Brahmamudi: అన్నపూర్ణ గురించి కంగారు పడుతున్న కృష్ణమూర్తి దంపతులు.. చిక్కుల్లో పడ్డ శృతి!
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ కి గట్టి పోటీని ఇస్తుంది. కన్నవారికి ఎలాగైనా సహాయ పడాలని తపన పడుతున్న ఒక ఆడపిల్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 17 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
ఎపిసోడ్ ప్రారంభంలో డిజైన్స్ గీసేసిన తర్వాత వాటిని క్లోజ్ చేస్తూ అమ్మ వాళ్ళని ఆదుకునే అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని చేజార్టీనీయొద్దు అని భగవంతుడిని ప్రార్థించి మెల్లగా తన గదిలోకి వెళ్తుంది కావ్య. రాజు పడుకోవడం చూసి రిలాక్స్ అవుతుంది. డిజైన్స్ కబోర్డ్ లో దాచేసి పడుకుంటుంది. మరుసటి రోజు పొద్దున్న సుభాష్ ప్రకాష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కావ్య కాఫీ తీసుకొని వస్తుంది.
రాజ్ దగ్గర అలంకార్ గ్రూప్స్ కి సంబంధించిన ఫైల్ ఒకటి ఉంటుంది అది తెచ్చి పెట్టమని అడుగుతాడు సుభాష్. అలాగే అని తన గదికి వెళ్తుంది కావ్య. బాత్రూంలో ఉన్న భర్తని ఫైల్ గురించి అడుగుతుంది. కబోర్డ్ లో ఉందని చెప్తాడు రాజ్. సరే అని వెళ్ళిపోతున్న కావ్యని టవల్ ఇచ్చి వెళ్ళిపో అని చెప్తాడు. అలాగే అంటూ టవల్ ఇస్తుంది కావ్య. డబల్ తీసుకున్న రాజ్ డోర్ క్లోజ్ చేసేటప్పుడు కావ్య పైట డోర్ లో లాక్ అయిపోతుంది.
డోర్ ఓపెన్ చేయండి మావయ్య గారు ఫైల్ తీసుకురమ్మన్నారు తీసుకెళ్లకపోతే బాగోదు అంటుంది. టిట్ ఫర్ టాట్ ఆరోజు నన్ను ఎంత ఏడిపించావు చచ్చినట్లు ఇక్కడే ఉండు నేను ఒక గంట సేపు స్నానం చేస్తాను అంటాడు రాజ్. కావ్య ఎంతసేపటికి రాకపోవడంతో ప్రకాష్ వచ్చి ఫైల్ గురించి అడుగుతాడు. డోర్ దగ్గర నుంచి కావ్య కదలకపోవటంతో ఫైల్ ఎక్కడ ఉందో చెప్పు నేనే తీసుకుంటాను అయినా నువ్వేంటి ఇలా మర్యాద లేకుండా నిల్చున్నావు అంటాడు ప్రకాష్.
ఫైల్ కబోర్డ్ లో ఉంది అని ఇబ్బందిగా చెప్తుంది కావ్య. ఫైల్ తీసుకొని ప్రకాష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మావయ్య గారు నన్ను అపార్థం చేసుకున్నారు అని భర్తకు చెప్పింది కావ్య. ఏం పర్లేదు కిందకి వెళ్ళేసరికి మర్చిపోతాడు అని చాలాసేపటి తర్వాత డోర్ తీస్తాడు రాజ్. మరోవైపు దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటుంది అన్నపూర్ణ. హాస్పిటల్ కి వెళ్దాం పద అంటుంది కనకం. ఇప్పుడు నా కోసం డబ్బులు ఖర్చు పెట్టొద్దు అంటుంది అన్నపూర్ణ. అలా చెప్పే జబ్బుని ఇంతవరకు మాతో చెప్పకుండా దాచేసావు అని మందలిస్తుంది కనకం.
