయికి ఫోన్ చేసి అసలు విషయం చెబుతుంది. ఇప్పుడు తన బొటిక్ అమ్మేయమని చెబుతుంది మోనిత. అప్పుడు అక్కడ పని చేసే ఆమె ఇక్కడే నాలుగు రోజులు ఉండండి మేడం అని అనగా నాలుగు రోజులు కాదు నాలుగు క్షణాలు కూడా ఉండలేను అని లగేజ్ తీసుకొని బయలుదేరగా ఇంతలో సౌందర్య రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మోనిత. అప్పుడు సౌందర్య ఎవరిని చంపాలి అనుకుంటున్నావే అని అనగా అప్పుడు అబద్ధాలు చెప్పడంతో నోరు ముయ్ మొన్ననే తల పగలగొట్టి చంపాలని చూసావు మళ్ళీ ఇప్పుడు అబద్ధాలు చెబుతున్నావు అని సీరియస్ అవుతుంది సౌందర్య.
 

56

ఆరోజు నాతోపాటు నేను ఇంట్లోకి వస్తుంటే ఎందుకు ఆ విధంగా చేశావు నేను చూడకూడనిది మీ ఇంట్లో ఏముంది అని అడుగుతుంది సౌందర్య. అప్పుడు సౌందర్య ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో ఏం కనిపించకపోయేసరికి మళ్ళీ మోనిత ని నిలదీస్తుంది సౌందర్య. ఇప్పుడు మీరు ఇల్లంతా చూశారు కదా అంటే ఇంట్లో ఏమీ లేదు అనడంతో లేదు నువ్వు నన్ను కొట్టే సాహసం చేశావంటే ఇంట్లో ఏదో ఉంది అని అంటుంది సౌందర్య. అప్పుడు చెప్పు మోనిత అని అడగడంతో సౌందర్య ని వెనక్కి నెట్టేసి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. ఇప్పుడు మోనిత తలుపులు తీ మోనిత అని అనగా లోపలి నుంచి గన్ను తీసుకొని వచ్చి సౌందర్యని బెదిరిస్తుంది.

66

అది చూసి సౌందర్య ఒక్కసారిగా భయపడిపోతుంది. మొన్న దెబ్బతో వదిలేసాను ఈసారి ఎక్కువ చేస్తే షూట్ చేసి పడేస్తాను అని బెదిరిస్తుంది. నేను ఎలా ఉంటే మీకెందుకు ఆంటీ మీ లైఫ్ నేను డిస్టర్బ్ చేయడం లేదు కదా మీ కొడుకు కోడలు కూడా లేరు కదా నా లైఫ్ లోకి మళ్ళీ రాకండి అని అనడంతో వెంటనే మోనిత చేతిలో ఉన్న గన్ను లాక్కొని మోనిత కి గురి పెడుతుంది సౌందర్య. దాంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు బ్యాగు తీసుకుని బయలుదేరావ్ కదా ఎక్కడికో నేను కూడా వస్తాను వెళ్దాం పద అని మోనిత ను గన్ను పట్టుకుని బెదిరిస్తూ అక్కడి నుంచి తీసుకెళ్తుంది సౌందర్య. మరొకవైపు శౌర్య తన అమ్మానాన్నని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చంద్రమ్మ అక్కడికి పాలు తీసుకుని వచ్చి తాగమని చెబుతుంది. మరొకవైపు ఇంద్రుడు పడుకొని ఉండగా అప్పుడు దీప గురించి తలచుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తాడు. మరొకవైపు దీప హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఉండగా కార్తీక్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సంజూ శాంసన్ vs కీర్తి సురేష్ .. వీరిలో నెంబర్ 1 ఎవరో తెలుసా..?
Recommended image2
Maheshbabu కోసం కదిలి వచ్చిన పవన్ కళ్యాణ్‌, వెంకటేష్‌, నాగార్జున.. కట్‌ చేస్తే సినిమా ఫ్లాప్‌
Recommended image3
1000 Crore Heroes: వెయ్యి కోట్లకుపైగా కలెక్షన్లని రాబట్టిన హీరోలు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved