యాసిడ్ దాడిజరుగుతుందేమో.. ముఖం దాచుకోవల్సి వస్తుంది.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ లో కాంట్రవర్సీ స్టార్ అంటే వెంటనే గుర్తుకువచ్చేది కంగనా రనౌత్. ఎన్నో వివాదాలు.. ఎన్నో పోరాటాలు. బాలీవుడ్ లో మహా మహులకే ఎదురెళ్ళిన ఈ బ్యూటీ.. రీసెంట్ గా కొన్ని సంచలన విషయాలు మాట్లాడింది. అందరూ ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడించింది కంగనా.

బాలీవుడ్ లో అందరు నటీనటులది రొటీన్ రోల్ అయితే.. దానికిభిన్నమైన క్యారెక్టర్ కంగనా రనౌత్ ది. బీటౌన్ లో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కంగనా రనౌత్.. అంతే వివాదాలు కూడా తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు కాంట్రవర్షియల్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తుంటుంది బ్యూటీ.
ఏ విషయం అయినా... ఎంత పెద్దవారు ఉన్నా..ముక్కుసూటిగా.. ముఖం మీదనే కోట్టినట్టు చెప్పేస్తుంది కంగనా. ఎంతటివారికైనా ఎదురెళ్ళి ధైర్యంగా మాట్లాడే దమ్మున్న ఈ హీరోయిన్ ఒక విషయంలో మాత్రం ఎప్పుడూ భయపడుతూనే ఉంటుందట.
Kangana Ranaut
తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు కంగనా రనౌత్. కొన్ని ఎక్జాంపుల్స్ కూడా చెప్పారు కంగనా.. ప్రస్తుత సమాజంలో ఒక అమ్మాయి ప్రేమకు నో చెబితే వారిపై యాసిడ్ దాడులు జరగడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈ యాసిడ్ దాడుల గురించి నాకు కూడా భయంగా ఉంది అని అన్నారు కంగనా.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన సోదరిపై యాసిడ్ దాడి జరగడంతో ఆమెకు 52 సార్లు సర్జరీ నిర్వహించారని, ఈ క్రమంలోనే తన సోదరి మానసికంగా శారీరకంగా చాలా కృంగిపోయిందని చెప్పుకొచ్చారు.ఈ ఘటన తనని ఎప్పుడూ కలిసి వేస్తుందని అందుకే తన పక్క నుంచి ఎవరైనా వెళ్తున్నా కూడా తనపై ఆసిడ్ దాడి చేస్తారేమోనని తాను ఎప్పుడు భయపడుతూనే ఉంటానని తెలిపారు.
ఈ విధంగా తాను వెళుతున్నప్పుడు పక్కన ఎవరైనా వెళ్తే యాసిడ్ దాడి భయంతోనే తాను ముఖం దాచుకుంటానంటూ ఈ సందర్భంగా కంగనా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ఈమె చంద్రముఖి 2 సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.