కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్రేజీ లవ్ స్టోరీ! బడా ప్రొడ్యూసర్ కూతురితో ఎలా సెట్ అయ్యిందంటే?
నాగ్ అశ్విన్ చాలా సింపుల్ గా ఉంటాడు. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాడట. అయితే టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అశ్విన్ దత్ కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
Nag Ashwin
అశ్వినీ దత్ టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరు. పరిశ్రమ ప్రముఖులతో పరిచయాలు. రాజకీయ నాయకులతో సంబంధాలున్న వ్యక్తి. అలాంటి అశ్వినీ దత్ అల్లుడిగా నాగ్ అశ్విన్ ని ఎలా తెచ్చుకున్నాడనే సందేహం చాలా మందిలో ఉంది. ప్రియాంక దత్ ఆయన్ని ప్రేమించడంతో అల్లుడు అయ్యాడు. మరి ప్రియాంక దత్ ఆయనలో ఏం చూసి ప్రేమించింది? ఈ ప్రశ్నకు నాగ్ అశ్విన్ స్వయంగా సమాధానం చెప్పాడు.
Nag Ashwin
పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత దర్శకుడు నాగ్ అశ్విన్ ని చూస్తే గుర్తుకు వస్తుంది. కల్కి మూవీతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. నాగ్ అశ్విన్ ని చూస్తే మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. చవకైన బట్టలు ధరించి, పెరిగిన జుట్టు, గడ్డం కలిగి ఉంటారు. బక్క పలచని శరీరంతో అతి సాధారణంగా కనిపిస్తాడు.
Nag Ashwin
మరోవైపు ఆయన భార్య ప్రియాంక దత్ బ్యాక్ గ్రౌండ్ చూస్తే... తండ్రి అశ్వినీ దత్ దశాబ్దాలుగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్. పెద్ద ఎన్టీఆర్ నుండి చిన్న ఎన్టీఆర్ వరకు ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఎందరో దర్శకులను చూశారు. రాజకీయంగా కూడా బలమైన సంబంధాలున్న వ్యక్తి. అలాంటి కుటుంబానికి నాగ్ అశ్విన్ లాంటి ఒక కొత్త డైరెక్టర్ అల్లుడిగా వెళ్లడం ఎవరూ ఊహించని పరిణామం..
Nag Ashwin
అందులోనూ నాగ్ అశ్విన్-ప్రియాంక దత్ సామాజిక వర్గాలు కూడా ఒకటి కాదు. చాలా సాదాసీదాగా ఉండే మీరు అశ్వినీ దత్ అల్లుడు ఎలా అయ్యారనే ప్రశ్న ఓ సందర్భంలో నాగ్ అశ్విన్ కి ఎదురైంది. అల్ట్రా మోడ్రెన్ సొసైటీలో పుట్టి పెరిగిన ప్రియాంక దత్ మిమ్మల్ని ఎలా ఇష్టపడ్డారు? మీలో ఆమెకు నచ్చిన అంశం ఏమిటీ? ప్రియాంక దత్ తో మీ ప్రేమ కథ ఎలా మొదలైంది? అని అడగడం జరిగింది.
మహానటి మూవీ విడుదల తర్వాత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్... ఈ సందేహాలకు సమాధానం చెప్పాడు. ప్రియాంక దత్ తో నా లవ్ స్టోరీ చాలా సింపుల్. పెద్ద సినిమాటిక్ గా కూడా ఉండదు. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రానికి ముందు నుంచే మాకు పరిచయం ఉంది. కలిసి కొన్ని యాడ్స్ చేశాము. అలా పరిచయం ఏర్పడింది.
Nag Ashwin
ఎవడే సుబ్రహ్మణ్యం షూటింగ్ లో అనుబంధం మరింత బలపడింది. జస్ట్ ప్రాక్టికల్ గా ఇద్దరికీ పెళ్లీడు వచ్చింది. ఇంట్లో సంబంధాలు తెస్తే.. నచ్చితే చేసుకుంటాం. ఆ క్రమంలో మనమే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా.. అన్నట్లు మా డిస్కషన్ నడిచింది. ఆ విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము.. అని నాగ్ అశ్విన్ అన్నారు.
nag ashwin
ఇక తనలో ప్రియాంకకు నచ్చిన అంశం ఏమిటంటే?... మా ఇద్దరి గోల్స్ ఒకటే. ఒక మంచి సినిమా తీయాలనే తపన ఉండేది. ఎటూ డిస్ట్రాక్ట్ కాకూడదు. ఒక మంచి సినిమా తీయాలనే నాలోని ఫోకస్ ఆమెకు నచ్చి ఉండవచ్చు. ఇక మా లైఫ్ స్టైల్స్ వేరు అంటారా?... ప్రియాంక దత్ డౌన్ టు ఎర్త్. సింపుల్ గానే ఉంటారు. అశ్వినీ దత్, స్వప్న(రెండో కూతురు) కూడా చాలా సింపుల్ అని చెప్పుకొచ్చారు.
ఎవడే సుబ్రహ్మణ్యం విడుదల తర్వాత ప్రియాంక-నాగ్ అశ్విన్ వివాహం చేసుకున్నారు. అప్పటికి నాగ్ అశ్విన్ కి పెద్దగా పేరు రాలేదు. మహానటి తో పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు. కల్కి చిత్రంతో దేశంలోని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో స్థానం సంపాదించాడు.