- Home
- Entertainment
- కాజల్‌కి దొంగ ముద్దు.. చూడగానే భలే కవర్ చేసిన గౌతమ్.. గ్యాపివ్వండంటూ నెటిజన్ల హాట్ కామెంట్స్
కాజల్‌కి దొంగ ముద్దు.. చూడగానే భలే కవర్ చేసిన గౌతమ్.. గ్యాపివ్వండంటూ నెటిజన్ల హాట్ కామెంట్స్
స్టార్ హీరోయిన్ కాజల్ పీక్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. భర్త, తనయుడితో హ్యాపీ లైఫ్‌ని గడుపుతుంది. రొమాంటిక్ పోజులతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్ రచ్చ చేస్తుంది.

కాజల్(Kajal) తన భర్తతో కలిసి వెకేషన్‌కి వెళ్లారు. అక్కడ హోటల్‌లో దిగిన ఫోటోని పంచుకుంది కాజల్. ఈ ఫోటోల్లో వీరిచ్చిన పోజులు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. వైరల్ అవుతున్నాయి. ఇందులో కాజల్ భర్త గౌతమ్ కిచ్లు(Gautam Kitchlu) చేసిన పని ఆద్యంతం ఫన్నిగా, ఇంకాస్త రొమాంటిక్‌గా ఉండటం విశేషం.
ఇందులో గౌతమ్ కిచ్లు కాజల్‌కి వెనకాల నుంచి ముద్దు ఇవ్వబోయాడు. చిలిపిగా, ఇంకాస్త రొమాంటిక్‌గా ట్రై చేశాడు. అయితే అది కాజల్ చూసే సరికి అమాయకంగా నవ్వుతున్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. ఈ రెండు సన్నివేశాలు ఫోటోల్లో బంధించారు. వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కాజల్ పంచుకుంది. దీంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు.
గౌతమ్ ముద్దు కోసం ట్రై చేశాడు, ఆమె వెనక్కి తిరగ్గానే ఏమీ తెలియనట్టుగా నటించాడు. యాక్టింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, గౌతమ్ భలే రొమాంటిక్ అని అంటున్నారు. ఇంకొందరు అప్పుడే రెండో బిడ్డ కోసం ప్రయత్నాలా? గ్యాప్ ఇవ్వండని, కపుల్ గోల్ అంటూ రచ్చ లేపుతున్నారు.
కాజల్, ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్లుగా సీక్రెట్‌గా ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ ఏడాది కుమారుడు నీల్ కిచ్లుకి జన్మనిచ్చారు. ప్రస్తుతం కుమారుడితో మధురమైన క్షణాలను గడుపుతోంది కాజల్. పూర్తిగా ఫ్యామిలీకే టైమ్ కేటాయించింది.
వీరిద్దరు ఆగ్రలో ఈ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఓ హోటల్‌ని లంచ్ చేస్తున్న సమయంలో ఇలా సరదాగా ఫోటోలు దిగి వాటిని అభిమానులతో పంచుకుంది కాజల్. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతోపాటు నెటిజన్లు సరదాగా కామెంట్లు చర్చనీయాంశంగా మార్చేశాయి.
అదే సమయంలో గ్లామర్ ఫోటో షూట్లు కూడా చేస్తుంది. తన ఫిట్‌నెస్ ని, అందాన్ని చూపించేలా పోజులిస్తూ ఫోటోలు దిగుతుంది. తన అందం తరగలేదని, తన ఫిట్‌నెస్ కూడా చెక్కుచెదరలేదనే విషయాన్ని బలంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. మేకర్స్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది కాజల్.
అయినా కొత్తగా ఆమెకి ఇప్పటి వరకు మరే సినిమాని ప్రకటించలేదు. కానీ రీఎంట్రీ కోసం గట్టిగా ట్రై చేస్తుంది కాజల్. అదే సమయంలో ఒప్పుకున్న `ఇండియన్ 2`లో పాల్గొనబోతుంది. అయితే ఆమె ఫోటో షూట్ల వల్ల కమర్షియల్ యాడ్స్ బాగానే వస్తున్నాయి. ఇంట్లో కూర్చొనే యాడ్స్ రూపంలో సంపాదిస్తుందీ అందాల చందమామ.