- Home
- Entertainment
- Janaki Kalaganaledu: సీన్ లోకి కన్నబాబు.. చెయ్యి విరగడంతో వంటల పోటీకి దూరమైన రామచంద్ర!
Janaki Kalaganaledu: సీన్ లోకి కన్నబాబు.. చెయ్యి విరగడంతో వంటల పోటీకి దూరమైన రామచంద్ర!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో రామచంద్ర(rama chandra)పక్క టేబుల్ లో ఉన్న శ్రీలత అనే అమ్మాయిని సునంద డబ్బులు ఇచ్చి మరి రామచంద్ర ని ఎలా అయిన ఓడిపోయేలా చేయాలని చెబుతుంది. డబ్బుకు ఆశపడే సునంద(sunanda) మాటలకు ఓకే అని చెబుతుంది ఆ అమ్మాయి. దీంతో సీసీ కెమెరాల ద్వారా జానకి అసలు విషయాన్ని బయట పెడుతుంది. జానకి ఆ మాట చెప్పడంతో శ్రీలత నిజాన్ని ఒప్పుకుంటుంది.
సునంద ప్లాన్ మొత్తం రివర్స్ అవ్వడంతో కొంత రగిలిపోతూ ఉంటుంది. రామచంద్ర(rama chamdra) కుటుంబం సంతోషంగా ఫీల్ అవుతూ ఉండగా రామచంద్రను అపార్ధం చేసుకున్నందుకు జడ్జి లు క్షమాపణలు చెబుతారు. శ్రీలత తో పాటు మరో కంటెస్టెంట్ ను సెమీ ఫైనల్ లో ఎలిమినేట్ చేస్తారు. మరొకవైపు మల్లిక(mallaika) తో విష్ణు మోకాళ్ళ ప్రదర్శనలు చేయిస్తూ ఉంటాడు.
ఇంతలోనే విష్ణుకీ గోవిందరాజులు(govindaraju) ఫోన్ చేసి అన్నయ్య సెమీఫైనల్లో గెలిచాడు అని చెప్పడంతో సంతోష పడతారు. అప్పుడు విష్ణువు మల్లిక వైపు చూసి డల్ గా మాట్లాడుతున్నట్టు నటిస్తాడు. అప్పుడు మల్లిక ఏదో జరిగింది అని ఆనంద పడుతూ ఉండగా ఇంతలోనే విష్ణు(vishnu)అన్నయ్య గెలిచాడు అని అనడంతో మల్లిక ముఖమంతా ఒకలాగా పెడుతుంది.
ఆ తర్వాత రామచంద్ర(ramachandra) దంపతులు గోవిందరాజు దంపతులు సరదాగా రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ వారు సరదాగా మాట్లాడుతూ ఉండగా అప్పుడే గోవిందరాజు కన్నబాబు (kanna babu)ను చూసి పలకరిస్తాడు. నిన్నటి వరకు మీ అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా అనటంతో.. మా అమ్మ వచ్చిన పని పూర్తి కాలేదు అని అందుకే నేను వచ్చాను అని అంటాడు.
అప్పుడు గోవిందరాజు(govinda raju)కన్నబాబు కి వెటకారంగా సమాధానమిస్తూ ఉండటంతో కన్నబాబు అవమానంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతేకాకుండా ఎవరు ఎన్ని పనులు చేసినా మా రామచంద్రనే గెలుస్తాడు అని అంటాడు గోవిందరాజు. రామచంద్ర కూడా కన్నబాబుతో వెటకారం గానే స్పందిస్తాడు. ఆ తర్వాత జానకి (janaki)దంపతులు ఒకచోట కూర్చొని ఉండగా జానకి వచ్చి జరిగిన విషయం చెబుతుంది.
అప్పుడు రామచంద్ర(rama Chandra )రేపు కాంపిటీషన్ లో ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉండగా జానకి ధైర్యం చెబుతుంది. అప్పుడే మేడ మీద ఉన్న కన్నబాబు రామచంద్ర చేతి పై పూల పట్టి వేయడంతో కుడి చేతికి గాయం అవుతుంది. వెంటనే డాక్టర్ ని పిలిపించి వైద్యం చేయించగా.. కాస్త జాగ్రత్తగా ఉండమని.. ఎటువంటి పనులు చేయకూడదు అని అంటాడు.