MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Nagarjuna Cheat Day: ఫ్రెండ్స్‌తో రెండు బీర్లు, నాటుకోడితో కడుపునిండా భోజనం.. నాగార్జున చీటింగ్ డే ఎప్పుడో తెలుసా?

Nagarjuna Cheat Day: ఫ్రెండ్స్‌తో రెండు బీర్లు, నాటుకోడితో కడుపునిండా భోజనం.. నాగార్జున చీటింగ్ డే ఎప్పుడో తెలుసా?

Nagarjuna: 66 ఏళ్ల వయసులో కూడా నాగార్జున అంత ఫిట్‌గా, స్లిమ్‌గా ఉండటానికి కారణం ఆయన పాటించే కఠినమైన లైఫ్‌స్టైల్. తన వయసును 'స్లీపింగ్ మోడ్‌'లో పెట్టిన కింగ్.. ఫ్రెండ్స్‌తో బీర్లు తాగుతూ, ఘుమఘుమలాడే నాటుకోడి కూర తింటారని మీకు తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 23 2026, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
66 ఏళ్లలోనూ 30 ఏళ్ల యువకుడిలా నాగార్జున
Image Credit : Asianet News

66 ఏళ్లలోనూ 30 ఏళ్ల యువకుడిలా నాగార్జున

సాధారణంగా 60 ఏళ్లు దాటితే ఆ నొప్పులు, ఈ నొప్పులు అంటూ ముసలితనం వచ్చిందనే ఆలోచనలు మొదలవుతాయి. కానీ, 66 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల యువకుడిలా కనిపిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు నాగార్జున. ఈ వయసులో కూడా అమ్మాయిల మనసు దోచేస్తున్న ఈ 'మన్మథుడి' ఆరోగ్య రహస్యం ఏంటి? అసలు ఆయన ఏం తింటారు? ఆయన లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుంది? అని తెలుసుకోవాలని అభిమానులందరికీ ఉంటుంది.

ఈ విషయాల గురించి పలు సందర్భాల్లో నాగార్జున తన సీక్రెట్స్ వెల్లడించారు. డైట్, వ్యాయామం, మైండ్‌సెట్ విషయంలో క్రమశిక్షణ పాటించడం వల్లే తాను ఈ స్థాయి ఫిట్‌నెస్‌ సాధించానని ఆయన తెలిపారు. అయితే వారంలో ఒకరోజు మాత్రం ఆయన నచ్చిన ఆహారాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తారంట!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నాగార్జున స్పెషల్ వికెండ్ ప్లాన్
Image Credit : Asianet News

నాగార్జున స్పెషల్ వికెండ్ ప్లాన్

వారమంతా నిరంతర షూటింగ్‌లు, కఠినమైన డైట్ నియమాలు, వర్కౌట్లతో బిజీగా ఉండే సినీ తారలు తమ వ్యక్తిగత జీవితంలో మానసిక ప్రశాంతతను ఎలా పొందుతారు? మరీ ముఖ్యంగా టాలీవుడ్ 'కింగ్' నాగార్జున ఈ విషయంలో ఎలాంటి ప్లాన్ వేస్తారు? ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచిన నాగ్, ఆదివారం రోజును గడిపే తీరు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో నాగార్జున పంచుకున్న తన ఆహార నియమాలు, 'చీటింగ్ డే' (Cheat Day) గురించి ఆసక్తికర విషయాలు ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతుంటాయి.

ఆదివారం అంటే 'నో-వర్క్ పాలసీ'

రోజువారీ ఒత్తిడికి స్వస్తి పలికి, వారంలో ఒక రోజును పూర్తిగా తనకోసం, తన ఆత్మీయుల కోసం కేటాయించుకోవడమే నాగార్జున జీవనశైలిలోని ప్రత్యేకత. ఆయన మాట్లాడుతూ.. "సండే రోజు నేను అసలు వర్క్ చేయను. వృత్తిపరమైన బాధ్యతలను, షూటింగ్ ఒత్తిళ్లను పక్కనపెట్టి, ఫ్రెండ్స్‌తో కలిసి సమయం గడపడం వల్ల లభించే ఆనందం మరే దాంట్లోనూ దొరకదు" అని చెప్పారు.

Related Articles

Related image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Related image2
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
34
రెండు బీర్లు - నాటుకోడితో భోజనం!
Image Credit : Asianet News

రెండు బీర్లు - నాటుకోడితో భోజనం!

ఆదివారం మధ్యాహ్నం ఫ్రెండ్స్‌తో కలిసి హాయిగా ఒకచోట కూర్చుని ఒకట్రెండు బీర్లు తాగుతూ కాలక్షేపం చేయడం ఆయనకు ఇష్టమైన అలవాటు. ఆ తర్వాత కారంగా ఉండే ఘుమఘుమలాడే ఆంధ్ర నాటుకోడి కూర, ఇతర నోరూరించే నాన్-వెజ్ వంటకాలను చేయించుకుని కడుపు నిండా మనస్ఫూర్తిగా భోజనం చేస్తానని నాగ్ వెల్లడించారు. నాటుకోడి కూరలోని ప్రత్యేకమైన ఘాటు, సంప్రదాయ రుచులు ఆ ఆదివారాన్ని మరింత ప్రత్యేకం చేస్తాయని తెలిపారు.

ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణతో కూడిన లైఫ్‌స్టైల్ ఎంత అవసరమో, దానికి కొంత విరామం ఇస్తూ నచ్చిన ఆహారాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడం కూడా అంతే ముఖ్యం. వారంలో ఆ ఒక్కరోజు నచ్చినట్లు తింటూ, స్నేహితులతో ఆనందించడం వల్ల మిగిలిన ఆరు రోజులు మరింత ఉత్సాహంగా, రెట్టింపు శక్తితో పనిచేయడానికి అవసరమైన మైండ్ రీఛార్జ్ లభిస్తుందని నాగార్జున నమ్ముతారు.

44
నాగార్జున డైలీ డైట్ రొటీన్
Image Credit : Instagram

నాగార్జున డైలీ డైట్ రొటీన్

డైలీ లైఫ్‌స్టైల్‌లో నాగార్జున ఆరోగ్యకరమైన ఆహారానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. రోజూ భోజనం చేస్తారు కానీ, వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తీసుకుంటారు. భోజనంలో తప్పనిసరిగా మూడు రకాల ఆకుకూరలు ఉండేలా చూసుకుంటారు. అదేవిధంగా చికెన్ లేదా చేపలు కూడా ఆహారంలో భాగమవుతాయి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఉన్న బ్యాలెన్స్‌డ్ డైట్‌ను పాటిస్తారు.

తక్కువ మొత్తంలో తినడం, పరిమితంగా స్వీట్స్ తీసుకోవడం, డిన్నర్‌ను చాలా త్వరగా పూర్తి చేయడం నాగార్జున అలవాటుగా మార్చుకున్నారు. అలాగే, పెరుగును కూడా రోజూ ఆహారంలో తీసుకుంటారు. వయసు పెరిగే కొద్దీ కొన్ని ఆహార పదార్థాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని, ఆ విషయంలో నిపుణుల సలహా మేరకు నడుచుకుంటానని ఆయన చెబుతుంటారు.

క్రమశిక్షణ, సరైన డైట్, వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆలోచనా విధానమే నాగార్జున 66 ఏళ్ల వయసులోనూ ఇలా ఎవర్ గ్రీన్ లుక్‌లో ఉండేందుకు ప్రధాన కారణం!

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Irumudi Day 2 Collections: రెండో రోజు ఇరుముడి కి దిమ్మతిరిగే కలెక్షన్లు, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న రవితేజ మూవీ
Related Stories
Recommended image1
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Recommended image2
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved