MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ లో ఆ 3 వీక్ పాయింట్స్.. అందుకే పెళ్లి చేసుకోవడం లేదా..?

ప్రభాస్ లో ఆ 3 వీక్ పాయింట్స్.. అందుకే పెళ్లి చేసుకోవడం లేదా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ఇండియా స్టార్ గా వెలుగువెలుగుతున్న సంగతి తెలిసిందే..? కల్కి సినిమాతో హాలీవుడ్ రేంజ్ ను అందుకోబోతున్న ప్రభాస్ లో ఓ మూడు వీక్ పాయింట్స్ ఉన్నాయని మీకు తెలుసా..? ప్రభాస్ తో పాటు రాజమౌళి కూడా వెల్లడించిన ప్రభాస్ మైనస్ పాయింట్స్ ఏంటీ..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 27 2024, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కల్కి సినిమాతో దుమ్మురేపుతన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ గా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. కల్కి2829Ad సినిమాతో హాలీవుడ్ రేంజ్ ను అందుకోబోతున్నాడు. భారీ అంచనాల నడుమ ఈరోజు( 27 జూన్) రిలీజ్ అయిన సినిమా..హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదరుచూస్తున్న ప్రభాస్ ఆశలన్నీ కల్కి మీదే పెట్టుకున్నాడు. 
 

4 వేల జీతం నుంచి 600 కోట్ల సినిమా వరకూ.. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ జర్ని సాగిందిలా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే ఈసందర్భంగా ప్రభాస్ కు సబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నాడు ప్రభాస్. పెళ్ళెప్పుడు అంటే.. కరెక్ట్ ఆన్సర్ మాత్రం రావడంలేదు. ఇంత పెద్ద స్టార్ గా ఎదిగిన ప్రభాస్ లో మూడు మైనస్ పాయింట్స్ ఉన్నాయ. ఆ వీక్ నెస్ ల వల్లే ఆయన పెళ్ళిపై కూడా పెద్దగా శ్రద్ద పెట్టడంలేదంట. ఈ విషయంలో డైరెక్టర్ రాజమౌళి కూడా ఓసందర్భంలో క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ప్రభాస్ లో ఉన్న వీక్ పాయింట్స్ ఏంటి..? 
 

37

ప్రభాస్ స్వయంగా తన వీక్ నెస్ పాయింట్స్ ఏంటీ అనేది  గతంలో ఓ ఇంటర్వ్యూలో రివిల్ చేశారు. ప్రభాస్ అందరిలో కలవలేడు.. తనకు ముందు నుంచి బాగా అలవాటు అయినవారితోనే కలిసిపోతుంటాడు. ఈ విషయం ప్రభాస్  చాలా సందర్భాల్లో ఒప్పుకున్నారు కూడా అలవాటు మార్చుకోవాలని కూడా గట్టిగా ట్రై చేశాడట  ప్రభాస్.

47

ఇక ప్రభాస్ లో ఉన్న మరో ఇబ్బంది ఏంటంటే.. స్టేజ్ మీద ఫ్రీగా మూ అవ్వలేడు.. మాట్లాడలేడట.మాట్లాడినంతసేపు కాస్త భయంగానే ఉంటడట. ప్రభాస్ కు స్టేజ్ ఫియర్ ఉన్నట్టు పలు సందర్భాల్లో వెల్లడించారు. కెమెరా ముందు సింహంలా.. దూకే ప్రభాస్.. ఎలాంటి సన్నివేశానైన ఏమాత్రం లాగ్ చేయకుండా చేసే ప్రభాస్.. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడాలి అంటే మాత్రం ఇబ్బందిపడతాడట. 

57

కారణం ఏంటో తెలియదు కాని.. తను ఈ అలవాటు మర్చుకోలేకపోతున్నాడట. ఇంకో విషయం ఏంటంటే.. ప్రభాస్ కు బద్దకం చాలా ఎక్కువ.. ఈ విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు కూడా. అంతే కాదు ప్రభాస్ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం కూడా ఇదే అంట.. ఈ విషయాన్ని స్టార్ డైనరెక్టర్ రాజమౌళి ఓ సందర్భంలో అన్నారు. ప్రభాస్ చాలా బద్ధకస్తుడు, పెళ్లి చేసుకోవడానికి కూడా బద్ధకం. ఒక అమ్మాయిని వెతికి, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, ఇదంతా ప్రభాస్‌కి టూ మచ్‌ వర్క్‌ అనుకుంటాడు అని అన్నారు జక్కన్న. 

67

ఈ కారణంతోనే ప్రభాస్ పెళ్లి చేసుకోవడం లేదు..అంటూ సరదాగా బదులిచ్చారు రాజమౌళి. గతంలో జరిగిన బాహుబలి ప్రమోషన్స్​లో భాగంగా  రాజమౌళి ఓ టాక్ షోలో ఈ కామెంట్స్‌ చేశారు.అంతే కాదు 2019లో సాహో ప్రమోషన్స్‌లో కూడా ప్రభాస్‌ ఇదే విషయాన్ని చెప్పారు.  అక్కడ కూడా రాజమౌళి చెప్పిన అంశాలనే ప్రభాస్‌ రిపీట్‌ చేశారు. "లేజీ, షై, కొత్త వ్యక్తులను కలవలేను. నాకు ఈ మూడు ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ ఫీల్డ్‌కి ఎలా వచ్చానా? అని కూడా అనిపిస్తుంది." అంటూ ప్రభాస్ అన్నారు. 
 

77

ఇక ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సందీప్  రెడ్డితో స్పిరిట్, మారుతీతో రాజాసాబ్ తో పాటు.. హనురాఘవపూడితో మరో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. మరో ఐదేళ్ళు ప్రభాస్ ఫుల్ బిజీగా ఉండబోతున్నాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Vadde Naveen: ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్‌
Recommended image2
Nayanthara Photos: పెళ్లి రోజున భర్త, పిల్లలతో నయన్, ఫుల్‌ రొమాంటిక్‌.. ఫోటోలు హల్‌చల్‌
Recommended image3
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం మూవీ సెన్సార్‌ రివ్యూ.. సమంత సినిమాలో హైలైట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved