మహేష్ తో పోకిరి లో నన్నే చేయమన్నారు, కంగనా రనౌత్ కామెంట్స్.. ఎలా మిస్ అయ్యిందంటే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు జోడీగా కంగనా రనౌత్.. ఇది ఇప్పుటి మాట్ కాదు.. ఓ ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన పోకిరి సినిమాలో.. కంగనా నటించాల్సి ఉందట. మరి ఆసినిమా ఎలా మిస్ అయ్యింది.. కారణం ఏంటి.. ? కంగనా ఏం చెపుతోంది...?
టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో పోకిరి(Pokiri) ఒకటి. ఒక్కడు తరువాత మహేష్ బాబుకి(Mahesh Babu)మరో బ్లాక్ బస్టర్ అంటే పోకిరి అనే చెప్పాలి. అంతే కాదు.. ఈ సినిమాతో మహేష్ బాబు సూపర్ స్టార్ గా మారాడు. అంతేనా... పోకిరి ఇండస్ట్రీ హిట్ గా నిలవడంత పాటు.. అప్పటి వరకూ ఏ సినిమా సాధించలేని విధంగా 75 కోట్ల వరకూ కలెక్షన్లు కూడా సాధించింది.
పూరి జగన్నాధ్(Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో మహేష్ బాబు జోడీగా ఇలియాన నటించి అలరించింది. ఇక ఈమూవీలో హీరోయిన్ కూడా హైలెట్.. జీరో ప్యాక్ తో ఇలియానను చూసిన ఫ్యాన్స్ ఉర్రూతలూగారు. ఆమెను చూస్తూ.. పూనకాలువచ్చినట్టు ఊగిపోయారు. మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాలు ఇలియానాకు కూడా ఈసినిమాలో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అయితే అసలు ఈసినిమా లో హీరోయిన్ గా కంగనా రనౌత్ చేయాల్సి ఉందట.
టాలీవుడ్ కు దర్శకుడు పూరి జగన్నాధ్ చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ క్వీన్, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్ కూడా ఉంది. పూరి – ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో కంగనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ కంగనా అంతకుముందే పోకిరి సినిమాతోనే తెలుగు పరిశ్రమకు పరిచయం అవ్వాల్సి ఉందట. కాని ఆ సినిమా మిస్ అయ్యిందంటూ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం చంద్రముఖి2 సినిమా హడావిడిలో ఉంది కంగనా. రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ లీడ్ రోల్స్ లో.. తెరకెక్కిన చంద్రముఖి 2 సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గరలో ఉండటంతో.. ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు టీమ్. ఇక ఈక్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా టీమ్ హైదరాబాద్ కి రాగా... ఇక్కడ ప్రెస్ మీట్ లో కంగనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కంగనా మాట్లాడుతూ... నాలోని యాక్టర్ ని గుర్తించింది పూరి జగన్నాధ్. నేను ఇంకా గుర్తింపు తెచ్చుకున్న నటిని కాకముందే స్టార్ అవుతానని చెప్పారు. నాకు పోకిరి సినిమా అవకాశం వచ్చింది. పూరి జగన్నాధ్ నన్ను పోకిరి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయం చేయాలనుకున్నారు. కానీ అదే సమయంలో నాకు బాలీవుడ్ లో గ్యాంగ్‌స్టర్ సినిమా షూటింగ్ డేట్స్ కూడా ఉండటంతో పోకిరి సినిమా మిస్ చేసుకున్నాను అన్నారు.
అయితే ఆ తర్వాత కూడా పూరి తన సినిమాలో అవకాశం ఇచ్చారు ఆరకంగా.. ప్రభాస్ తో ఏక్ నిరంజన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాను అన్నారు కంగనా. అంతే కాదు ఆ సినిమాతో నేను, ప్రభాస్ మంచి స్నేహితులం అయ్యాము . షూటింగ్ లో ప్రభాస్ నన్ను టీజ్ చేసేవారు అని కంగనా అన్నారు. ఇక ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరిలో కంగనా హీరోయిన్ గా ఉంటే.. ఎలా ఉండేది అంటూ.. ఆలోచనలో పడ్డారు ఆడియన్స్.