MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా

అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా

అయోధ్యలో భూమి కొనుగోలు కోసం అమితాబ్ బచ్చన్ రాత్రి 3 గంటలకు ఫోన్ చేశారని అభినందన్ లోధా వెల్లడించారు. ధర తెలుసుకున్న మరుసటి రోజే రూ.15 కోట్లు బదిలీ చేశారని చెప్పారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 07 2026, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అయోధ్య భూమి కోసం రాత్రి 3 గంటలకు ఫోన్
Image Credit : Asianet News

అయోధ్య భూమి కోసం రాత్రి 3 గంటలకు ఫోన్

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అయోధ్యలో భూమి కొనుగోలు చేసిన సందర్భానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా వ్యవస్థాపకుడు, చైర్మన్ అభినందన్ లోధా వెల్లడించారు. హిందుస్థాన్ టైమ్స్ ఇండియా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2026లో మాట్లాడిన ఆయన, 2023లో తాను ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. రాత్రి 3 గంటలకు తన ఫోన్‌లో రెండు మిస్డ్ కాల్స్, అనంతరం "నేను అమితాబ్ బచ్చన్.. వీలైనప్పుడు తిరిగి కాల్ చేయండి" అనే సందేశం కనిపించిందని చెప్పారు. వెంటనే తిరిగి ఫోన్ చేసినప్పుడు, "నేను ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడిని. అయోధ్యలో నాకు భూమి కొనుగోలు చేయాలని ఉంది" అని అమితాబ్ తనతో చెప్పినట్లు లోధా గుర్తు చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ధర చెప్పిన మరుసటి రోజే రూ.15 కోట్లు బదిలీ
Image Credit : instagram

ధర చెప్పిన మరుసటి రోజే రూ.15 కోట్లు బదిలీ

ఆ సంభాషణలో మొదట అమితాబ్ భూమి ధర గురించి అడిగారని లోధా తెలిపారు. "మీతో ధర గురించి ఎలా మాట్లాడగలను?" అని తాను చెప్పగా, అమితాబ్ 15 వేల చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారని చెప్పారు. దానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చవుతుందని తాను చెప్పిన వెంటనే, మరుసటి రోజే అమితాబ్ బచ్చన్ రూ.15 కోట్లు బదిలీ చేశారని లోధా వెల్లడించారు. ఈ సంఘటనను ఆయన సమ్మిట్‌లో గుర్తు చేసుకుంటూ వివరించారు.

Related Articles

Related image1
Naga Vamsi: ఆడపిల్ల శాడిజం చూపించడం వల్లే బ్లాక్ బస్టర్ అయింది.. ప్రపంచాన్ని ఊపేసిన మూవీపై నాగవంశీ రివ్యూ
Related image2
Chiranjeevi: చిరంజీవి నుంచి రాజేంద్రప్రసాద్ వరకు, నట విశ్వరూపం చూపించిన ఐదుగురు..కానీ నేషనల్ అవార్డు మిస్
35
అయోధ్యలో అమితాబ్ భారీ స్కెచ్
Image Credit : Amitabh Bachchan Blog

అయోధ్యలో అమితాబ్ భారీ స్కెచ్

అయోధ్యలో అమితాబ్ బచ్చన్ గత కొన్నేళ్లుగా తన రియల్ ఎస్టేట్ పెట్టుబడులను క్రమంగా విస్తరిస్తున్నారు. 2026 మార్చిలో ఆయన ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా నుంచి రూ.35 కోట్ల విలువైన 2.67 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. సంస్థ వివరాల ప్రకారం, అయోధ్యలో ఇది ఆయన మూడో పెట్టుబడి కాగా, హెచ్‌ఓఏబీఎల్‌తో చేసిన నాలుగో ప్లాటెడ్ డెవలప్‌మెంట్ కొనుగోలు. ఈ భూమి సంస్థ చేపడుతున్న 75 ఎకరాల ది సరయూ ప్రాజెక్టుకు సమీపంలో ఉంది.

45
అయోధ్యలో భూమి సంపద మాత్రమే కాదు
Image Credit : X

అయోధ్యలో భూమి సంపద మాత్రమే కాదు

ఆ పెట్టుబడి సందర్భంగా కూడా అభినందన్ లోధా స్పందించారు. "అమితాబ్ బచ్చన్ చేసిన పెట్టుబడి, భూమిని తరతరాలకు విలువను అందించే ఆస్తిగా చూసే ఉమ్మడి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది" అని ఆయన అన్నారు. "మా సంస్థలో భూమిని కేవలం సంపదగా కాకుండా వారసత్వంగా చూస్తాం. అయోధ్యలో ఈ వారసత్వానికి మరింత ప్రత్యేకమైన అర్థం ఉంది. విశ్వాసం, వారసత్వం రెండూ కలిసే ప్రదేశంగా ఇది నిలుస్తోంది. మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ పెట్టుబడులతో అయోధ్య దీర్ఘకాలిక భూమి పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మారుతోంది" అని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.

55
అయోధ్యలో అమితాబ్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం
Image Credit : Asianet News

అయోధ్యలో అమితాబ్ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం

అంతకుముందు 2025 మేలో అమితాబ్ బచ్చన్ ది సరయూ ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని సుమారు రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే 2024లో హెచ్‌ఓఏబీఎల్ ప్రధాన మిక్స్‌డ్ యూజ్ ప్రాజెక్ట్ ది సరయూలోని 10 వేల చదరపు అడుగుల ప్లాట్‌ను రూ.14.5 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఇలా వరుస పెట్టుబడులతో అయోధ్యలో అమితాబ్ బచ్చన్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకుంటూ వస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Recommended image2
BiggBoss Telugu 10: బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ఆ ముగ్గురి ఫ్రెండ్స్ కోసం హైపర్ ఆది స్పెషల్ సపోర్ట్
Recommended image3
Ram Prasad Remuneration: రామ్‌ ప్రసాద్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పారితోషికం.. బుల్లితెర స్టార్‌కి ఝలక్‌
Related Stories
Recommended image1
Naga Vamsi: ఆడపిల్ల శాడిజం చూపించడం వల్లే బ్లాక్ బస్టర్ అయింది.. ప్రపంచాన్ని ఊపేసిన మూవీపై నాగవంశీ రివ్యూ
Recommended image2
Chiranjeevi: చిరంజీవి నుంచి రాజేంద్రప్రసాద్ వరకు, నట విశ్వరూపం చూపించిన ఐదుగురు..కానీ నేషనల్ అవార్డు మిస్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved