MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Kangana Ranaut: వల్గర్ ఫోజు, వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. కంగనాకు ఢిల్లీ అసెంబ్లీ నోటీసులు

Kangana Ranaut: వల్గర్ ఫోజు, వివాదాస్పద వ్యాఖ్యల ఎఫెక్ట్.. కంగనాకు ఢిల్లీ అసెంబ్లీ నోటీసులు

ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. తనపై ఎంతగా ట్రోలింగ్ జరిగినా, ఎన్ని విమర్శలు ఎదురైనా కంగనా మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు.

2 Min read
Author : pratap reddy
Published : Nov 25 2021, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. తనపై ఎంతగా ట్రోలింగ్ జరిగినా, ఎన్ని విమర్శలు ఎదురైనా కంగనా మాత్రం తన వైఖరి మార్చుకోవడం లేదు. సిక్కులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, అనంతరం సోషల్ మీడియాలో ఓ వల్గర్ పోస్ట్ పెట్టడంతో కంగనా రనౌత్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. దీనితో కంగనా రనౌత్ పై పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా ఢిల్లీ అసెంబ్లీ రంగంలోకి దిగడంతో Kangana Ranaut వ్యవహారం సీరియస్ గా మారింది. కంగనా సిక్కులని ఉద్దేశిస్తూ ఇటీవల తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు శాంతి సామరస్యాలపై ప్రభావం చూపుతాయని భావించిన Delhi Assembly కంగనాకు సమన్లు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం కంగనా రనౌత్ డిసెంబర్ 6న ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కమిటీకి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద నాయకత్వం వహిస్తారు. 

36

కంగనా వ్యాఖ్యలపై తమకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయని, అందుకే ఆమెకు నోటీసులు పంపినట్లు ఢిల్లీ అసెంబ్లీ పేర్కొంది. మోడీ వ్యవసాయ చట్టాలని రద్దు చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. దీనితో దేశవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతు ఉద్యమంలో పాల్గొన్న సిక్కులపై కంగనా పరోక్షంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దీనికి ఖలిస్తాని ఉద్యమం అంటారు అంటూ కంగనా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. ఖలిస్తాని టెర్రరిస్టులతో వారిని పోల్చడంపై పలువురు కంగనా పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. 

46

ఆమెపై ముంబైలో ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదైంది. ఖలిస్తాని టెర్రరిస్టులు మోడీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఓ మహిళా ప్రధాని వీరిని ఊచకోత కోసిన సంగతిని మరచిపోతున్నారు అంటూ పరోక్షంగా సిక్కులని ఉద్దేశిస్తూ కంగనా తీవ్రమైన కామెంట్స్ చేసింది. దీనితో రైతులు, సిక్కు సంఘాలు కంగనాపై కేసులు పెడుతున్నారు. తనపై నమోదవుతున్న కేసులపై కూడా కంగనా ఓ వల్గర్ పోస్ట్ తో స్పందించింది. 

 

56

చేతిలో మద్యం గ్లాస్ పట్టుకుని ఉన్న కంగనా హాట్ డ్రెస్ లో బోల్డ్ గా పోజు ఇచ్చింది. ఒక వేళ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా మూడ్ ఇలా ఉంటుంది అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. కంగనా వ్యవహారం హీటెక్కుతుండడంతో ఢిల్లీ అసెంబ్లీ నోటీసులు పంపింది. మరి డిసెంబర్ 6న కంగనా ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ముందు విచారణకు హాజరవుతుందో లేదో చూడాలి. 

 

66

సినిమాల విషయానికి వస్తే కంగనా రనౌత్ ఇటీవల జయలలిత బయోపిక్ 'తలైవి' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఏఎల్ విజయ్ దర్శకత్వం, విజయేంద్ర ప్రసాద్ రచనలో తెరకెక్కిన ఆ చిత్రం ఆశించిన విజయం అందుకోలేకపోయింది. 

 

About the Author

PR
pratap reddy
నరేంద్ర మోదీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved