- Home
- Entertainment
- Vikram Twitter Review:కమల్ కన్నా విజయ్ సేతుపతి బాగున్నాడు, విక్రమ్ మూవీ ట్విట్టర్ రివ్యూ
Vikram Twitter Review:కమల్ కన్నా విజయ్ సేతుపతి బాగున్నాడు, విక్రమ్ మూవీ ట్విట్టర్ రివ్యూ
కమల్ హాసన్ నటించిన విక్రమ్ ఈరోజు( జూన్ 3) భారీ రిలీజ్ కు రెడీ అయ్యింది. అంతకు ముందే... అభిమానుల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈమూవీ ప్రీమియర్ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయడం.. కమల్ డిఫరెంట్ గా కనిపించడంతో ఈసినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. మరి ఈమూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఎలాంటి రివ్యూ ఇచ్చారో చూద్దాం.

ఐదు దశాబ్దాల కమల్ హాసన్ కెరీర్‌లో తొలిసారిగా 200 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా విక్రమ్. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి కొన్నారు. విక్రమ్ సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు. కమల్ హాసన్ రాసి పాడిన పాతాళ పాతాలా పాట సూపర్ హిట్. మరి సినిమా పరిస్థితి ఏంటి.
Vikram
ఇక ఈమూవీ స్టార్ట్ అయన అప్పటి నుంచీ .. ఫ్యాన్స్ కమల్ కోసం ఈగర్ గా వెయిట్ చేశారు. ముఖ్యంగా, సినిమా కథ ఇద్దరు తోబుట్టువులు- ఒక గ్యాంగ్‌స్టర్ మరియు రాజకీయ నాయకుడు- ప్రభుత్వ అధికారిని కిడ్నాప్ చేయడం. ఒక రిటైర్డ్ పోలీసు అధికారి, విక్రమ్ వారిని కాపాడం ఇలా సాగుతుంది.
ఇక ఈమూవీ గురించి ట్వీట్టర్ లో ఆడియన్స్ రివ్యూస్ ఇస్తున్నారు. విక్రమ్ సినిమా కాస్త స్లోగా నడిచినా.. ఇప్పటి గంటవరకూ సినిమా మాత్రం బాగుంది అంటున్నారు. అంతే కాదు విజయ్ సేతుపతికి ఇప్పటి వరకూ ఏ సినిమాలో లేని విధంగా ఎంట్రీ ప్లాన్ చేసినట్టు తెులస్తోంది.
కమల్ హాసన్ కంటే గొప్పగా విజయ్ సేతుపతి ఎంట్రీ జరిగింది... అని తమ పర్సనల్ ఒపీనియన్ ను ట్విట్టర్ లో శేర్ చేశారు ఆడియన్స్. ఇక కమల్ హసన్ గురించి ప్రత్యేకంగ చెప్పేది ఏముంది.. ఆయన క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంది అంటున్నారు ట్విట్టర్ జనాలు.
ఇక ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ జస్ట్ వావ్… అంటూ కామెంట్స్ పెడుతున్నారు ట్విట్టర్ ఆడియన్స్.. మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు ఫస్ట్ హాఫ్ మూవీకి పాజిటీవ్ రివ్యూస్ వస్తున్నాయి.
ఇక లోకేష్ కనగరాజ్ చించేసాడంటున్నారు ట్విట్టర్ జనాలు, కమల్ హాసన్ ను ఇంత అద్భుతంగా చూపిస్తాడని అనుకోలేదు అంటున్నారు. ఇక అనిరుధ్థ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు మెస్మరైజ్ అయ్యాం అంటున్నారు.
Image: PR Agency
ఇక ఈసినిమాకు నెగెటీవ్ కామెంట్స్ ఇప్పటి వరకూ చాలా తక్కువగా వస్తున్నాయి. అందులో సినిమా కాస్త స్లోగా ఉదంటూ కోందరు కామెంట్ చేస్తుంటే.. స్క్రీన్ ప్లే చాలా స్లోగా ఉందని మరికొందరు అంటున్నారు.
అంతే కాదు సినిమా అంతా టూ మచ్ వైలెన్స్ ఉందంటూ.. ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. లోకేష్ ఈసారి కూడా కథ కన్నా.. హీరో ఎలివేషన్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడంటూ.. కొందరు ట్వీట్ చేస్తున్నారు.
Image: PR Agency
ఇక మరికొందరు ట్విట్టర్ ఆడియన్స్ ఇది కేవలం యావరేజ్ సినిమా మాత్రమే.. అద్భుతం అని రివ్యూస్ ఇచ్చేవారిని నమ్మకండీ అంటూ ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికి విక్రమ్ సినిమా.. కమల్ ఫ్యాన్స్ కు పండగ అయితే.. కామన్ ఆడియన్స్ కు యావరేజ్ అనిపించుకుంటుంది.