పెళ్లి చేసుకోవాలి అని ఉంది కాని.. కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..
పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. కాంట్రవర్సీలకు కేరాఫ్ గా ఉన్న ఆమె ఎవరిని చేసుకుంటుదిలే అని అనుకునేవారికి.. ఆమె తన ప్రేమను వెల్లడించింది. తనకు కూడా పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నట్టుపేర్కొంది కంనగా.. కాని..?

refuse promote brands
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలతో ఆడుకునే ఏకైక హీరోయిన్ కంగనా రనౌత్. ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఆమె.. ఏదో ఒక విషయంలో వైరల్ న్యూస్ అవుతూనే ఉంటుంది. బాలీవుడ్ అంత ఒకవైపు ఉంటే.. ఆమె మాత్రం మరోవైపు ఉంటుంది. ఎవరీ..ఏ స్థాయిలో ఉన్నారు అనేది పట్టించుకోకుండా ఓ రేంజ్ లో బ్యాండ్ వేస్తుంటుంది. కంగనా. తరచు ఏదో ఒక కాంట్రవర్సీల ద్వారా వార్తల్లో నిలుస్తుంటుంది.
ఏ విషయం గురించైనా నిర్మొహమాటంగా మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా ఆమె చేసే పోస్టులు పలు వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి. ఈ విధంగా తరచూ వార్తల్లో నిలిచే ఈమె తాజాగా పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కంగనా రౌనత్ పెళ్లి గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
తనకు కూడా పెళ్ళి చేసుకోవాలని ఉందట. అంతే కాదు అందరిలాగే పెళ్లి చేసుకుని కొత్త జీవితం... సొంత ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటుందట. ఇన్నాళ్ళకు తన మనసులో మాట బయట పెట్టింది కంగనా. అయితే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటేనే పెళ్లి జరగదు కదా అంటూ తన పై తానే సెటైర్ వేసుకుంది బ్యూటీ.
అంతే కాదు దీనికి కాస్త వేదాంతం కూడా ఆడ్ చేసి.. ఏది ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుందని.. మనం తొందరపడినంత మాత్రాన జరగదు కదా అంటూ కాస్త ఆధ్యాత్మికంగా మాట్లాడింది బ్యూటీ. తెలియజేశారు.నా పెళ్లి ఎప్పుడు జరగాలని ఉందో అప్పుడే జరుగుతుందనీ ఈ సందర్భంగా కంగనా పెళ్లి చేసుకోవాలని కోరిక తనలో ఉంది అంటూ చెప్పకనే చెప్పేశారు.