ఇంతలో కృష్ణమూర్తి కూడా వస్తాడు. అన్నపూర్ణ కి ముక్కు నుంచి రక్తం పడుతుండటంతో మరింత కంగారుపడి ఆమెని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు అప్పు, కృష్ణమూర్తి దంపతులు. మరోవైపు కావ్య శృతికి ఫోన్ చేసి మీ బాస్ కి డిజైన్స్ నచ్చాయా అని అడుగుతుంది. ఇంకా సార్ రాలేదు అని మాట్లాడుతూ ఉండగానే రాజ్ వచ్చి డిజైన్స్ రెడీ ఆ అని శృతిని అడుగుతాడు. ఫోన్ ఆన్ లోనే ఉంచి డిజైన్స్ చూపిస్తుంది శృతి డిజైన్స్ ని మెచ్చుకుంటాడు రాజ్. డిజైన్స్ నేను గీయలేదు నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ గీసింది అంటుంది.
తనని ఆఫీస్ కి రమ్మను అంటాడు రాజ్. తనకి ఆఫీసుకు రావడం కుదరదు వాళ్ళ ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఫ్రీ లాన్సర్ గా పనిచేస్తుంది డిజైన్ కింతనే తీసుకుంటుంది శృతి. ఇంత మంచి డిజైనర్ని గుర్తించకుండా ఇంట్లో వంటింటి కుందేలుని చేసేసాడా ఆమె భర్త సరేలే అకౌంటెంట్ తో చెప్తాను మనీ సెటిల్ చేసేసెయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు రాజ్. అప్పుడు శృతి కావ్య తో మాట్లాడుతూ విన్నారు కదా మేడం అకౌంటెంట్ రాగానే మీ మని సెటిల్ చేయిస్తాను అంటుంది శృతి.
ఈ డబ్బులు వస్తే అమ్మ వాళ్ళకి కాస్త హెల్ప్ అవుతుంది అనుకుంటుంది కావ్య. మరోవైపు హాస్పిటల్ లో అన్నపూర్ణ ని చెక్ చేసి కొన్ని టెస్ట్ లు రాస్తాడు డాక్టర్. ఎంత ఖర్చవుతుంది అని అడుగుతాడు కృష్ణమూర్తి 10,000 అవుతుంది అంటాడు డాక్టర్. వాళ్లని ఇబ్బంది పెట్టకండి ఏవో ఒక మందులు రాసేయండి అంటుంది అన్నపూర్ణ. నీ కన్నా మా సమస్యలు ఏమి ఎక్కువ కాదు నువ్వేమీ మాట్లాడకు అని తోటికోడల్ని మందలిస్తుంది కనకం.
డాక్టర్ దగ్గర నుంచి బయటికి వచ్చిన తరువాత కావ్య కి చెప్తాము అంటుంది కనకం. చెప్పి తనని ఇబ్బంది పెట్టొద్దు అని అన్నపూర్ణ కృష్ణమూర్తి ఇద్దరు చెప్పటంతో ఊరుకుంటుంది కనకం. మీరు వెళ్ళండి నేను చిన్న పని ఉంది చూసుకొని వస్తాను అని చెప్పి తల్లిదండ్రులని పెద్దమని పంపించేసి తన పని మీద తను వెళ్ళిపోతుంది అప్పు. మరోవైపు తన డైటింగ్ కోసం ఏమేమి కావాలో లిస్ట్ భర్తకి ఇస్తుంది స్వప్న. నువ్వు కడుపుతో ఉన్నావు ఇబ్బంది అవుతుంది అంటాడు రాహుల్.
అవన్నీ నేను చూసుకుంటాను ముందు నువ్వు తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది స్వప్న. నువ్వు మరీ ఇంత అమాయకురాలు అనుకోలేదు. తొందర్లోనే ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను బయటికి గెంటేస్తారు అని ఆనందపడతాడు రాహుల్. తరువాయి భాగంలో కబోర్డ్ లో ఉన్న కావ్య డిజైన్స్ చూస్తాడు రాజ్. శృతి కి ఫోన్ చేసి ఫ్రీ లాన్సర్ గా పనిచేస్తున్న డిజైనర్ పేరేంటి అని అడుగుతాడు. పేరు చెప్పలేక ఇబ్బంది పడుతుంది శృతి.