- Home
- Entertainment
- Devil Censor:కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ సెన్సార్ రివ్యూ.. బింబిసార తర్వాత బ్లాక్ బస్టర్ లోడింగ్ ?
Devil Censor:కళ్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ సెన్సార్ రివ్యూ.. బింబిసార తర్వాత బ్లాక్ బస్టర్ లోడింగ్ ?
తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్. అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది క్యాప్షన్. అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. బింబిసార తర్వాత ఇది కళ్యాణ్ రామ్ తో ఆమెకి రెండో చిత్రం.
బింబిసార లాంటి రీసౌండింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ జోరు పెంచారు. కళ్యాణ్ రామ్ చిత్రాలపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి. ఆ క్రమంలో చివరగా విడుదలైన అమిగోస్ చిత్రం షాకిచ్చింది. అంచనాలు అందుకోలేక బోల్తా కొట్టింది. ఈసారి నందమూరి హీరో బాక్సాఫీస్ ని బలంగా కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కళ్యాణ్ రామ్ డైలాగులు, విజువల్స్, సంయుక్త మీనన్ పాత్ర, ప్రొడక్షన్ క్వాలిటీ, ఉత్కంఠ రేపుతున్న కథ ఇలా ప్రతి అంశంలో డెవిల్ చిత్రం ఆకర్షించింది. ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ రావడంతో నందమూరి ఫ్యాన్స్ ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 29న ఇయర్ ఎండ్ లో డెవిల్ అడుగుపెడుతున్నాడు.
Devil
తాజాగా డెవిల్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రానికి 2 గంటల 36 నిమిషాల నిడివి లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే డెవిల్ చిత్రానికి సెన్సార్ సభ్యుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం చాలా బావుందని అభినందించారట.
మూవీలో వచ్చే థ్రిల్లింగ్ ఎపిసోడ్స్, యాక్షన్, డ్రామా ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలు సర్ప్రైజింగ్ గా ఉంటాయని టాక్. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కి ఆ రేంజ్ విజయం అందించే చిత్రం డెవిల్ అని అంటున్నారు.
ఈ చిత్రం కోసం కళ్యాన్ రామ్ జోరుగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో జరిగియే ఫిక్షనల్ స్టోరీ కాబట్టి సహజంగానే కాస్త ఆసక్తి ఉంటుంది. ఎంగేజ్ చేసే విధంగా కథ కథనాలు ఉంటే సూపర్ హిట్ గ్యారెంటీ అని అంటున్నారు.