MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాజల్‌ కొడుకు నీల్‌ కిచ్లు ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ఇన్నాళ్లకి ఇంకాస్తూ చూపిస్తూ ఆడిస్తున్న అందాల చందమామ..

కాజల్‌ కొడుకు నీల్‌ కిచ్లు ఎంత క్యూట్‌గా ఉన్నాడో.. ఇన్నాళ్లకి ఇంకాస్తూ చూపిస్తూ ఆడిస్తున్న అందాల చందమామ..

కాజల్‌ అగర్వాల్‌ తన కుమారుడు నీల్‌ కిచ్లుతోనే టైమ్‌ అంతా స్పెండ్‌ చేస్తుంది. మాతృత్వపు మధుర క్షణాలను అనుభవిస్తుంది. తాజాగా కుమారుడిని చూపిస్తూ అతనితో ఆడుకుంటున్న ఫోటోలను పంచుకుంది కాజల్‌.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Jan 19 2023, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. సోషల్‌ మీడియాలో ఆమె హల్‌చల్‌ చేస్తుంది. కారణం తన కుమారుడు నీల్‌ కిచ్లుతో దిగిన ఫోటోని పంచుకోవడమే. ఇప్పటి వరకు కుమారుడుని స్టయిట్‌గా చూపించలేదు కాజల్‌. సైడ్‌ గానూ చూపిస్తూ వస్తుంది. చూపించి చూపించకుండా దోబూచులాడుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఉన్నంతలో ఇప్పుడు ఇంకాస్త బెటర్‌గా ఆమె తన కుమారుడిని చూపించే ప్రయత్నం చేసింది. చేతుల్లో ఆడుకుంటూ కనిపించింది కాజల్‌. పైకి ఎగిరేస్తూ ముద్దుల చిన్నారి నవ్వులను ఎంజాయ్‌ చేస్తూ ఆ మాతృత్వపు మధుర క్షణాలను ఆస్వాధిస్తుంది. చిన్నారి ప్రతి మూవ్‌మెంట్‌ని కళ్లల్లో నింపుకుంటూ ఎంజాయ్‌ చేస్తుందీ అందాల చందమామ. 

38

కాజల్‌ ఈ సందర్భంగా తన కుమారుడు నీల్‌ కిచ్లుపై ఓ ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. ఈ ఫోటోలను అభిమానులతో షేర్‌ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. కుమారుడికి తొమ్మిది నెలలు నిండిన నేపథ్యంలో ఇకపై ఆ చిన్నారి చేసే పనులను, దేవుడు అతనితో చేయించే పనులను చూస్తూ ఆస్వాదించేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పింది కాజల్‌.
 

48

అంతేకాదు ఇప్పటి వరకు గత తొమ్మిది నెలలు, అలాగే రాబోయే రోజులకు సంబంధించి ఎంతో కృతజ్ఞతతో ఉన్నట్టు చెప్పింది కాజల్‌. ఏడాదిలో మూడవవంతు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, అందుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూ, ట్రెండ్‌ అవుతున్నాయి. కాజల్ అభిమానులను ఆద్యంతం అలరిస్తున్నాయి. కొడుకుతో కాజల్‌ అడోరబుల్‌ పిక్స్ ఎంతో క్యూట్‌గా ఉండి కట్టిపడేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. గ్రేట్‌ యాక్టర్‌, గ్రేట్‌ మదర్‌ అంటూ ప్రశంసిస్తున్నారు. 
 

58

కాజల్‌ గతేడాది ఏప్రిల్‌లో కుమారుడు నీల్‌కిచ్లుకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 2020లో ఆమె ముంబయికి చెందిన వ్యాపార వేత్తని పెళ్లి చేసుకుంది. అక్టోబర్ 30న వీరి వివాహం జరిగింది. అదే నెల ప్రారంభంలో తన ప్రేమ, పెళ్లి విషయాన్ని ప్రకటించింది కాజల్‌. ఊహించని విధంగా తన మ్యారేజ్‌ని ప్రకటించి అభిమానుల గుండెల్లో బాంబ్‌ వేసింది. దీంతో లక్షలాది మంది ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నెమ్మదిగా తేరుకుని చేసేదేం లేక అభినందనలు తెలిపారు. 
 

68

కాజల్‌(Kajal) దాదాపు దశాబ్దన్నర పాటు సినిమా ఇండస్ట్రీలో ఉంది. కానీ ఏ రోజు ఆమె లవ్ ఎఫైర్‌ వార్తలను ఫేర్‌ చేయలేదు. ఎలాంటి రూమర్స్ కూడా లేవు. కానీ 2012 నుంచే గౌతమ్‌ కిచ్లుతో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంది కాజల్‌. అప్పట్నుంచి తమ లవ్‌ స్టోరీ ప్రారంభమైందని అప్పట్లో ఓ చిట్‌చాట్‌లో పేర్కొంది. అయినా ఎక్కడా లీక్‌ కానివ్వలేదు. అది తన ప్రత్యేకతని చాటుకుంటుందని చెప్పొచ్చు. 

78

ఇక నటిగా తెలుగు ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయింది కాజల్‌. స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. చిరంజీవితోపాటు యంగ్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది. పవన్‌, మహేష్‌, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్‌చరణ్‌, గోపీచంద్‌ వంటి వారితో జోడీ కట్టి వాహ్‌ అనిపించింది. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది. 

88

ప్రస్తుతం ఈ బ్యూటీ పెళ్లి, ప్రెగ్నెంట్‌ కారణంగా సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. `ఆచార్య`లో నటించినా, చివర్లో ఆమె పాత్రని లేపేశారు. ఆ తర్వాత సినిమానే పెద్ద డిజాస్టర్‌ అయ్యింది. చివరగా ఆమె తమిళ మూవీ `హే సినామిక`లో నటించినా, అదిపెద్దగా మెప్పించలేదు. ప్రస్తుతం `ఇండియన్‌ 2`లో నటించాల్సి ఉంది. మరోవైపు రీఎంట్రీకి కాజల్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె కమ్‌ బ్యాక్‌ కావాలని హాట్‌ ఫోటో షూట్లు చేస్తుంది. కానీ మేకర్స్ పట్టించుకోవడం లేదు. మున్ముందైనా ఈ బ్యూటీకి మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
మ‌నం జాలీగా విన్న ‘అమృతం’ పాట‌లో ఇంత అర్థ‌ముందా.? ఆలోచ‌న‌ను మార్చే జీవిత స‌త్యాలు
Recommended image2
Yuvina Parthavi: ఆదర్శ కుటుంబంలో వెంకీ కూతురిగా నటించింది ఎవరో తెలుసా.. ఒక్క టూర్ ఆమె జాతకాన్నే మార్చేసింది
Recommended image3
Trivikram: బద్దం భాస్కర్‌ అంటూ గురువుపైనే త్రివిక్రమ్‌ సెటైర్లు.. గట్టిగా ఇచ్చి పడేసిన స్టార్‌ డైరెక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved