- Home
- Entertainment
- దటీజ్ కమల్ హాసన్.. కుమార్తె కొంగు పట్టుకుని సాయం, అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా.. వైరల్
దటీజ్ కమల్ హాసన్.. కుమార్తె కొంగు పట్టుకుని సాయం, అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా.. వైరల్
విక్రమ్ మూవీతో లోకనాయకుడు కమల్ హాసన్ మునుపటి ఫామ్ లోకి వచ్చేశారు. ఈ వయసులో కూడా విక్రమ్ చిత్రంతో కమల్ బాక్సాఫీస్ వద్ద గర్జించిన విధానం అదుర్స్.

విక్రమ్ మూవీతో లోకనాయకుడు కమల్ హాసన్ మునుపటి ఫామ్ లోకి వచ్చేశారు. ఈ వయసులో కూడా విక్రమ్ చిత్రంతో కమల్ బాక్సాఫీస్ వద్ద గర్జించిన విధానం అదుర్స్. కలెక్షన్స్ పరంగా విక్రమ్ మూవీ ఎన్నో రికార్డులు నెలకొల్పింది. ప్రస్తుతం కమల్ హాసన్.. శంకర్ దర్శకత్వంలో 'ఇండియన్ 2' చిత్రంలో నటిస్తున్నారు.
కమల్ హాసన్ ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు. నటనతో ఎల్లలు దాటే ఖ్యాతి సొంతం చేసుకున్న కమల్ తాజాగా చేసిన పనికి సోషల్ మీడియా ఫిదా అవుతోంది. తమిళ చిత్ర పరిశ్రమలోనే ప్రతిష్టాత్మకంగా పొన్నియన్ సెల్వం చిత్రం తెరెకెక్కుతోంది. లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఐశ్వర్య రాయ్, విక్రమ్, త్రిష, కార్తీ ఇలా పదుల సంఖ్యలో ఈ చిత్రంలో స్టార్స్ నటిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్ర ఆడియో వేడుక వైభవంగా జరిగింది. ఈ ఆడియో వేడుకకి కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథులుగా హాజరయ్యారు. కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ కూడా ఈ ఆడియో వేడుకలో మెరిసింది. అక్షర హాసన్ తెల్ల చీర ధరించింది క్యూట్ లుక్స్ తో అలరించింది.
ఈ వైట్ శారీలో అక్షర హాసన్ ఆడియో లాంచ్ కి హాజరయ్యే ముందు ఫోటో షూట్ చేసింది. తన కుమార్తె ఫోటో షూట్ కి స్వయంగా కమల్ హాసన్ సాయం చేశారు. ఫోటోలు అందంగా వచ్చేందుకు, మంచి ఫోజుల్లో కనిపించేందుకు కమల్.. అక్షర హాసన్ చీర కొంగు పట్టుకున్నారు. నేను అందంగా కనిపించేందుకు నాన్న సాయం చేశారు అంటూ అక్షర మురిసిపోతూ ఈ పిక్ ని పోస్ట్ చేసింది.
ఇది కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. కమల్ తలుచుకుంటే అక్షర కోసం అసిస్టెంట్స్ ని పెట్టొచ్చు. కానీ స్వయంగా అతడే సాయం చేశారు.సెలెబ్రిటీలు సైతం ఈ పిక్ కి ఫిదా అవుతున్నారు.
రెజీనా, యషిక ఆనంద్ లాంటి వారు వావ్ అంటూ ఈ పిక్ పై కామెంట్స్ చేశారు. కమల్ ఫాన్స్ అయితే.. దటీజ్ కమల్ హాసన్ అంటూ వైరల్ చేస్తున్నారు. కమల్ సింప్లిసిటీ కి ఇది నిదర్శనం అని అంటున్నారు.