- Home
- Entertainment
- సినిమాలకు కాజల్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. పలుచని పట్టుచీరలో అదిరిపోయిన చందమామ అందం..
సినిమాలకు కాజల్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. పలుచని పట్టుచీరలో అదిరిపోయిన చందమామ అందం..
తెలుగు తెర అందాల చందమామ తాజాగా హైదరాబాద్‌లో సందడి చేసింది. చాలా రోజుల తర్వాత ఆమె మీడియా ముందుకొచ్చింది. ఆడియెన్స్ తో కలిసి రచ్చ చేసింది. పట్టుచీరలో హోయలు పోయింది. ఫ్యాన్స్ ని ఫిదా చేసింది.

కాజల్.. తాజాగా పట్టుచీరకట్టి కనువిందు చేసింది. పలుచని ఉల్లిపొర లాంటి శారీలో హోయలు పోయింది. కిల్లింగ్ స్మైల్‌తో కుర్రాళ్ల మతిపోగొట్టింది. రెట్టింపు అందం, రెట్టింపు హాట్‌నెస్‌లో ఫిదా చేస్తుందీ అందాల చందమామ. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌కి వచ్చింది కాజల్. చాలా రోజుల తర్వాత ఆడియెన్స్ ని పలకరించింది. ప్రస్తుతం కాజల్ లేడీ ఓరియెంటెడ్ మూవీ `సత్యభామ`లో నటిస్తుంది. తన 60వ చిత్రమిది. నేడు(సోమవారం) తన పుట్టిన రోజు సందర్భంగా ముందుగానే `సత్యభామ` టైటిల్, గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో కాజల్ నయా అవతార్‌లో మెరిసింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకుంది. తనలోని కొత్త యాంగిల్‌ని బయటపెట్టింది.
ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ ఈవెంట్‌లో సందడి చేసింది కాజల్. ఇందులో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకిది బెస్ట్ బర్త్ డే అని తెలిపింది. మొదటిసారి అభిమానుల మధ్య బర్త్ డే చేసుకుంటున్నానని చెప్పింది. ఎప్పుడైనా బర్త్ డే రోజు ఎక్కడున్నా ఇంటికి వెళ్లిపోతాను, కానీ ఈ సారి మీతోనే బర్త్ డేసెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని, ఇది తన బెస్ట్ బర్త్ డే అని తెలిపింది.
ఈ సందర్భంగా తాను సినిమాలకు గుడ్‌బై చెప్పబోతున్నట్టు వస్తోన్న వార్తలపై కాజల్ స్పందించింది. తాను సినిమాలకు మానేయబోవడం లేదని, అవి కేవలం రూమర్స్ మాత్రమే, అందులో నిజం లేదని వెల్లడించింది. రూమర్స్ నమ్మవద్దని, మీ ప్రేమతో సినిమాలు చేస్తానని వెల్లడించింది. తన అబ్బాయి నీల్ కిచ్లు బాగున్నాడని, ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పింది. త్వరలో మీకు పరిచయం చేస్తానని వెల్లడించింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ, తెలుగు ఆడియెన్స్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, ఇన్నేళ్లు హీరోయిన్ గా రాణించానని తెలిపింది. వారి ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేనని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తనకు హోం టౌన్ లాంటిదని, ఇక్కడ సినిమాలు చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని వెల్లడించింది. ఈ సందర్భంగా తనకు ఇలాంటి మంచి స్క్రిప్ట్ ని తీసుకొచ్చిన శశికిరణ్ తిక్క, చిత్ర దర్శకుడు అఖిల్ డేగల, నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలకు ఆమె థ్యాంక్స్ చెప్పింది.
ఈ కార్యక్రమంలో `సత్యభామ` సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్న అవురమ్ ప్రొడక్షన్ లోగోని లాంచ్ చేసింది కాజల్. వారికి బెస్ట్ విషెస్ తెలిపింది. అనంతరం తన బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసి అతిథిగా వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల, టీమ్‌కి తినిపించింది.