నాతో నటించాలంటే వారికి భయం, బాలీవుడ్ స్టార్స్ కు నేనంటే ఇష్టం లేదు: కంగనా రనౌత్
కంగనాకు మరోసారి కోపం వచ్చింది. ఈసారి కూడా బాలీవుడ్ పైనే తన కోపం అంతా చూపించుకుంది. బాలీవుడ్ స్టార్స్ పై మండి పడింది కంగనా రనౌత్. ఇంతకీ ఏవిషయంలో...?

బాలీవుడ్ స్టార్స్ తనను టార్గెట్ చేస్తున్నారంటోంది కంగనా రనౌత్. తనంటే బాలీవుడ్ లో ఎవరికీ ఇష్టం లేదు అంటోంది. అందుకే తనను టార్గెట్ చేస్తున్నారంటోంది. బాలీవుడ్ తనను వేరుగా చూస్తోందంటోంది కంగనా.
కంగన తాజా సినిమా ధాకడ్. ఈసినిమా ఈ నెల 20న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో స్టార్ హీరోలకు తగ్గకుండా అద్బుతమైన పాత్రలో కంగనా నటించింది. అంతే కాదు కంగనా భారీ యాక్షన్ సీన్లలో కూడా కంగనా అవలీలగా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ మరోసారి బాలీవుడ్ పై విరుచుకు పడింది. బాలీవుడ్ స్టార్స్ పై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం బీటౌన్ లో చర్చనీయాంశంగా మారాయి.
బాలీవుడ్ స్టార్ హీరోలపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మండిపడింది. బాలీవుడ్ స్టార్లు ఎవరూ తనతో నటించేందుకు ఇష్టపడరని... ఎందుకంటే తానంటే వారికి భయమని చెప్పింది. తనతో పని చేసిన వారిని కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు టార్గెట్ చేస్తారని తెలిపింది. అయినప్పటికీ తనతో కలిసి అర్జున్ రాంపాల్ నటించాడంటే నిజంగా గ్రేట్ అని కితాబునిచ్చింది.
తన ఇంటికి వచ్చే అర్హత ఏ బాలీవుడ్ స్టార్ కు గానీ, ఏ బీటౌన్ సెలబ్రిటీకి కానీ లేదని కంగన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనను వీరెవరైనా బయట కలిస్తే పర్వాలేదని... తాను మాత్రం వీరెవరినీ తన ఇంటికి ఆహ్వానించనని చెప్పింది.
చాలా కాలంగా బాలీవుడ్ లో కంగనా ప్రకంపనలు పుట్టిస్తూనే ఉన్నారు. కాంట్రవర్షియల్ కామెంట్స్ తో ఎప్పటికప్పుడు హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా స్టార్ వారసుల ఆధిపత్యంపై కంనగా ఎప్పటికప్పుడు పోరాడుతున్నారు. కొత్తవారికి ఇండస్ట్రీలో అవకాశాలులేకుండా చేస్తున్నారని ఆమె మండిపడుతూనే ఉంది.