MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Kalyan Padala: చిరంజీవిపై నోరుజారిన కళ్యాణ్ పడాల.. లైవ్‌లోనే బిగ్ బాస్ విన్నర్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్

Kalyan Padala: చిరంజీవిపై నోరుజారిన కళ్యాణ్ పడాల.. లైవ్‌లోనే బిగ్ బాస్ విన్నర్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్

Kalyan Padala: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలకు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు లైవ్‌లోనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు కారణం ఏంటి? కళ్యాణ్ ఏం చేశాడు? అభిమానులు ఎందుకు మండిపడ్డారో ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 23 2026, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఘనంగా చిరంజీవి బర్త్‌డే వేడుకలు
Image Credit : Asianet News

ఘనంగా చిరంజీవి బర్త్‌డే వేడుకలు

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ వర్గాలతో పాటు మెగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే, తాజాగా నిర్వహించిన ఈ బర్త్‌డే వేదికపై ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. అభిమానుల మధ్య జరిగిన ఒక చిన్న రచ్చకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. ఈ వేడుకల్లో బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలకు మెగా అభిమానులు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చిరంజీవిపై నోరుజారిన కళ్యాణ్ పడాల
Image Credit : Asianet News

చిరంజీవిపై నోరుజారిన కళ్యాణ్ పడాల

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల హాజరయ్యాడు. మైక్ ముందుకు వచ్చి మాట్లాడే క్రమంలో చిరంజీవి గురించి గొప్పగా చెబుతూనే, మధ్యలో 'అతను' అని సంబోధించాడు. "అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి, అతను చాలా గొప్పవాడు" అంటూ 'అతను' అనే పదాన్ని పదే పదే వాడాడు. దీంతో అక్కడున్న మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం వచ్చింది. వెంటనే కింద నుంచి గట్టిగా అరుస్తూ, "'అతను' కాదు.. మర్యాదగా మాట్లాడు!" అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో వెంటనే కళ్యాణ్ పడాల స్పందిస్తూ.. "క్షమించండి బ్రో, నాకు తెలియదు" అని సారీ చెప్పాడు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారడంతో కళ్యాణ్ కాస్త కంగారుపడ్డాడు.

Related Articles

Related image1
Nagarjuna Cheat Day: ఫ్రెండ్స్‌తో రెండు బీర్లు, నాటుకోడితో కడుపునిండా భోజనం.. నాగార్జున చీటింగ్ డే ఎప్పుడో తెలుసా?
Related image2
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
34
సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్న నెటిజన్లు
Image Credit : Asianet News

సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్న నెటిజన్లు

కళ్యాణ్ పడాల మాట తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఎవరి గురించి చెప్పినా సాధారణంగా 'అతను' అనే సంబోధిస్తుంటాడు, అది ఆయనకు అలవాటు. అయితే చిరంజీవి విషయంలో కూడా అలాగే మాట్లాడేసరికి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కానీ, బిగ్ బాస్ సీజన్ 9 నుంచి కళ్యాణ్‌ను ఫాలో అవుతున్న వారు మాత్రం.. ఆయన ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో అలా మాట్లాడలేదని సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాదు, అదే ప్రసంగంలో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ 'గారు' అనబోయి 'గాడు' అని తడబడ్డాడు. అంత పెద్ద ఈవెంట్‌లో మొదటిసారి మాట్లాడేసరికి కళ్యాణ్ కంగారులో తడబడ్డాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

44
యాక్టివ్ అవుతున్న బిగ్ బాస్ విన్నర్
Image Credit : instagram/@kalyanpadala881

యాక్టివ్ అవుతున్న బిగ్ బాస్ విన్నర్

బిగ్ బాస్ 9 విన్నర్ అయిన తర్వాత కళ్యాణ్ పడాల చాలా కాలం మీడియాకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఇంటర్వ్యూలు ఇవ్వడం, టీవీ షోలలో సందడి చేయడం చేస్తున్నాడు. ఇటీవల 'అగ్నిపరీక్ష 2'లో కూడా గెస్ట్ గా కనిపించాడు. అంతేకాకుండా తన లుక్‌ను కూడా కంప్లీట్‌గా మార్చేశాడు. త్వరలోనే ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna Vs Ravi Teja: రవితేజ దెబ్బకు బాలకృష్ణ 3 క్రేజీ సినిమాలు బలి.. ఇంత విధ్వంసం జరిగిందా
Recommended image2
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Nagarjuna Cheat Day: ఫ్రెండ్స్‌తో రెండు బీర్లు, నాటుకోడితో కడుపునిండా భోజనం.. నాగార్జున చీటింగ్ డే ఎప్పుడో తెలుసా?
Related Stories
Recommended image1
Nagarjuna Cheat Day: ఫ్రెండ్స్‌తో రెండు బీర్లు, నాటుకోడితో కడుపునిండా భోజనం.. నాగార్జున చీటింగ్ డే ఎప్పుడో తెలుసా?
Recommended image2
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved