- Home
- Entertainment
- Kalyan Padala: తనూజతో రిలేషన్‌పై ఓపెన్ అయిన కళ్యాణ్ పడాల.. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందా?
Kalyan Padala: తనూజతో రిలేషన్‌పై ఓపెన్ అయిన కళ్యాణ్ పడాల.. ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుందా?
Kalyan Padala: బిగ్ బాస తెలుగు 9 విన్నర్ కళ్యాణ్ పడాల.. తనూజతో బాండింగ్ గురించి ఓపెన్ అయ్యాడు. బిగ్ బాస్ షోలో ఎలా ఉన్నామో, ఇప్పుడు కూడా అలానే ఉన్నట్టు తెలిపాడు.

వెండితెర ఎంట్రీకి కళ్యాణ్ పడాల ప్లాన్
బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్ కళ్యాణ్ పడాల చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాడు. ఆయన ఓ పాటతో తెరకు పరిచయం కాబోతున్నారు. త్వరలో దీన్ని విడుదల చేయబోతున్నారు. మరోవైపు సినిమాలు చేసే ప్లానింగ్‌లో కూడా ఉన్నాడు. చాలా సెలక్టీవ్‌గా, పక్కా ప్లాన్‌తో సినిమాలు చేయబోతున్నాడట. ఆ వివరాలను తెలిపారు కళ్యాణ్. చాలా స్క్రిప్ట్ లు విన్నాడట. వాటిలో కొన్ని బాగా నచ్చాయని, వాటిపై వర్క్ చేస్తున్నట్టు తెలిపాడు. ఏదో వచ్చామా పోయామా అనేలా కాకుండా నిలబడేలా సినిమాలు చేయాలనుకున్నట్టు చెప్పాడు కళ్యాణ్ పడాల.

తనూజతో రిలేషన్‌ప ఓపెన్ అయిన కళ్యాణ్
ఈ క్రమంలో తనూజతో రిలేషన్‌పై ఆయన ఓపెన్ అయ్యాడు. బిగ్ బాస్ షోలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారట. సేమ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందని, అదే బాండింగ్ రన్ అవుతుందని స్పష్టం చేశాడు. టామ్ అండ్ జెర్రీలా ఉండము గానీ, ఒకరికొకరం రెస్పెక్ట్ చేసుకునేలా, అభిప్రాయాలు పంచుకునేలా, సలహాలు ఇచ్చుకునేలా తమ స్నేహం కొనసాగుతుందని తెలిపాడు కళ్యాణ్ పడాల.
రెగ్యూలర్‌గా తనూజతో టచ్‌లోనే కళ్యాణ్
రోజూ తనూజతో మాట్లాడుతూనే ఉంటానని తెలిపాడు కళ్యాణ్. తనకు ఏదైనా డౌట్ వస్తే ఆమెకి ఫోన్ చేసి అడుగుతాడట. తమ స్నేహం, తమ బాండింగ్ మారదు అని, ఎప్పటికీ అలానే ఉంటామని తెలిపాడు. ఇటీవల పాట గ్లింప్స్ వచ్చినప్పుడు ఫోన్ చేసి అభినందించిందని చెప్పాడు. తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందన్నాడు. ప్రస్తుతం కుకూ విత్ జాతిరత్నాలు షోలో పాల్గొన్న కూడా ఇద్దరం కలిసే షో చేస్తున్నామని, బిగ్ బాస్‌లో ఎలా ఉన్నామో, ఇందులో కూడా అలానే ఉన్నామని చెప్పాడు.
ఆర్మీ జాబ్ వదిలేసి బిగ్ బాస్ కి కళ్యాణ్ పడాల
కళ్యాణ్ పడాల బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆర్మీ జవాన్ అయిన కళ్యాణ్ ఆ ఉద్యోగం వదిలేసి ఈ షోకి వచ్చాడు. మొదట అగ్నిపరీక్షలో నెగ్గి కామన్ మ్యాన్ కేటగిరిలో షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. నెమ్మదిగా పుంజుకుంటూ ఏకంగా టైటిల్ విన్నర్ అయ్యాడు. మరోసారి కామన్ మ్యాన్ బిగ్ బాస్ టైటిల్‌ని గెలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమయ్యింది. షో తర్వాత పెద్దగా పబ్లిక్‌లోలేని కళ్యాణ్.. ఇప్పుడు బయటకు వచ్చాడు. ఇంటర్వ్యూలో తనూజ గురించి ఓపెన్ అయ్యాడు.

