MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్

Rishab Shetty: పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టి బర్త్ డే సెలెబ్రేషన్స్.. భార్య పిల్లలతో ఇలా, వైరల్ పోటోస్

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. బెంగళూరులోని 'కింగ్స్ క్లబ్'లో కుటుంబ సభ్యులు, మీడియా, స్నేహితుల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 07 2026, 10:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రిషబ్ శెట్టి 43వ పుట్టినరోజు
Image Credit : Asianet News

రిషబ్ శెట్టి 43వ పుట్టినరోజు

నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి 43వ వసంతంలోకి అడుగుపెట్టారు. నిన్న రాత్రి బెంగళూరులోని 'కింగ్స్ క్లబ్'లో తన కుటుంబం, మీడియా మిత్రులు, సన్నిహితులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రిషబ్ శెట్టి భార్య, పిల్లలు
Image Credit : Asianet News

రిషబ్ శెట్టి భార్య, పిల్లలు

‘కింగ్స్ క్లబ్’ను లైట్లు, పువ్వులతో అందంగా అలంకరించారు. ఆ స్టేజీపై రిషబ్ శెట్టి తన భార్య ప్రగతి శెట్టి, పిల్లలు, ఆత్మీయులతో కలిసి బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుని ఈ వేడుక జరుపుకోవడం విశేషం.

36
జై హనుమాన్
Image Credit : Asianet News

జై హనుమాన్

ప్రస్తుతం రిషబ్ శెట్టి 'జై హనుమాన్' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. దీనితో పాటు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' చిత్రం కోసం కూడా సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలతో కన్నడలోనే కాకుండా మరాఠీ, పాన్ ఇండియా స్థాయిలోనూ మెరవనున్నారు.
46
భారీ ప్రాజెక్ట్‌
Image Credit : Asianet News

భారీ ప్రాజెక్ట్‌

రిషబ్ తన స్వీయ దర్శకత్వంలో 'కాంతార చాప్టర్ 2'ను రూపొందించే పనిలో ఉన్నారు. అలాగే, మలయాళ ప్రముఖ రచయిత ఎం.టి. వాసుదేవన్ నాయర్ రాసిన 'రండమూళం' నవలను సినిమాగా తీసే భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన బృందం రీసెర్చ్ చేస్తోంది.
56
కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించే ఆలోచన
Image Credit : others

కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించే ఆలోచన

రిషబ్ శెట్టి సమయాన్ని అస్సలు వృథా చేయరని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. 'జై హనుమాన్' చిత్రంలో నటనకు మాత్రమే పరిమితం కావడంతో, మిగిలిన సమయంలో కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
66
సొంత ఊరిలో యక్షగానం
Image Credit : Rishab Shetty

సొంత ఊరిలో యక్షగానం

సినిమాలే కాకుండా, రిషబ్ శెట్టి కళలు, సంస్కృతికి ఎంతో గౌరవం ఇస్తారు. ఇటీవల తన సొంత ఊరిలో యక్షగానం, భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో ఆయన కుమారుడు రణ్విత్ శెట్టి యక్షగానంలో పాత్ర పోషించి తొలిసారిగా రంగస్థలంపై కనిపించాడు. తాను దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిపై కూడా ఆయన దృష్టి సారించారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
Recommended image2
Bigg Boss Telugu 10: కవరింగ్ స్టార్ రోహిత్ అంటూ నామినేట్ చేసిన త్రిగుణ్, షాలినికి ఇచ్చి పడేసిన రామ్ ప్రసాద్
Recommended image3
Allu Sneha: సోషల్ మీడియాలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ భార్య.. ఫ్యామిలీని చూసుకుంటూనే బిజినెస్ లో సంపాదన
Related Stories
Recommended image1
Naga Vamsi: ఆడపిల్ల శాడిజం చూపించడం వల్లే బ్లాక్ బస్టర్ అయింది.. ప్రపంచాన్ని ఊపేసిన మూవీపై నాగవంశీ రివ్యూ
Recommended image2
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved