Brahmamudi: పోలీస్ స్టేషన్లో కనకం దంపతులు.. ప్రాణాపాయ స్థితిలో రాజ్?
Brahmamudi: స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ మంచి కంటెంట్తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తన అక్కల గురించి తప్పుగా మాట్లాడినందుకు ఫ్రెండ్ తల పగలగొట్టిన ఒక చెల్లెలి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో అప్పు చిరాకు పడుతుంటే దీనికి ఏమైంది అని మనసులో అనుకుంటుంది కనకం. తననే చూస్తున్న తల్లిని బయటికి పొమ్మని కసురుకుంటుంది అప్పు. రాకేష్ గాడికి ఏమైందో ఏమిటో అంటూ టెన్షన్ పడుతుంది. మరోవైపు ఆఫీస్ కి వచ్చిన రాజ్ క్లైంట్స్ వచ్చేసారు అని తెలుసుకొని టెన్షన్ పడతాడు.
డిజైనర్ శృతిని పిలిచి డిజైన్స్ చూపించమంటాడు. ఆ డిజైన్స్ అన్నీ లేటెస్ట్ గా ఉండటంతో వాళ్లకి కావలసింది ట్రెడిషనల్ డిజైన్స్ అందుకే మన దగ్గరకు వచ్చారు లేకపోతే ఏ ముంబైకో వెళ్ళిపోయేవారు అని శృతి మీద కేకలు వేస్తాడు రాజ్. కొంచెం టైం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుంది శృతి. కావ్యతో నువ్వు నా రూమ్ లో కూర్చో అటు ఇటు తిరగవద్దు అని చెప్పి క్లైంట్స్ ని మేనేజ్ చేయడం కోసం వాళ్ల దగ్గరికి వెళ్తాడు రాజ్.
డిజైన్స్ రెడీ నా అని అడుగుతారు వాళ్ళు. డిజైనర్ ట్రాఫిక్ లో ఉండిపోయింది వచ్చేస్తుంది అని చెప్తాడు రాజ్. అయితే ఈ లోపు దగ్గరలో ఉన్న పాత దేవాలయాలు అన్ని చూస్తాము. రెండు గంటల్లో వచ్చేస్తాము అప్పటికి రెడీ చేసి ఉంచండి అని చెప్పి వెళ్ళిపోతారు క్లైంట్స్. సరే అని చెప్పి తన రూమ్ కి వచ్చి కూర్చుంటాడు రాజ్. మీరు ఆఫీసులో ఇంత టెన్షన్ పడుతున్నారని తెలియదు ఇకపై ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక మిమ్మల్ని టెన్షన్ పెట్టను అంటుంది కావ్య.
మరోవైపు అప్పు ఇంటికి పోలీసులు వస్తారు. సేటు కేసు పెట్టాడేమో అనుకొని కనకాన్ని తిడతాడు కృష్ణమూర్తి. కానీ ఎస్ఐ వచ్చి అప్పు ఉందా తను ఒకడి తల పగలగొట్టింది. వాళ్లు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తాడు. కంగారు పడిపోతారు కృష్ణమూర్తి దంపతులు తనని అరెస్టు చేయకండి తన భవిష్యత్తు పాడైపోతుంది అని బ్రతిమాలు కొంటారు కానీ ఎస్సై వాళ్లు పెట్టింది అటెంప్ట్ టు మర్డర్ కేసు చెప్పటంతో షాక్ అవుతారు కృష్ణమూర్తి దంపతులు.
అప్పుని పిలిచి జరిగింది తెలుసుకుంటారు. అక్కల్ని తప్పుగా మాట్లాడాడు అందుకే కోపం ఆపుకోలేకపోయాను అంటుంది అప్పు. చాల్లే చేసిన ఘనకార్యం అమ్మ బాబుల్ని ఏడిపించడానికి పుడతారు మీలాంటి వాళ్ళు అని ఎస్ఐ మందలించి అప్పుని అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోతారు. ఆమెని విడిపించడం కోసం కనకం దంపతులు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు.
మరోవైపు శృతి దగ్గరికి వస్తుంది కావ్య. ఈ టెన్షన్లో అసలు డిజైన్స్ థాట్ రావడం లేదు అంటుంది శృతి. కావ్య డిజైన్స్ తీసి శ్రుతికిచ్చి నువ్వు వెళ్లి ఇది మీ సార్ కి ఇవ్వు అని చెప్తుంది. వద్దు మేడం నాది కానీ క్రెడిట్ నాకు వద్దు సార్ నన్ను మెచ్చుకుంటే గిల్టీగా ఉంది మీరు ఇవ్వండి అని చెప్పటంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజ్ దగ్గరికి వెళ్లి డిజైన్స్ చూపిస్తుంది. డిజైన్స్ చూడకుండానే ఇవేమైనా ఇంటి ముందు పెట్టుకునే ముగ్గులా..
నేను అసలే టెన్షన్ లో ఉన్నాను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి డిజైన్స్ అన్ని చించేస్తాడు రాజ్. బాధపడుతూ బయటికి వచ్చేస్తుంది కావ్య. ఏంటి మేడం చూడకుండానే చించేసారు ఇప్పుడు డిజైన్స్ తెమ్మంటే ఏం చేయాలి అని కంగారు పడుతుంది శృతి. ఏమి పర్వాలేదు నీ లాప్టాప్ లో స్కాన్ చేసి పెట్టాను తీసుకెళ్లి చూపించు అనటంతో సంతోషిస్తుంది శృతి. మరోవైపు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన కనకం దంపతులు అప్పుని రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తారు.
కావాలంటే నన్ను లాకప్ లో పెట్టండి అని ఏడుస్తుంది కనకం. గొడవ పెట్టకండి ఎస్సై గారు వచ్చిన తర్వాత మాట్లాడండి ముందు బయటకు వెళ్ళండి అని కసరుకుంటాడు కానిస్టేబుల్. పప్పు కూడా నేను తప్పు చేశాను శిక్ష అనుభవించాలి నా కోసం మీరు ఏడవకండి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటుంది. అలా ఎలా వెళ్ళిపోతావ్ నువ్వు జైలుకు వెళ్ళావంటే నీ భవిష్యత్తు ఏమవుతుంది నీకు బిడ్డ పుడితే అప్పుడు తల్లి బాధ తెలుస్తుంది అని ఏడుస్తుంది కనకం.
ఆమెకి ధైర్యం చెప్పి ఒప్పించి బయటికి పంపిస్తుంది అప్పు. మరోవైపు శృతి డిజైన్స్ తీసుకొచ్చి రాజ్ కి చూపిస్తుంది. అవి చూసి ఇంప్రెస్ అవుతాడు రాజ్. తీసుకువెళ్లి క్లైంట్స్ కి చూపించడంతో వాళ్లు కూడా ప్రాజెక్టుని ఓకే చేస్తారు. ఈ క్రెడిట్ నాది కాదు మా డిజైనర్ ది అని శృతి అని పిలిచి ఆ క్లైంట్స్ కి పరిచయం చేస్తాడు. వాళ్ళందరూ శృతిని అప్రిషియేట్ చేస్తారు. తరువాయి భాగంలో నిద్దట్లో రాజ్ కి ఊపిరి అందక సతమతమవుతూ చేత్తో కావ్య ని పిలుస్తూ ఉంటాడు. కానీ నిద్రలో ఉన్న కావ్య అది గమనించదు.