- Home
- Entertainment
- కల్కి బోరింగ్, అరగంట లేపేయాలి, ప్రభాస్ ని అలా చూపించాల్సింది, అమితాబ్ డామినేషన్..స్టార్ హీరో షాకింగ్ రివ్యూ
కల్కి బోరింగ్, అరగంట లేపేయాలి, ప్రభాస్ ని అలా చూపించాల్సింది, అమితాబ్ డామినేషన్..స్టార్ హీరో షాకింగ్ రివ్యూ
కల్కి మూవీ పై సీనియర్ హీరో ఇచ్చిన రివ్యూ చర్చకు దారి తీసింది. కల్కి మూవీ ఫస్ట్ హాఫ్ బోరింగ్ అన్న ఆయన, ప్రభాస్ పాత్ర పై అసహనం వ్యక్తం చేశాడు. స్టార్ క్యామియోలు కూడా అనవసరం అంటూ నెగిటివ్ కామెంట్స్ చేశాడు.

ప్రభాస్ మూవీ కల్కి 2829 AD బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం లేదు. ఆ చిత్రానికి వచ్చిన వసూళ్లు అందుకు నిదర్శనం. కల్కి జూన్ 27న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా యూఎస్ లో కల్కి చిత్రానికి విశేష ఆదరణ దక్కింది. అక్కడ కల్కి $ 16 మిలియన్ వసూళ్లను అధిగమించింది. ఆర్ ఆర్ ఆర్ చిత్ర రికార్డు బ్రేక్ చేసింది.
మొత్తంగా కల్కి ఓవర్ సీస్ వసూళ్లు $30 మిలియన్ అని ట్రేడ్ వర్గాల అంచనా. తెలుగు రాష్ట్రాల్లో కూడా కల్కి మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. తమిళనాడు, కేరళలో మాత్రం కల్కి పెద్దగా ప్రభావం చూపలేదు. వరల్డ్ వైడ్ కల్కి మూవీ రూ. 1000 కోట్ల వసూళ్లను అధిగమించినట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఇక కల్కి చిత్రం పై టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ టేకింగ్, హాలీవుడ్ రేంజ్ విజువల్స్, కథ, కథనాలను బాగున్నాయని అన్నారు. ఇండియన్ మూవీ స్థాయిని పెంచిన చిత్రంగా కల్కి ని అభివర్ణించారు. అయితే ఓ సీనియర్ స్టార్ హీరో మాత్రం కల్కి మూవీ నెగిటివ్ కామెంట్స్ చేశాడు.
ఒకప్పటి స్టార్ నేటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సుమన్ కల్కి మూవీని ఉద్దేశిస్తూ ఓపెన్ కామెంట్స్ చేశాడు. కల్కి మూవీలో తనకు నచ్చిన విషయాలను మెచ్చుకున్న సుమన్.. నచ్చని విషయాలను మొహమాటం లేకుండా బయటపెట్టాడు. అందరూ విమర్శించినట్లే... కల్కి ఫస్ట్ హాఫ్ కొంత బోరింగ్ అని సుమన్ అన్నారు. ఒక అరగంట ఎడిట్ చేయాల్సిందని అభిప్రాయ పడ్డారు.
ఆ ముంబై హీరోయిన్(దిశా పటాని) సినిమాకు అవసరం లేదు. ఆ పాత్రకు కథతో సంబంధం లేదు. ఆమెతో సాంగ్, ఫైట్ అనవసరంగా పెట్టారని సుమన్ అన్నారు.అలాగే ప్రభాస్ ని చూపించిన తీరు కూడా సుమన్ కి నచ్చలేదు. ప్రభాస్ భారీకాయుడు. ఆయన్ని టార్జాన్ లా చూపించాల్సింది. ప్రభాస్ బాడీకి ఏదో షీల్డ్ పెట్టి కవర్ చేసేశారు.
బాహుబలి మూవీలో బేర్ బాడీలో ప్రభాస్ కనిపించాల్సింది. ప్రభాస్ అంటే నాకు ఇష్టం అని సుమన్ అన్నారు. ఇక మూవీలో అమితాబ్ పాత్ర డామినేషన్ ఎక్కువగా ఉందని సుమన్ తెలియజేశారు. మ్యూజిక్ బాగోలేదు. సాంగ్స్ అసలు క్యాచీగా లేవు అన్నారు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ లో చూడాల్సిన సినిమా అని సుమన్ చెప్పుకొచ్చాడు.
ఇక లెక్కకు మించిన స్టార్ క్యామియోలు కూడా అనవసరం అన్నారు. ఒక స్టార్ హీరో ఉంటే అంచనాలు పెరుగుతాయి. ఒకవేళ వాళ్లకు స్క్రీన్ స్పేస్ లేకపోతే ఆడియన్స్ నిరాశ చెందుతారు. కల్కి మూవీలో నేను చేయగలిగిన పాత్ర ఏదీ కనిపించలేదు. మనం ఒక పాత్ర చేస్తే గుర్తుండి పోవాలని.. సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అయితే సెకండ్ హాఫ్ మేకింగ్, ఫ్యూచరిస్టిక్ స్టోరీ, దర్శకుడు విజన్ బాగుందని సుమన్ అన్నారు. హాలీవుడ్ రేంజ్ మూవీ తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కి సెల్యూట్ అని సుమన్ కొనియాడారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ ఈ మేరకు కామెంట్స్ చేశాడు.
సుమన్, కల్కి, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటాని, కమల్ హాసన్,