MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Karthika Deepam: కార్తీక్ కుటుంబాన్ని మళ్లీ రెచ్చగొడుతున్న మోనిత.. ఈసారి ఏకంగా ఇంట్లోనే ఉంటానంటూ!

Karthika Deepam: కార్తీక్ కుటుంబాన్ని మళ్లీ రెచ్చగొడుతున్న మోనిత.. ఈసారి ఏకంగా ఇంట్లోనే ఉంటానంటూ!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 01 2021, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఇక డాక్టర్ అసోసియేషన్ కార్యక్రమంకు కార్తీక్ (Karthik) , దీప (Deepa) కారు లో బయలుదేరిన సంగతి తెలిసిందే. మరోవైపు అసోసియేషన్ ఎన్నికలు ఏర్పాట్లు కూడా పూర్తి అవగా ఆ వేడుకకు డాక్టర్లందరూ హాజరయ్యారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కార్తీక్, దీప, సౌందర్య, ఆనంద రావు వాళ్లు కూడా ఆ వేడుకకు హాజరయ్యారు. అక్కడికి డాక్టర్ భారతి, రవి (Ravi) వచ్చి వాళ్ళను పలకరిస్తారు. కార్తీక్ ఇప్పుడు ఇవన్నీ అవసరమా అని అనడంతో భారతి (Bharathi) వాళ్ళు మీరు మాత్రమే ఈ బాధ్యతలు చూసుకోగలరు అంటూ అందరూ ఏకగ్రీవంగా మిమ్మల్ని ఎన్నుకున్నారని అంటుంది.
 

39

డాక్టర్ భారతి (Bharathi) వేదిక పైకి వెళ్లి కార్తీక్ (Karthik) గురించి గొప్పగా చెప్పటంతో కార్తీక్ చాలు భారతి అంటూ సరదాగా అంటాడు. ఇక భారతి డాక్టర్ కార్తీక్ ను డాక్టర్లు అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నమంటూ కార్తీక్ కు కంగ్రాట్స్ చెబుతుంది.
 

49

ఇక తన భర్త రవికి (Ravi) కూడా అందులో ఒక పొజిషన్ రావటంతో అతడికి కూడా కంగ్రాట్స్ చెబుతుంది. ఇక కార్తీక్ (Karthik) కుటుంబ సభ్యులు కూడా వచ్చారు అని చెబుతూ అందులో సౌందర్యను కార్తీక్ గురించి కాసేపు మాట్లాడమని వేదికపైకి ఆహ్వానిస్తుంది.
 

59

సౌందర్య (Soundarya) వేదిక పైకి వెళ్లి కార్తీక్ గురించి చెబుతుంది. కార్తీక్ చిన్నప్పుడు డాక్టర్ అవుతాడన్న విషయం తమకు తెలిసిందని కార్తీక్ (Karthik) గురించి గొప్ప గొప్ప గా చెబుతుంది. మరో విషయం గురించి చెబుతూ ఉండగా అప్పుడే మోనిత ప్రియమణితో ఎంట్రీ ఇస్తుంది.
 

69

మధ్యలో మోనిత (Monitha) దూరి కార్తీక్ గురించి నాకు బాగా తెలుసు నేను చెబుతాను అని అనడంతో కార్తీక్ వాళ్ళు  షాక్ అవుతారు. రానని చెప్పి మళ్లీ వచ్చిందని కోపంతో రగిలిపోతాడు. ఇక సౌందర్య మాట్లాడుతూ దీపను (Deepa) వచ్చి కార్తీక్ గురించి మాట్లాడమంటుంది.
 

79

వెంటనే మోనిత (Monitha) వేదిక పైకి వెళ్లి మాట్లాడుతుండగా డాక్టర్ భారతి (Bharathi) వచ్చి రాను అని చెప్పి మళ్లీ ఎందుకు వచ్చావు అని ప్రశ్నిస్తోంది. నేను కూడా డాక్టర్ నే అంటూ నాకు వచ్చే అర్హత ఉంది అని తన వ్యక్తిగత విషయాల గురించి మళ్లీ చెప్పడం మొదలు పెడుతుంది.
 

89

గతంలో కార్తీక్ దీపను (Deepa) వదిలేసిన విషయం నుండి బాబు పుట్టిన విషయం వరకు మొత్తం చెబుతుంది. భారతి  మధ్యలో మానితపై అరిచినా కూడా తాను మాత్రం పట్టించుకోదు. ఇక కార్తీక్ (Karthik) విషయంలో తనకు న్యాయం చేయాలని అంటుంది.
 

99

వెంటనే దీప (Deepa) చప్పట్లు కొడుతూ వేదిక పైకి వెళ్లి మోనితను పక్కకు నెడుతుంది. తరువాయి భాగం లో కార్తీక్ కుటుంబాన్ని మొత్తం తన మాటలతో మళ్లీ రెచ్చగొడుతుంది. ఈ సారి ఏకంగా కార్తీక్ (Karthik) ఇంట్లోనే సెటిల్ అవుతానని మాట ఇస్తుంది.

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved