- Home
- Entertainment
- Brahmamudi: అప్పు ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న కనకం.. కావ్య చేసిన పనికి రాజ్ అంగీకరిస్తాడా?
Brahmamudi: అప్పు ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న కనకం.. కావ్య చేసిన పనికి రాజ్ అంగీకరిస్తాడా?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కథ కథనాలతో టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. భర్తని టెన్షన్స్ నుంచి బయట పడేయాలని తపన పడుతున్న ఒక భార్య కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 3 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో రాత్రి ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు రాజ్. ఎప్పుడూ నానోటి నుంచే ఏం జరిగిందో తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటారు నువ్వు చెప్పలేను నాకు సిగ్గు అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది కావ్య. నిజంగానే ఏదో జరిగిపోయింది అనుకొని నా జీవితంలో నేనే నిప్పులు పోసుకున్నానా అని తెగ ఫీల్ అయిపోతాడు రాజ్.
తర్వాత కిందికి వచ్చిన కావ్య అందరూ రెడీ అయి కూర్చోవడం చూసి ఎక్కడికి తాతయ్య ప్రయాణం అని అడుగుతుంది. మీ పెళ్లయినప్పుడు శ్రీశైలం వస్తానని మొక్కుకున్నాము ఇప్పటివరకు కుదరలేదు అందుకే ప్రయాణం పెట్టుకున్నాము మీకోసమే ఎదురు చూస్తున్నాము అంటారు చిట్టి దంపతులు. ఇప్పటికిప్పుడు అంటే ఎలా నాకు ఆఫీసులో చాలా పని ఉంది అంటాడు రాజ్. కనీసం నువైనా రా అని కావ్య ని పిలుస్తుంది చిట్టి.
ఆయన రాకుండా నేను మాత్రం ఎలా వస్తాను ఆయనకి భోజనానికి ఇబ్బంది అవుతుంది కదా అంటుంది కావ్య. నాకోసం ఎవరు త్యాగం చేయక్కర్లేదు మీ మనవరాలు మీరు తీసుకు వెళ్ళండి అంటాడు రాజ్. మీ సంగతి నాకు బాగా తెలుసు అందరిముందు కసురుకుంటావు కానీ ఎవరూ లేనప్పుడు మాత్రం అని నవ్వుతూ ధాన్యలక్ష్మి ఏదో అనుబోతువుంటే పిన్ని వద్దులే ఇంకాపేయ్ తను ఇక్కడే ఉంటుంది అంటాడు రాజ్.
కావ్యని బాగా చూసుకోమని రాజ్ కి జాగ్రత్తలు చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతారు అందరూ. మరోవైపు దిగులుగా కూర్చున్న అప్పు దగ్గరకు వచ్చి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు తన ఫ్రెండ్స్. అమ్మ చేసిన పనికి వీళ్ళు పోయేలాగా ఉంది నాన్న సంపాదన సరిపోవటం లేదు నేను ఏమైనా చేయాలి అంటుంది అప్పు. ఇప్పుడున్న క్యాటరింగ్ తో పాటు ఈవెంట్స్ కూడా చేద్దాము అంటాడు ఒక ఫ్రెండ్. దాని గురించి మాట్లాడుకుంటూ ఉండగానే కావ్య వాళ్ళ టాపిక్ వస్తుంది.
అప్పు గురించి వాళ్ళ అక్కల గురించి తప్పుగా మాట్లాడుతాడు ఒక ఫ్రెండ్. అప్పు ఆపమని చెప్పినా వినిపించుకోడు. కోపంలో రెచ్చిపోయిన అప్పు ఆ ఫ్రెండ్ తల పగలగొడుతుంది. నువ్వు తల పగలగొట్టేసింది అంటూ గోల పెడతాడు ఆ ఫ్రెండ్ ఇక్కడే ఉంటే వీళ్ళు మరింత ఓవరాక్షన్ చేస్తారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అప్పు. ఇక్కడ మేము చూసుకుంటాము అని చెప్పి అప్పుని అక్కడ నుంచి పంపించేస్తారు.
మరోవైపు నగలు డిజైన్ చేయటం కంప్లీట్ అవ్వలేదని తెలిసి స్టాఫ్ మీద కేకలు వేస్తాడు రాజ్. ఏం జరిగింది కానీ అడుగుతుంది కావ్య. నువ్వేమైనా అరుస్తావా తీరుస్తావా అంటూ జరిగింది చెప్తాడు రాజ్. నేను వెళ్తే ఏమైనా హెల్ప్ అవుతుందేమో అనుకొని భర్తని తనతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్లమని అడుగుతుంది కావ్య. అందుకు ఒప్పుకోడు రాజ్. రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలి లేదా అని బ్లాక్ మెయిల్ చేస్తుంది కావ్య. చెప్పు అంటాడు రాజ్.
నన్ను ఆఫీసుకు తీసుకువెళ్తేనే చెప్తాను అంటుంది కావ్య. సరే అయితే ఈ చీర కాదు మంచి చీర కట్టుకొని రమ్మనడంతో మంచి చీర కట్టుకొని రాజ్ తో పాటు బయలుదేరుతుంది కావ్య. కారులో వెళ్తూ ఒక చిన్న యాక్సిడెంట్ నా జీవితాన్ని మార్చేసింది అంటాడు రాజ్. నేను కూడా అలాగే ఫీల్ అవ్వాలి కానీ ఎందుకు అలా అనుకోలేకపోతున్నాను ఎందుకంటే మీరు నాకు నచ్చారు అంటుంది కావ్య.
ఒక్కసారి గా షాక్ అవుతాడు రాజ్. నిజంగానే నచ్చారు నేను రూపాన్ని చూడను మనసుని చూస్తాను. మీరు కుటుంబానికి ఇచ్చే విలువ నా తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం రాహుల్ ని క్షమించే గుణం ఇవన్నీ నాకు బాగా నచ్చాయి అంటుంది కావ్య. అయితే నా మాటకి విలువ ఉందన్నమాట అయితే రాత్రి ఏం జరిగిందో చెప్పు అంటాడు రాజ్. కారు ఒక బక్కగా ఆపమని ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి రాత్రి ఏం జరిగిందో చెప్పమంటున్నారు అని వేళాకోళం ఆడుతుంది కావ్య.
రాత్రి ఏం జరిగిందో అతనికి ఏం తెలుస్తుంది అంటూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజ్. నవ్వుకుంటుంది కావ్య. నవ్వకు నాకు చికాకుగా ఉంది అంటాడు రాజ్. మరోవైపు నేను అక్కడే ఉండి వాడిని హాస్పిటల్కి తీసుకువెళ్లి ఉండవలసింది అనవసరంగా బంతిగాడు నన్ను ఇక్కడ తీసుకువచ్చేసాడు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అంటూ టెన్షన్ పడుతుంది అప్పు. తనకోసం మజ్జిగ తీసుకొచ్చిన తల్లి మీద కేకలు వేస్తుంది.
కూతురి ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది కనకం. ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పు నిజం చెప్పకుండా మాట దాటవేస్తుంది. తరువాయి భాగంలో నగలు డిజైనింగ్ కంప్లీట్ కాకపోవటంతో టెన్షన్ పడుతూ ఉంటాడు రాజ్. కావ్య కొన్ని డిజైన్స్ వేసి తీసుకొని వచ్చి భర్తకి చూపిస్తుంది.