- Home
- Entertainment
- Kajal Aggarwal: బాత్ రూమ్‌ని కూడా వదలని కాజల్.. బ్లాక్ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
Kajal Aggarwal: బాత్ రూమ్‌ని కూడా వదలని కాజల్.. బ్లాక్ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
స్టార్ హీరోయిన్ కాజల్ కొత్త ఏడాది సందర్భంగా నయా ఫోటోలను పంచుకుంది. న్యూ ఇయర్ పార్టీ కోసం రెడీ అవుతూ కనిపించింది. బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసింది కాజల్.

టాలీవుడ్ లో స్టార్‌గా రాణించిన కాజల్
స్టార్ హీరోయిన్ కాజల్ ఒకప్పుడు టాలీవుడ్‌ని దున్నేసింది. ఆమె టాప్ హీరోలందరితోనూ కలిసి నటించింది. మోస్ట్ కమర్షియల్ హీరోయిన్‌గా రాణించింది. మూడేళ్ల వరకు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణించింది కాజల్. సడెన్‌గా పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు కొడుక్కి జన్మనిచ్చింది. తల్లి అయిన తర్వాత చాలా మారిపోయింది కాజల్. బొద్దుగా మారింది.
మారిపోయిన కాజల్
తన నయా లుక్‌లో కట్టిపడేస్తూ వచ్చింది. ఇంటర్నెట్‌ని షేక్ చేసింది. పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఆడవారిలో మార్పు వస్తుంది. అదే మార్పు కాజల్‌లో వచ్చింది. అది సినీ ప్రియులను కాస్త ఇబ్బంది పెట్టింది. కానీ ఇప్పుడు మళ్లీ బ్యాక్ వచ్చింది. నాజూకుగా మారిపోయింది. తాజాగా లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది కాజల్. ఇందులో ఆమె లుక్ ఆశ్చర్యపరుస్తోంది.
కాజల్ నయా లుక్ మైండ్ బ్లాక్
కొత్త ఏడాదిని ముందే తీసుకొస్తూ ఆమె ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇందులో కొత్త ఏడాది కోసం రెడీ అవుతున్నట్టుగా ఉంది. ఆమె బెడ్‌పై పడుకున్నప్పట్నుంచి, పార్టీ చేసుకునేందుకు, కొత్త ఏడాది సెలబ్రేషన్‌కి ప్రిపేర్ అవుతూ కనిపించింది. అయితే బాత్ రూమ్‌లోనూ ఆమె మేకప్ వేసుకుంటూ కనిపించింది. అందానికి మెరుగులు దిద్దుతూ కనిపించింది.
సన్నగా మారిన కాజల్
అనంతరం బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది. బ్లాక్ గౌన్‌లో కాజల్ నయా లుక్ అదిరిపోయింది. అయితే ఎవరూ ఊహించని విధంగా చాలా సన్నగా మారిపోయింది కాజల్. మళ్లీ పూర్వ వైభవం వచ్చిందని చెప్పొచ్చు. ఇలా చూడబోతుంటే కుర్ర హీరోయిన్లకే ఆమె కాంపిటీషన్ ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ నయా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అవుతున్న కాజల్
కాజల్ చివరగా `కన్నప్ప`లో నటించింది. ఇందులో పార్వతీదేవిగా మెరిసింది. అలాగే బాలీవుడ్‌లో `సికందర్` చిత్రంలో నటించింది. తల్లి అయినా కూడా నటనని కొనసాగిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు యంగ్ హీరోయిన్లకి ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తోంది కాజల్. ప్రస్తుతం కాజల్ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

