MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాలకు కమల్‌ హాసన్‌ బ్రేక్‌.. మూడు సినిమాలు పూర్తి.. లైన్‌లో మరో మూడు.. ఇది మామూలు దూకుడు కాదు..

సినిమాలకు కమల్‌ హాసన్‌ బ్రేక్‌.. మూడు సినిమాలు పూర్తి.. లైన్‌లో మరో మూడు.. ఇది మామూలు దూకుడు కాదు..

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తన సినిమాలకు బ్రేక్‌ ప్రకటించాడు. రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు. దీంతో ఆయన సినిమాలకు దూరంగా ఉండబోతున్నారు.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 27 2024, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ జెట్‌ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నారు. `విక్రమ్‌` మూవీ ఇచ్చిన ఎనర్జీతో ఆయన దూసుకుపోతున్నారు. ఇప్పటికే మూడు సినిమాల షూటింగ్‌ లు పూర్తి చేశారు, మరో మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు.ఈ క్రమంలో ఆ షాక్‌ ఇచ్చాడు కమల్‌. సినిమాలకు బ్రేక్‌ ప్రకటించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కమల్‌ హాసన్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మక్కల్‌ నీధి మియామ్‌ పేరుతో ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించారు. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో మళ్లీ ఆయన సినిమాలపై ఫోకస్‌ పెట్టారు. ఇప్పుడు లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. లోక్‌ సభ ఎంపీ బరిలో నిలబడ్డారు. దీనికోసం ఆయన సినిమాలకు బ్రేక్‌ ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సినిమాలకు దూరంగా ఉండబోతున్నారు. 

36

ఈ క్రమంలో అన్ని సినిమాలకు కమల్‌ బ్రేక్‌ ప్రకటించడం విశేషం. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాక మళ్ళీ తన పెండింగ్‌ సినిమాలను పూర్తి చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కమల్‌ హాసన్‌ మెయిన్‌గా `ఇండియన్‌ 2`లో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న మూవీ ఇది. షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. దీంతోపాటు `ఇండియన్‌ 3` షూటింగ్‌ని కూడా పూర్తి చేశాడట లోకనాయకుడు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ చేయాల్సి ఉందట. ఈ మూవీస్‌ బ్యాక్ టూ బ్యాక్‌ రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది `ఇండియన్‌ 2`ని ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. 

46

మరోవైపు `ఇండియన్‌3`ని ఈ ఏడాది చివర్లోగానా, లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనూ గానీ రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు మరో సినిమా షూటింగ్‌ కూడా కంప్లీట్‌ అయ్యిందట. ఆయన ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌ కూడా పూర్తయ్యిందట. అయితే ఇందులో తనది గెస్ట్ రోలే అని చెప్పడం విశేషం. ఇందులో కమల్‌ది నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. `కల్కి` రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగంలో ఆయనది గెస్ట్ రోల్‌ అని, రెండో పార్ట్ లో మెయిన్‌గా కనిపిస్తారని తెలుస్తుంది. `  
 

56
Kamal Haasan

Kamal Haasan

దీంతోపాటు మణిరత్నంతో ఓ సినిమా చేస్తున్నారు కమల్‌. `థగ్స్ లైఫ్‌` పేరుతో ఈ మూవీ తెరకెక్కుతుంది. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చింది. గ్లింప్స్ విడుదల చేయగా, అది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సినిమాపై ప్రారంభంలోనే అంచనాలను పెంచింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ మూవీ షూటింగ్‌ ని ప్రారంభించనున్నట్టు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ కమల్‌ వెల్లడించారు. 

66

మరోవైపు హెచ్‌ వినోద్‌ దర్శకత్వంలో ఓ సినిమాని ప్రకటించారు కమల్‌ హాసన్‌. దీంతోపాటు ఫైట్‌ మాస్టర్స్ అన్బరివ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు కమల్‌ హాసన్‌. ఇలా మూడు సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసి మరో మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. దీంతోపాటు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో `విక్రమ్‌ 2` చేయాల్సి ఉంది. దీనికి టైమ్ పట్టే ఛాన్స్ ఉంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!
Recommended image2
Trivikram: నయనతార సినిమాని 10 నిమిషాలు చూసి ఆపేసిన త్రివిక్రమ్.. మాటల మాంత్రికుడు టచ్ చేయలేని జోనర్ ఇదే
Recommended image3
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved