- Home
- Entertainment
- Trolls On Kareena Kapoor: నీది చాలా చీప్ టేస్ట్ , కరీనా కపూర్ టీ షర్ట్ పై దారుణమైన ట్రోల్స్
Trolls On Kareena Kapoor: నీది చాలా చీప్ టేస్ట్ , కరీనా కపూర్ టీ షర్ట్ పై దారుణమైన ట్రోల్స్
ఫిల్మ్ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో పొగడ్తలతో పాటు.. ట్రోల్స్ కూడా తప్పడం లేదు. గతంలో సున్నితంగా తిట్టి వదిలేసేవారు... కాని ఈ మధ్య దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు. బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ కు ఇటువంటి అనుభవమే ఎదురయ్యింది.

సెలబ్రిటీలకు సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్.. అందులో తము ఏం చేసినా.. అది అభిమానుల అభిప్రాయం కోసం అన్నట్టు పెడుతుంటారు. ఇక వాళ్లు తిట్టినా.. పొగిడినా భరించాల్సిందే. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో కాదు.. బయట కనిపించినా.. జనాలకు నచ్చకపోతే వదిలిపెట్టడం లేదు. ధారుణంగా తిట్టిపోస్తున్నారు. బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ను కూడా ప్రస్తుతం ధారణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఫ్యాషన్‌కు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటారు సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ రకరకాల ఫ్యాషన్ వేర్ కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా వాకింగ్, జాగింగ్, పార్టీ, డిన్నర్ డేట్, టూర్.. ఇలా ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా స్పెషల్‌గా కనిపించేలా జాగ్రత్తపడుతుంటారు.
ఈ క్రమంలో వారి స్టయిల్‌పై కొన్నిసార్లు విమర్శలు సైతం వ్యక్తమవుతుంటాయి. తాజాగా కరీనా కపూర్ కూడా ఈ విమర్శల బారిన పడింది.ఆమె వేసుకున్న టీ షర్ట్ నెటిజన్లకు కోపం తెప్పించింది. దారుణంగా ట్రోల్స్ చేసేలా చేసింది.
రీసెంట్ గా కరీనా కపూర్ గుస్సీ ఎల్లో టీషర్ట్‌తో బయట కనిపించింది. సెలబ్రిటీలు బయట దొరగడమే ఆలస్యం కెమెరాలు ఊరుకుంటాయా..? ఫొటోగ్రాఫర్లు వెంటనే కెమెరాలకు పని చెప్పి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో వదిలారు. నెట్టింట అవి కాస్తా వైరల్‌గా మారాయి.
ఇక మొదలయ్యాయి కామెంట్స్ ఆ టీషర్ట్ దరిద్రంగా ఉంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు నెటిజన్లు. కరీనా 40 వేలు పెట్టి కొనుకున్న టీ షర్ట్ అష్ట దరిద్రంగా ఉందని పెదవి విరుస్తున్నారు.
అంతేనా ఇంకాస్త ముందుకు వెళ్లి... నీ టేస్ట్ ఏడ్చినట్లుంది మేము 150 పెడితే మూడు టీషర్ట్స్ వచ్చాయి. నువ్వు వేసుకున్నదానికంటే అవే చాలా బాగున్నాయి అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా కరీనా వార్డ్‌రోబ్‌లో గుస్సీ టీషర్ట్స్ 50 కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం.