- Home
- Entertainment
- పారితోషికం పెంచిన కాజల్.. `సత్యభామ`కి ఎంత తీసుకుంటుందంటే?.. సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు మామూలుగా లేదుగా
పారితోషికం పెంచిన కాజల్.. `సత్యభామ`కి ఎంత తీసుకుంటుందంటే?.. సెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు మామూలుగా లేదుగా
కాజల్ అగర్వాల్.. స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఊపేసింది. ఈ భామ యంగ్, స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు మీదుంది. రెట్టింపు ఎనర్జీతో వస్తోంది.

కాజల్ టాలీవుడ్‌లో దాదాపు రెండు దశాబ్దాలుగా రాణిస్తుంది. ఆమె 2004లో హిందీ సినిమా `ఖ్యూన్ హో గయా నా` చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇందులో హీరోయిన్‌కి సిస్టర్‌గా మెరిసింది. పెద్దగా పేరు రాలేదు. మూడేళ్ల గ్యాప్ తర్వాత తేజ దర్శకత్వంలో కళ్యాన్ రామ్ నటించిన `లక్ష్మీ కళ్యాణం` చిత్రంలో నటించింది. ఈ సినిమా ఓ యావరేజ్‌గానే ఆడింది. కానీ కాజల్ కి మాత్రం కలిసొచ్చింది. ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ వెంటనే కృష్ణవంశీ `చందమామ` చిత్రంలో నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచి ఎంటర్‌టైనర్‌గా, అదే సమయంలో రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగే ఈ చిత్రంలో మహాలక్ష్మిగా అలరించింది. లవర్స్ ని మార్చుకునే కాన్సెప్ట్ ఆద్యంతం కొత్తగా అనిపించింది. దీంతో కాజల్ హీరోయిన్ టాలీవుడ్‌కి దగ్గరయ్యింది. దీంతో ఆమె కెరీర్ బిగ్ టర్న్ తీసుకుంది.
పెద్ద పెద్ద ఆఫర్లు ప్రారంభమయ్యాయి. సుమంత్‌తో `పౌరుడు`, నితిన్‌తో `ఆటాడిస్తా` చిత్రాలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి నటించిన `మగధీర`తో కాజల్ స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ఇందులో మిత్రవిందగా, ఇందిరాగా ఆమె ఆద్యంతం కట్టిపడేసింది. గ్లామరస్‌గా, నటన పరంగానూ ఆకట్టుకుంది.
రామ్‌తో `గణేష్`, బన్నీతో `ఆర్య2`, `ఓంశాంతి`, ప్రభాస్‌తో `డార్లింగ్`, `మిస్టర పర్‌ఫెక్ట్`, ఎన్టీఆర్‌తో `బృందావనం`, `బాద్షా`, `టెంపర్`, రవితేజతో `వీర`, `సారొచ్చారు`, నాగచైతన్యతో `దడ`, మహేష్‌బాబుతో `బిజినెస్ మ్యాన్` `బ్రహ్మోత్సవం`, రామ్ చరణ్‌తో `నాయక్`, `గోవిందుడు అందరి వాడేలే`, పవన్‌తో `సర్దార్ గబ్బర్ సింగ్`, చిరంజీవితో `ఖైదీ నెంబర్ 150`, `అ!`, కళ్యాణ్ రామ్‌తో `ఎమ్మెల్యే`తోపాటు `కవచం`, `సీత`, `రణరంగం`, `మోసగాళ్లు` వంటి సినిమాలు చేస్తుంది.
మూడేళ్ల క్రితం కాజల్ సినిమాలకు దూరమయ్యింది. ఆమె పెళ్లి చేసుకుని నీల్ కిచ్లుకి జన్మనిచ్చింది. దీంతో కొంత బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ కామ్ బ్యాక్ అవుతుంది. కాజల్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమవుతుంది. అందులో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఉండటం విశేషం. ఇప్పటికే కాజల్ బాలకృష్ణతో మొదటిసారి `భగవంత్ కేసరి`, ` ఇండియన్2`తోపాటు తాజాగా `సత్యభామ` సినిమాలో నటిస్తుంది.
`సత్యభామ` కాజల్ నటిస్తున్న తొలి ప్రాపర్ లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. అఖిల్ డేగల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతోపాటు మరో మూడు సినిమాలకు సైన్ చేసిందట కాజల్. తెలుగులో మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుందట, మరోవైపు విజయ్‌తో విక్రమ్ ప్రభు సినిమాలో హీరోయిన్‌గా అంటూ వార్తలొస్తున్నాయి.
Kajal Aggarwal
తాజాగా `సత్యభామ` చిత్ర పారితోషికం హాట్ టాపిక్ అవుతుంది.ఈ సినిమాకి ఆమె ఏకంగా మూడు కోట్ల పారితోషికం అందుకుంటుందట. రెండున్నర నుంచి మూడు వరకు ఇస్తున్నట్టు సమాచారం. `భగవంత్ కేసరి` చిత్రానికి కూడా రెండున్నర కోట్లు పారితోషికంగా అందుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయం ఇప్పుడు డిస్కషన్ పాయింట్‌గా మారింది. ఇకపై కాజల్.. బడ్జెట్ రేంజ్‌ని బట్టి..