భర్త గౌతమ్‌తో కలిసి కాజల్ హోలీ వేడుకలు..
కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి హోలీ సెలబ్రేట్ చేసుకుంది. పెళ్లైన తర్వాత మొదటి సారి వీరిద్దరు హోలీ వేడుకలో పాల్గొన్నారు. ఒకరినొకరు రంగులు పూసుకుని ఎంజాయ్ చేశారు. సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఫోటోలను పంచుకుంటూ అభిమానులకు విషెస్ తెలియజేశారు.
కాజల్ హోలీ పండుగని చాలా పద్ధతిగా చేసుకున్నారు. తన భర్తకి కొద్దికొద్దిగా రంగులు పూసి హుందాతనాన్ని చాటుకుంది.
అదే సమయంలో గౌతమ్ కిచ్లు కూడా తన భార్య కాజల్‌కి రంగులద్ది విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా వీరి హోలీ వేడుకకి సంబంధించిన ఫోటోలని పంచుకున్నారు.
ప్రస్తుతం ఆయా ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే వీరిద్దరు చాలా కొద్ది రంగులనే పూసుకోవడం కలర్‌ఫుల్‌గా పూర్తి రంగులతో నిండిలేకపోవడంతో అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
హోలీ అంటే రంగుల పండుగ, ఆ రంగులన్నీ కనిపిస్తేనే, ఆ రంగులన్నీ పూసుకుంటేనే దానికి అందం. కానీ వీరి విషయంలో అది మిస్ అవుతుంది.
ఏదేమైనప్పటికీ ఈ ఇద్దరు కొత్త జోడీ అభిమానులకు హోలీ విషెస్ చెప్పారు.
కాజల్ స్పందిస్తూ, ఈ హోలీ పండుగ మీకు, మీ ఫ్యామిలీకి మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ప్రేమని, పాజిటివిటీని పంచాలని కోరుకుంటున్నా` అని తెలిపింది.
గౌతమ్ కిచ్లు స్పందిస్తూ మా నుంచి మీకు హోలీ పండుగ శుభాకాంక్షలు అని చెప్పారు. ఈ సందర్భంగా సేఫ్‌గా ఉండాలని, ఇంట్లోనే ఉండాలని చెప్పారు.
మరోవైపు కాజల్ ఇటీవల పంచుకున్న హాట్ ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఓ బ్యాగ్ ప్రమోషన్‌లోనూ కాజల్ హోయలు పోయి మెస్మరైజ్ చేస్తుంది.
కాజల్ ప్రస్తుతం `ఆచార్య`, నాగార్జున సినిమాలో నటిస్తుంది. తమిళంలో `హే సినామిక` చిత్రం చేస్తుంది.