మరో అమ్మాయితో పెళ్ళికి రెడీ అవుతున్న స్టార్ హీరోతో డేటింగ్ ? నేను కొంపలు కూల్చే రకం కాదు అంటూ కరీనా ఫైర్
బాలీవుడ్ లో లవ్ స్టోరీలు చాలా విచిత్రంగా ఉంటాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు ఏదో ఒక సందర్భంలో లవ్ ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నవారే.
బాలీవుడ్ లో లవ్ స్టోరీలు చాలా విచిత్రంగా ఉంటాయి. స్టార్ హీరోలు, హీరోయిన్లు ఏదో ఒక సందర్భంలో లవ్ ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొన్నవారే. రణబీర్ కపూర్ అయితే లెక్కలేన్నన్ని ఎఫైర్లు నడిపాడని బాలీవుడ్ లో టాక్. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, కత్రినా కైఫ్, అమీషా పటేల్, ఏంజెలా జాన్సన్ ఇలా చాలా మంది హీరోయిన్లతో రణబీర్ డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. చివరికి ఈ హ్యాండ్సమ్ హీరో అలియా భట్ ని వివాహం చేసుకున్నాడు.
ఇక స్టార్ బ్యూటీ కరీనా కపూర్ పై కూడా రూమర్స్ ఉన్నాయి. కరీనా కపూర్ గతంలో హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ లాంటి హీరోలతో డేటింగ్ చేసినట్లు బాలీవుడ్ లో రూమర్స్ వచ్చాయి. షాహిద్ కపూర్ తో అయితే ఆమె బహిరంగంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. వీళ్లిద్దరి పెళ్లి ఖాయం అన్నంత క్లోజ్ గా ఉన్నారు. వీరి పర్సనల్ ఫొటోస్ కూడా అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. కానీ చివరికి బ్రేకప్ చేసుకున్నారు.
అయితే హృతిక్ రోషన్ తో కరీనా సీక్రెట్ ఎఫైర్ సాగించినట్లు కూడా రూమర్స్ ఉన్నాయి. అప్పటికి హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుసాన్నె ఖాన్ తో ప్రేమలో ఉంటూ ఆమెకి కమిటై ఉన్నాడు. త్వరలో పెళ్లి చేసుకోబోయే హీరోని కరీనా బుట్టలో వేసుకుంది అంటూ ప్రచారం జరిగింది. తన పాస్ట్ లైఫ్ పై తాజాగా ఇంటర్వ్యూలో కరీనా స్పందించింది.
హృతిక్ రోషన్ తో డేటింగ్ చేసినట్లు వచ్చిన రూమర్స్ ని కరీనా తీవ్రంగా ఖండించింది. నేను ఫారెన్ వెళ్లి తిరిగి వచ్చేలోపు ఈ రూమర్స్ వచ్చాయి. ముజేసె దోస్తీ కరోగే, మెయిన్ ప్రేమ్ కి దీవానా హూన్ లాంటి చిత్రాల్లో హృతిక్, కరీనా జంటగా నటించారు.
హృతిక్ తో ఎఫైర్ గురించి మాట్లాడుతూ హృతిక్ ఆల్రెడీ సుహాన్నేతో కమిటయ్యారు. సుహాన్నే నాకు మంచి స్నేహితురాలు. వాళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు వెళతాను. నేను కొంపులు కూల్చే రకం కాదు. హృతిక్ తో తాను డేటింగ్ చేసినట్లు వచ్చిన రూమర్స్ మొత్తం అవాస్తవం అని కరీనా పేర్కొంది. హృతిక్ కూడా చాలా మంచి పిల్లాడు. అలాంటి పనులు చేయడు అంటూ ఫన్నీగా తెలిపింది.