కమల్ హాసన్ సంచలన నిర్ణయం, ఇకపై వారి సినిమాలు చేయనంటూ ప్రకటన
కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన సినిమాలను తానే నిర్మించుకుంటారట. ఇతర సంస్థలకు పనిచేయను అని తేల్చేశారు కమల్. కారణం ఏంటో తెలుసా?

60 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న కమల్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 60 ఏళ్లకు పైగా నటుడుగా కొనసాగుతున్న ఏకైక హీరో కమల్ హాసన్. కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఈ స్టార్ హీరో.. ఈమధ్య వరుసగా ప్లాప్ సినిమాలు చేస్తున్నాడు. విక్రమ్ తరువాత కమల్ కెరీర్ ఫామ్ లోకి వచ్చింది అనుకుంటే.. రీసెంట్ గా రెండు సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో మళ్లీ కమల్ ఇబ్బందుల్లో పడ్డారు. రీసెంట్ గా రిలీజ్ అయిన 'ఇండియన్ 2', 'థగ్ లైఫ్' చిత్రాలు పరాజయం పాలయ్యాయి. వరుస డిజాస్టర్లు ఎదురవ్వడంతో సినిమాలపై కమల్ హాసన్ ఆలోచనలో పడ్డారు.
కమల్ హాసన్ చేయాల్సిన సినిమాలు
ప్రస్తుతం రాజకీయాల మీద ఎక్కువ దృష్టి పెట్టాడు కమల్ హాసన్. అంతే కాదు ఆయన గతంలో కమిట్ అయిన కొన్ని సినిమాలు చేస్తున్నారు. 'అన్బరివు' దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ లో ఉండగా.., ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయాల్సి ఉంది. ఇక 'ఇండియన్ 3', 'కల్కి 2', 'విక్రమ్ 2' వంటి సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాల షూటింగ్స్ పై అఫీషియల్ గా ఎటువంటి అప్ డేట్ లేదు.
రెమ్యునరేషన్ లేకుండానే సినిమా చేస్తున్న కమల్
అయితే రీసెంట్ గానే 'ఇండియన్ 3 మూవీని కమల్ హాసన్ స్టార్ట్ చేయబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. నెక్ట్స్ ఈ హీరో నుంచి రిలీజ్ అయ్యే సినిమా ఇదే అయ్యే అవకాశం ఉంది. ఇండియన్ 2 డిజాస్టర్ అయిన తరువాత పార్ట్ మూవీని పక్కన పెట్టారు మూవీ టీమ్. అయితే అప్పటికే ఇండియన్ 3 సినిమాకు సబంధించి 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది కాబట్టి.. ఆ పదిశాతం షూటింగ్ చేసుకుంటే సినిమా రిలీజ్ చేయవచ్చు అన్న ఆలోచనతో ఈసినిమాను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.
రెమ్యునరేషన్ విషయంలో కాస్త మనస్పర్ధలు వచ్చినా.. రజినీకాంత్ మధ్యవర్తిగా జరిగిన చర్చలు విజయవంతం అవ్వడంతో షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు కమల్ హాసన్, శంకర్ లు ఇద్దరు రెమ్యునరేషన్ తీసకోకుండానే ఇండియన్ 3 సినిమా కోసం పనిచేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.
కమల్ హాసన్ సంచలన నిర్ణయం
ఇక కమల్ హాసన్ నటించిన చివరి సినిమాలను ఆయన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించింది. వీటిలో 'ఇండియన్ 2' చిత్రాన్ని మాత్రం లైకా నిర్మించింది. ఈసినిమా టైమ్ లో ఎన్నో వివాదాలు రావడం, కమల్ కు నిర్మాతలకు మధ్య విభేదాల వల్ల చాలా సమస్యలు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇకపై బయటి నిర్మాణ సంస్థల చిత్రాల్లో నటించకూడదని కమల్ నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న 'ఇండియన్ 3', 'కల్కి 2' సినిమాలు చివరి సినిమాలని తెలుస్తోంది. ఇకపై కమల్ సినిమా చేయాలంటే ఆయన సొంత నిర్మాత సంస్థకే చేస్తారట.
కమల్ హాసన్ నిర్ణయం వెనుక రహస్యం
కమల్ హాసన్ ఈ నిర్ణయం వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన నిర్మాణంలో వచ్చిన 'థగ్ లైఫ్' సినిమా మాత్రమే డిజాస్టర్ అయ్యింది. దానికి ముందు 'విక్రమ్', 'అమరన్' సినిమాల ద్వారా కమల్ కోట్లలో లాభాలు ఆర్జించారు. తదుపరి సినిమాల దర్శకులంతా మంచి విజయాలు సాధించినవారే.కమల్ నెక్ట్స్ చేయబోయే విక్రమ్ 2, సీత్తా సినిమాలు సక్సెస్ అవుతాయన్న నమ్మకంతో కమల్ ఉన్నారు. దాంతో కమల్ కు ముందు ముందు మంచి లాభాలు ఉండటంతో, నిర్మాతగా ఉంటూనే తన సినిమాలను తానే చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

