- Home
- Entertainment
- Nabha Natesh:చారల కోటులో సూపర్ హాట్ గా... కొంచెం గ్యాప్ ఇచ్చి మంటలు రేపిన కన్నడ భామ!
Nabha Natesh:చారల కోటులో సూపర్ హాట్ గా... కొంచెం గ్యాప్ ఇచ్చి మంటలు రేపిన కన్నడ భామ!
అవకాశాలు కనుమరుగవుతున్న తరుణంలో అందాలనే నమ్ముకొని, గ్లామర్ తో గాలం వేస్తుంది నభా నటేష్ (Nabha natesh). వరుస పరాజయాలతో వెనుకబడ్డ అమ్మడు, కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తుంది. ఒకటి రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.

మరి సినిమాలు లేకుంటే జనాలు మర్చిపోతారు. ఏదో విధంగా వార్తలలో నిలవాలంటే సోషల్ మీడియానే దిక్కు. అందుకే ఇంస్టాగ్రామ్ ని నమ్ముకున్న నభా, హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో కేక పుట్టిస్తుంది. ఇక లేటెస్ట్ నభా ఫోటో షూట్ వైరల్ గా మారింది.
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఈ కన్నడ బ్యూటీ. 2018లో విడుదలైన ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తర్వాత దర్శకుడు రఘుబాబుతో ప్రయోగాత్మక చిత్రం అదుగో చేశారు. ఆ మూవీ అట్టర్ ప్లాప్ ఖాతాలో చేరిపోగా, జనాలకు వచ్చి వెళ్లిన విషయం కూడా తెలియదు.
దర్శకుడు పూరి- రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇష్మార్ట్ శంకర్ మూవీతో (Ismart shankar) హిట్ కొట్టింది. ఆ మూవీ విజయం నభాకు మంచి అవకాశాలే తెచ్చిపెట్టింది. కానీ వరుస పరాజయాలు ఆమె కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టాయి. రవితేజ (Raviteja) తో చేసిన డిస్కో రాజా అట్టర్ ప్లాప్ గా కాగా, సోలో బ్రతుకే సో బెటర్.. సో సో గానే మిగిలిపోయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు.
ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ నభా ఖాతాలో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
దీనితో నితిన్ మ్యాస్ట్రో మూవీపై భారీగా ఆశలు పెట్టుకుంది నభా. మ్యాస్ట్రో (Maestro) మూవీ కాస్తా ఓటిటిలో విడుదల కావడం జరిగింది. సినిమా పర్వాలేదు అనిపించుకున్నా, నభాకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదు.
అందుకే దర్శక నిర్మాతలకు తన అందాలతో ఎరవేయాలని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్స్ చూస్తే, ఈ విషయం అర్థం అవుతుంది. స్కిన్ షో చేస్తూ తనలోని గ్లామర్ యాంగిల్ బయటికి తీస్తున్నారు.
ప్రస్తుతం నభా చేతిలో ఒక్క మూవీ ఆఫర్ కూడా లేదు. అయితే వరుస ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ కి టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ట్రెండీ టాప్, జీన్స్ లో కిరాక్ ఫోజులిచ్చారు. నభా హాట్ హాట్ సెక్సీ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
కట్టిపడేసే అందం, చూడగానే కవ్వించే ఫిజిక్ నభా నటేష్ సొంతం. అదృష్టం కలిసిరాక, హిట్స్ పడకపోవడంతో ఆమె రేసులో వెనుకబడిపోయారు. గ్లామర్, యాక్టింగ్ కంటే కూడా హిట్ చిత్రాలే ఓ నటి ఎదుగుదలకు ప్రామాణికాలు. ఆ లెక్కన చూస్తే నభా ఎక్కడో ఉన్నారు. నభా కెరీర్ లో అత్యధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి.