MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: జైలు నుంచి విడుదల అయిన మోనిత.. చారుశీల మౌనిక మనిషి అని తెలుసుకున్న కార్తీక్ దీప?

Karthika Deepam: జైలు నుంచి విడుదల అయిన మోనిత.. చారుశీల మౌనిక మనిషి అని తెలుసుకున్న కార్తీక్ దీప?

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

3 Min read
Author : Navya G
Published : Jan 06 2023, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ దీపనీ అమెరికాకు తీసుకెళ్తే ఏమైనా ఫలితం ఉంటుందా అని అనగా నువ్వే ప్రముఖ కార్డియాలజిస్ట్ నీకు తెలియనిది ఏముంది. అయినా హార్ట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్లీ ఈ కాంప్లికేషన్స్ ఎందుకు వచ్చాయి అని అనడంతో నాకు కూడా అది అర్థం కావడం లేదు అంటాడు కార్తీక్. ఒకరోజు అమ్మ వాళ్ళని చూడడానికి హైదరాబాద్కు వెళ్ళాము ఆరోజు ఇంటి దగ్గరికి వెళ్లేసరికి ఒక్కసారిగా హార్ట్ స్టోక్ వచ్చింది. అప్పుడు ఎక్కువగా ఆలోచించడం వల్ల అలా అయింది అనుకున్న కానీ రిపోర్ట్స్ వచ్చాక అర్థం అయ్యింది అనగా రిపోర్ట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా అంటాడు హేమచంద్ర. అయినా నా లైఫ్ లో వందల హార్ట్ సర్జరీలు చేశాను కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్.
 

26

 దీప రిపోర్ట్స్ ఎంతమంది డాక్టర్స్ కి చూపించాను అందరూ ఆ రిపోర్ట్స్ ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక డాక్టర్ అయ్యింది ఎంతోమంది ప్రాణాలను కాపాడి నా భార్య ప్రాణాలను కాపాడలేక పోతే అంతకంటే దురదృష్టం మరేముంటుంది అని బాధపడుతూ ఉంటాడు. వేరే వాళ్ళు అయితే నేను ఇంతగా ఆలోచించను ధైర్యంగా ఉండేవాడిని కానీ నా భార్య దీప ఇన్ని రోజులు ఎప్పుడు తాను సంతోషంగా లేదు. కానీ ఇప్పుడు ఇలా జరగడం బాధగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు కార్తీక్. అప్పుడు హేమచంద్ర ఓదారుస్తూ ధైర్యం చెబుతూ ఉంటాడు. మరొకవైపు శౌర్య, హిమ ఇద్దరూ కార్తీక్ వాళ్ళు కనిపించిన ప్రదేశానికి వెళ్లగా అప్పుడు సౌర్య ఎందుకే చూడకపోయినా చూశాను అని అబద్ధాలు చెబుతావు అనడంతో నేను నిజంగానే చూసాను సౌర్య నా మాటలు నమ్ము అంటుంది హిమ.
 

36

నేను బాబాయ్ ఈ రోడ్లో ఎన్నో సార్లు తిరిగాము మాకు కనపడంది నీవు కనిపించారా నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి నన్ను మాయం చేయడానికి ప్రయత్నిస్తున్నావు అంటూ హిమనీ అపార్థం చేసుకుంటుంది శౌర్య. అప్పుడు హిమ కోపంతో మనం వారం రోజులపాటు ఈ ఊర్లో గడపగడప వెతుకుదాము వాళ్లు కనిపిస్తే నువ్వు నాతో వస్తావు కదా అనడంతో, వాళ్ళు కనిపించకపోతే మీరు నన్ను వదిలి వెళ్తారా అని హిమనీ సౌర్య అడగగా వెళ్ళిపోతాము అంటుంది. సరే అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరొకవైపు కార్తీక్ దీపా ఇద్దరూ ఇంటికి వెళ్ళగా అక్కడ మోనిత ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. మోనిత స్టైల్ గా కాలు మీద కాలు వేసుకుని కాఫీ తాగుతూ ఉంటుంది.

46

అప్పుడు కార్తీక్, మోనిత అని ఎన్ని రోజులైంది కార్తీక్ నీ నోట్లో నుంచి నా పేరు విని నిన్ను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది మోనిత. జైల్లో ఉన్నన్ని రోజులు నీ గురించి నాకు దిగులు అందుకే నేరుగా జైలు నుంచి ఇక్కడికి వచ్చేసాను అంటుంది మోనిత. మీ పని మంచి పండరి అనుకుంట పాపం మీ మనిషి అని చెప్పగానే స్ట్రాంగ్ గా కాఫీ ఇచ్చింది. ఇకపై నేను కూడా నీతో పాటు కలిసి ఇక్కడే ఉంటాను ఆడడంతో దీప కోపంతో రగిలిపోతూ ఏంటే నువ్వు ఇక్కడ ఉండేది ముందు బయటికి వెళ్ళు అని అంటుంది. జైలుకు వెళ్లావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అనడంతో అలా ఎలా అనుకున్నావు దీపక్క ఆ జైలు గోడలు కార్తీక్ పై నాకున్న ప్రేమను అడ్డుకోలేకపోయాయి అని అనడంతో దీప,కార్తీక్  కోపంతో రగిలిపోతూ ఉంటారు.

56

నువ్వు ఎంతకైనా తెగిస్తావని తెలుసు ఇంతవరకు సృష్టించినది చాలు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నేను వెళ్లడానికి రాలేదు కార్తీక్ నీతో పాటు ఉండడానికి వచ్చాను అంటుంది. అప్పుడు దీప కోప్పడడంతో నువ్వు ఆవేశ పడకూడదు దీపక్క నువ్వు ఎంత ఆవేశపడితే నీ ఆయుష్షు అంత తగ్గుతుంది అంటుంది మోనిత. అప్పుడు నాకు ఎలా నిజం తెలిసింది అని ఆశ్చర్యపోతున్నారా అని నవ్వుతూ మాట్లాడుతుంది మోనిత. పాపం దీపక్క కార్తీక్ ని నా నుంచి ఎంత కష్టపడి లాక్కున్నావో చివరికి నువ్వే కార్తీక్ తోడు లేకుండా వెళ్ళిపోతున్నావు అంటుంది మోనిత. కార్తీక్ నీ నా చేతిలో పెట్టి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్లి పోతున్నావు అనగా కార్తీక్ సీరియస్ అవుతాడు. అప్పుడు మోనిత నోటికొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉంటుంది.

66

నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసిపోయాయి అని అనుకుంటున్నారా చారుశీల చెప్పింది అనడంతో దీప కార్తిక్ ఇద్దరు షాక్ అవుతారు. చారుశీల చెప్పడం ఏంటి అనగా చారుశీల నామనిషి. అక్క అని పిలవగానే నీ మనిషి అనుకున్నావా తక్కువ సమయంలోనే మీకు ఇల్లు చూసి మీ సౌకర్యాలు అన్ని పెట్టి కారు ఇచ్చి మీ అవసరం తీర్చడానికి ఏమైనా పిచ్చిది అనుకున్నావా. నేను జైల్లో ఉన్నప్పుడు మీ ప్రతి కదలిక నాకు తెలియాలి కదా అందుకే చారుశీల పెట్టుకున్నాను బాగానే పనికొచ్చింది అని అంటుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెబుతూ నువ్వు పోతావు అన్న గుడ్ న్యూస్ కూడా చెప్పింది అనడంతో కార్తీక్ సీరియస్ అవ్వగా చాలు మాట ఇప్పటికే ఎక్కువగా వాగావు ఫస్ట్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని దీప అక్కడినుంచి గెంటేస్తుంది. అయినా కూడా మోనిత బుద్ధి లేకుండా అలాగే మాట్లాడే దీపకు మరింత కోపం తెప్పిస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
విలన్ కంటే చాలా పొట్టిగా ఉండడంతో స్టూల్ ఎక్కి డైలాగ్ చెప్పమన్న రాజమౌళి.. ఆ నటుడు ఏం చేశాడో తెలుసా
Recommended image2
Illu Illalu Pillalu April 7 Episode: లారీతో యాక్సిడెంట్ ప్లాన్ చేసిన భాగ్యం, చందుకు బదులు బలైన ప్రేమ
Recommended image3
Allu Arjun Top 5 Films: బాక్సాఫీసుని షేక్‌ చేసిన బన్నీ టాప్‌ 5 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved