- Home
- Entertainment
- పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహాన్ని ముద్దాడిన సీఎం బొమ్మై... చివరకు తల్లిదండ్రుల ఒడిలోకి చేరిన సూపర్ స్టార్
పునీత్ రాజ్ కుమార్ పార్ధీవ దేహాన్ని ముద్దాడిన సీఎం బొమ్మై... చివరకు తల్లిదండ్రుల ఒడిలోకి చేరిన సూపర్ స్టార్
ఒక అధ్యాయం ముగిసింది. హీరో పునీత్ రాజ్ కుమార్ నింగికేగారు. అభిమానులు, అయినవారి అశృనయనాలతో ఆయనకు వీడ్కోలు పలికారు. హీరో కి మించిన ఓ మానవతావాదిని కోల్పోయిన కన్నడ ప్రజలు తల్లడిల్లిపోయారు.

అక్టోబర్ 29 శుక్రవారం ఉదయం తన దిన చర్యలో భాగంగా Puneeth rajkumar జిమ్ లో వ్యాయామం చేస్తున్నారు. ఒక్కసారిగా అస్వస్థతకు గురైన పునీత్ నేలపై పడ్డారు. ఐదు నిమిషాల వ్యవధిలో కుటుంబ సభ్యులు ఆయనను పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఐసీయూ సిద్ధం చేసి ఉంచాలని కూడా సమాచారం ఇచ్చారు. ఆ కొంచెం సమయంలోనే అనుకోని ప్రమాదం జరిగిపోయింది. పునీత్ తుదిశ్వాస విడిచారు.
పునీత్ మరణం సౌత్ ఇండియాలోని అన్ని చిత్ర పరిశ్రమలను కుదిపివేసింది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మన తెలుగు స్టార్స్ లో చాల మందితో పునీత్ మంచి సాన్నిహిత్యం కలిగి ఉన్నారు.NTR, బాలయ్య, చిరంజీవి, అల్లు అర్జున్ ఇలా అనేకమందికి ఆయనతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది.
శనివారం పునీత్ పార్ధీవదేహాన్ని ఎన్టీఆర్, బాలయ్య, వెంకటేష్, Chiranjeevi, ఆలీ, శ్రీకాంత్ వంటి ప్రముఖులు సందర్శించారు. Balakrishna లాంటి గంభీరమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి, చలనం లేకుండా పడి ఉన్న పునీత్ ని చూసి కన్నీరు పెట్టుకున్నారంటే అర్థం అవుతుంది, ఆయన స్నేహం ఇతరులపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో.
పెద్ద కూతురు వందన రాక ఆలస్యం కావడంతో శనివారం జరగాల్సిన Puneeth rajkumar funerals ఆదివారానికి పోస్ట్ ఫోన్ చేశారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పునీత్ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో పూర్తి చేయాలని ఆదేశించారు.
నేడు ఉదయం తెల్లవారుజాము నుండే పునీత్ అంత్యక్రియలు మొదలుపెట్టారు కుటుంబ సభ్యులు. తన తల్లిదండ్రులు రాజ్ కుమార్, పార్వతమ్మ సమాధుల ప్రక్కనే, కంఠీరవ స్టూడియోలో పునీత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడం జరిగింది.
కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయవేత్తలు కుటుంబ సభ్యులతో పాటు పునీత్ అంత్యక్రియలలో పాల్గొన్నారు. కెజిఎఫ్ స్టార్ యష్, మరో స్టార్ హీరో సుదీప్ అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. సుదీప్ ఆద్యంతం కన్నీటి పర్యంతం అయ్యారు.
ఇక అన్న శివ రాజ్ కుమార్ ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పునీత్ పార్దీవ దేహాన్ని ముద్దాడారు. ఆయన తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు అర్థమైంది. పునీత్ పార్ధీవ దేహాన్ని చూస్తూ, అక్కడే ఆయన కొంత సేపు ఉండిపోయారు.
పునీత్ పార్దీవ దేహాన్ని ఖననం చేయడం జరిగింది. అనంతరం పునీత్ అన్న కుమార్ వినయ్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్ కుమార్ కి ఇద్దరూ కుమార్తెలే కావడంతో, అన్న కుమారుడు వినయ్ అంతిమ సంస్కారాలు నిర్వహిచడం జరిగింది.
కంఠీరవ స్టూడియో వద్దకు పునీత్ అశేష అభిమానులు చేరుకోవడం జరిగింది. ఆయన అంతిమ సంస్కారాలు ప్రత్యక్షంగా చూడకున్నా, చివరిగా వీడ్కోలు చెప్పడానికి అక్కడకు గంపులుగా చేరారు. ఓ మంచి నటుడు, సింగర్, డాన్సర్ అన్నిటికీ మించి ఓ మానవతావాదిని కళామతల్లి కోల్పోయింది.
అక్టోబర్ 29 శుక్రవారం ఉదయం తన దిన చర్యలో భాగంగా Puneeth rajkumar జిమ్ లో వ్యాయామం చేస్తున్నారు. ఒక్కసారిగా అస్వస్థతకు గురైన పునీత్ నేలపై పడ్డారు. ఐదు నిమిషాల వ్యవధిలో కుటుంబ సభ్యులు ఆయనను పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఐసీయూ సిద్ధం చేసి ఉంచాలని కూడా సమాచారం ఇచ్చారు. ఆ కొంచెం సమయంలోనే అనుకోని ప్రమాదం జరిగిపోయింది. పునీత్ తుదిశ్వాస విడిచారు.
అక్టోబర్ 29 శుక్రవారం ఉదయం తన దిన చర్యలో భాగంగా Puneeth rajkumar జిమ్ లో వ్యాయామం చేస్తున్నారు. ఒక్కసారిగా అస్వస్థతకు గురైన పునీత్ నేలపై పడ్డారు. ఐదు నిమిషాల వ్యవధిలో కుటుంబ సభ్యులు ఆయనను పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఐసీయూ సిద్ధం చేసి ఉంచాలని కూడా సమాచారం ఇచ్చారు. ఆ కొంచెం సమయంలోనే అనుకోని ప్రమాదం జరిగిపోయింది. పునీత్ తుదిశ్వాస విడిచారు.
అక్టోబర్ 29 శుక్రవారం ఉదయం తన దిన చర్యలో భాగంగా Puneeth rajkumar జిమ్ లో వ్యాయామం చేస్తున్నారు. ఒక్కసారిగా అస్వస్థతకు గురైన పునీత్ నేలపై పడ్డారు. ఐదు నిమిషాల వ్యవధిలో కుటుంబ సభ్యులు ఆయనను పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఐసీయూ సిద్ధం చేసి ఉంచాలని కూడా సమాచారం ఇచ్చారు. ఆ కొంచెం సమయంలోనే అనుకోని ప్రమాదం జరిగిపోయింది. పునీత్ తుదిశ్వాస విడిచారు.
అక్టోబర్ 29 శుక్రవారం ఉదయం తన దిన చర్యలో భాగంగా Puneeth rajkumar జిమ్ లో వ్యాయామం చేస్తున్నారు. ఒక్కసారిగా అస్వస్థతకు గురైన పునీత్ నేలపై పడ్డారు. ఐదు నిమిషాల వ్యవధిలో కుటుంబ సభ్యులు ఆయనను పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఐసీయూ సిద్ధం చేసి ఉంచాలని కూడా సమాచారం ఇచ్చారు. ఆ కొంచెం సమయంలోనే అనుకోని ప్రమాదం జరిగిపోయింది. పునీత్ తుదిశ్వాస విడిచారు.
Also read Puneeth Rajkumar: పునీత్ అంత్యక్రియలు పూర్తి.. బాబాయ్ రుణం తీర్చుకుంటూ, కన్నీటి వీడ్కోలు
Also read Puneeth Rajkumar death:తండ్రి పునీత్ పార్థివ దేహం చూసి కన్నీరుమున్నీరైన కూతురు ధృతి..