కమల్ హాసన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? ఇప్పుడు ఇండియన్ 2 కి ఎంత తీసుకున్నారు..?
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో 60 ఏళ్ల సినిమా జీవితం పూర్తి చేసుకున్నవారు చాలా తక్కువమంది ఉన్నారు. అటువంటి అరుదైన నటులలో కమల్ హాసన్ ఒకరు. మొదటి సినిమాకు ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు.. ప్రస్తుతం ఎంత తీసుకుంటున్నారు...?
Kamal Haasan
కాలం మారుతున్న కొద్ది.. ఆ ట్రెండ్ కు తగ్గట్టు మారుతూ వస్తున్న వారు.. ఎక్కువ కాలం మనుగడ కొనసాగిస్తుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా అంతే. చాలామంది నటులు ఎక్కువకాలం యాక్టీవ్ గా ఉన్నది లేదు. కాని 60 ఏళ్లకు పైగా సినిమాల్లో యాక్టీవ్ గా ఉన్న నటులు అసలే లేరు. కాని ఒకే ఒక్క హీరో.. దాదాపుగా 64 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆయన మరెవరో కాదు లోకనాయకుడు కమల్ హాసన్.
బాలనటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. హీరోగా మారి.. తమిళ సినిమాతో పాటు.. సౌత్ సినిమాను శాసించారు. ఇండియాన్ సినిమా.. అది కూడా మన సౌత్ సినిమా నుంచి ఆస్కార్ బరిలో నిచిన మొదటి సినిమా కూడా కమల్ హాసన్ దే కావడం విశేషం. పాత్ర అది ఇది అని కాదు.. ఏ పాత్ర చేసి.. ఏ ప్రయోగం చేసినా.. దానికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేయడం మాత్రమే తెలసుక కమల్ కు. ఎన్నో పాత్రలకు ప్రాణంపోసిన ఆయన దశావతారుడిగా, లోకనాయకుడిగా.. యూనివర్సల్ హీరోగా.. వెలుగు వెలుగుతున్నారు.
ఇక ప్రస్తతం కమల్ హాసన్ రెమ్యూనరేషన్ హాట్ టాపక్ అవుతుంది. ఎప్పుడో బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. అప్పుడు ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారు.. ఆతరువాత హీరోగా..ఎంత తీసుకున్నారు.. ఇప్పుడు హీరోయిజానికి అతీతంగా.. ఆయన చేస్తున్న పాత్రకు ఎంతీసుకుంటున్నారు అనేది హాట్ టాపిక్. ఇంతకీ కమల్ హాసన్ మొదటి సినిమాకు ఎంత అందుకున్నారో తెలుసా..?
Kalathur Kannamma
గ్లోబల్ హీరో కమల్ హాసన్ 1960లో జావర్ సీతారామన్ రచించి.. భీంసింగ్ దర్శకత్వం వహించిన కలతుర్ కన్నమ్మ చిత్రంతో బాలనటుడిగా అరంగేట్రం చేశారు. ఈసినిమాలో మహానటిసావిత్రి కూడా నటించింది. సావిత్రి చుట్టు తిరుగుతూ.. చిన్న కుర్రాడిగా అద్భుతమైననటన ప్రదర్శించాడుకమల్. ఇక ఈసినిమాకుగాను ఆయనకు 500 రూపాయలు పారితోషికం ఇచ్చారట. 60 ఏళ్ళ క్రిందట 500 అంటే.. చాలా పెద్ద అమౌంటే మరి. ఇక ఆరతువాత హీరోగా కూడా 500 .. లేద వెయ్యి రెమ్యూనరేషన్ కే పనిచేశారట కమల్ .
20 ఏళ్లలో అతిపెద్ద నటుడిగా.. తమిళనాట స్టార్ గా ఎదిగాడు కమల్ హాసన్ 1980లో విడుదలైన గురు సినిమాతో దర్శకుడిగా కూడా పని చేయడం ప్రారంభించాడు. యాక్టింగ్, స్క్రీన్ రైటింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్, మ్యూజిక్, డ్యాన్స్, డిస్ట్రిబ్యూషన్, స్టంట్స్ ఇలా సినిమాల్లో ఆయన అడుగు పెట్టని ఫీల్డ్ లేదు. అంతే కాకుండా అనేక భారతీయ భాషల్లో నటించిన గొప్ప నటుడుగా రికార్డ్ సాధించాడు కమల్.
కమర్షియల్ చిత్రాలను పెద్దగా ఇష్టపడని కమల్ హాసన్.. నటించడం ప్రారంభించి 64 ఏళ్లయ్యింది. ఒక్కొమెంట్టూ ఎక్కుతూ వస్తోన్న లోకనాయకుడు ప్రస్తుతం ఆయన 234వ సినిమా చేస్తున్నాడు.
శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా ఇండియన్ 2. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈసినిమా కోసం కమల్ హాసన్ ఏకంగా 150 కోట్ల పారితోషికం తీసుకున్నారట. 500 రూపాయలతో మొదలెట్టి.. 150 కోట్లకు ఎదిగిన కమల్ హాసన్.. ప్రతీ సందర్భంలో తన కష్టాన్ని నమ్ముకున్నారు. ప్రేక్షకులను అలరించడానికి చాలా కష్టపడ్డాడు, రిస్క్ చేశారు, కొన్ని సార్లు ప్రాణాలకు తెగించి పనిచేశారు.